Breaking News

26న యుద్ధనౌకలు జాతికి అంకితం

Published on Mon, 08/11/2025 - 03:00

సాక్షి, విశాఖపట్నం: మన దేశంలోని రెండు షిప్‌యార్డుల్లో రూపుదిద్దుకున్న రెండు యుద్ధనౌకలు ఈ నెల 26న భారత నౌకాదళంలో చేరనున్నాయి. అత్యాధునిక ఫ్రంట్‌లైన్‌ స్టీల్‌ ఫ్రిగేట్‌ యుద్ధనౌకలు రెండింటిని జాతికి అంకితం చేసే కార్యక్రమం విశాఖపట్నం వేదికగా జరగనుంది. ముంబైలోని మజ్‌గావ్‌ డాక్‌ షిప్‌బిల్డర్స్‌ లిమిటెడ్‌ (ఎండీఎల్‌)లో ఐఎన్‌ఎస్‌ ఉదయగిరి, కోల్‌కతాలోని గార్డెన్‌ రీచ్‌ షిప్‌బిల్డర్స్‌ అండ్‌ ఇంజినీర్స్‌ (జీఆర్‌ఎస్‌ఈ)లో ఐఎన్‌ఎస్‌ హిమగిరి యుద్ధనౌకల్ని పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేశారు.

ప్రాజెక్ట్‌–17లో భాగంగా వీటిని అత్యాధునిక సాంకేతికతతో నిరి్మంచారు. ఐఎన్‌ఎస్‌ ఉదయగిరి.. నేవీ వార్‌షిప్‌ డిజైన్‌ బ్యూరో రూపొందించిన 100వ షిప్‌ కావడం మరో విశేషం. దాదాపు 6,700 టన్నుల బ­రు­వున్న ఈ యుద్ధనౌకలు శివాలిక్‌–క్లాస్‌ ఫ్రిగేట్స్‌ కంటే దాదాపు ఐదుశాతం పెద్దవి. 

ఈ రెండింటి ఆయుధాల భాగంలో సూపర్‌సోనిక్‌ సర్ఫేస్‌–టు–సర్ఫేస్‌ క్షిపణులు, మీడియం రేంజ్‌ సర్ఫేస్‌–టు–ఎయిర్‌ క్షిప­ణులు, 76ఎంఎం ఎంఆర్‌ గన్స్‌తో పాటు యాంటీ–సబ్‌మెరైన్‌/అండర్‌వాటర్‌ వెపన్‌ సిస్టమ్స్‌ ఉన్నాయి. భారతీయ నౌకాదళ పటిష్టత, సత్తాని ప్రపంచానికి చాటిచెప్పే ఈ కార్యక్రమాన్ని తూర్పు నౌకాదళ ప్రధాన కేంద్రమైన విశాఖలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు నేవీ అధికారులు తెలిపారు. 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)