Breaking News

మరికొంతకాలం ‘ఈవీ’లకు ఊరట

Published on Tue, 03/19/2024 - 05:19

సాక్షి, అమరావతి: ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌(ఈవీ)ను కొనా­లను­కునేవారికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈ నెలాఖరుతో ఫేమ్‌–2 పథకం ముగు­స్తున్న తరుణంలో మరో కొత్త పథకాన్ని ప్రవేశ­పెట్టింది. ఎలక్ట్రిక్‌ మొబిలిటీ ప్రమోషన్‌ స్కీమ్‌ పేరుతో తీసుకువచ్చిన ఈ పథకానికి రూ.500 కోట్లు కేటాయించింది. మార్చి 31తో ఫేమ్‌–2 పూర్తవగానే ఏప్రిల్‌ 1 నుంచి కొత్త పథకం అమలులోకి వస్తుందని కేంద్ర పునరుత్పాదక విద్యుత్‌ మంత్రిత్వ శాఖ  వెల్లడించింది. ఈ పథకం ఈ ఏడాది జూలై చివరి వరకూ అమలులో ఉండనుంది. దీని ప్రకారం కొత్తగా విద్యుత్‌ వాహనాలు కొనుగోలు చేసే వారికి టూ వీలర్లకు కిలోవాట్‌కు రూ. 10 వేలు చొప్పున గరిష్టంగా రూ. 25 వేలు, త్రీ వీలర్లకు రూ. 50 వేల వరకూ ప్రయోజనం చేకూరనుంది.

విద్యుత్‌ వాహనాల కోసం కేంద్రం ఫాస్టర్‌ అడాప్షన్‌ అండ్‌ మాన్యుఫాక్చరింగ్‌ ఆఫ్‌ ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ (ఎఫ్‌ఏఎంఈ) పథకాన్ని 2019లో తీసుకువచ్చింది. నిజానికి ఈవీలపై ప్రోత్సాహకాలను కేంద్రం తగ్గిస్తూ వస్తోంది. గతేడాది మే వరకూ 15 శాతం నుంచి 40 శాతం వరకూ సబ్సిడీ ఇచ్చేది. జూన్‌ తర్వాత వాహన ధరలో కేవలం 15 శాతం గానీ లేదా కిలోవాట్‌ హవర్‌ (కెడబ్ల్యూహెచ్‌)కు రూ. 10 వేలుగానీ ఏది తక్కువైతే అది మాత్రమే సబ్సిడీ ఇవ్వడం ప్రారంభించారు. రానున్న మూడేళ్లలో 1 మిలియన్‌ ఈవీ అమ్మకాల లక్ష్యాన్ని చేరుకోనున్నామని, ఆ తర్వాత సబ్సిడీని కొనసాగించలేమని కూడా కేంద్రం తేల్చేసింది. 

ఆదర్శంగా ఏపీ ‘ఈవీ’ ప్రోత్సాహం
మన రాష్ట్రం ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ను ప్రోత్సహించడానికి ప్రత్యేక విధివిధానాలను రూపొందించింది. అవి దేశ వ్యాప్తంగా ఆదర్శంగా నిలుస్తున్నాయి. పర్యావరణ పరిరక్షణలో భాగంగా విద్యుత్‌ వాహనాలకు ఏపీ అందిస్తున్న తోడ్పాటు భేష్‌ అని ఇండియా ఎలక్ట్రిక్‌ వెహికల్‌ మార్కెట్‌ రౌండప్‌ 2023 నివేదిక కొనియాడింది. 2030 నాటికి 30 శాతం ఈవీ కార్లు, 80 శాతం ఈవీ టూ వీలర్లు, 70 శాతం ఈవీ కమర్షియల్‌ వెహికిల్స్‌ ప్రవేశపెట్టాలని కేంద్రం లక్ష్యంగా నిర్దేశించింది. ఇందుకు తోడ్పాటునందిస్తున్న నాలుగు రాష్ట్రాల్లో ఏపీ ముందు వరుసలో ఉందని నివేదిక తెలిపింది.

2030 నాటికి మొత్తం పెట్రోల్, డీజిల్, గ్యాస్‌ వాహనాల్లో సగం విద్యుత్‌ వాహనాలే ఉండాలనే లక్ష్యాన్ని ఏర్పరచుకున్న ఏపీ చొరవను ఆదర్శంగా తీసుకోవాలని ఇతర రాష్ట్రాలకు ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్‌ లిమిటెడ్‌ (ఈఈఎస్‌ఎల్‌) వంటి కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలు సూచించాయి. ఈవీ ప్రమోషన్‌కు వివిధ విధానాల ద్వారా సహకరిస్తూ, ప్రోత్సాహకాలను అందించడంలో ఆంధ్రప్రదేశ్‌ ముందుందని ఎనర్జీ సొల్యూషన్స్‌ సంస్థ వెల్లడించింది. కాగా ఏపీలో ప్రస్తుతం దాదాపు 65 వేల విద్యుత్‌ వాహనాలున్నాయి. భవిష్యత్తులో విద్యుత్‌ వాహనాల వినియోగం రాష్ట్రంలో భారీగా పెరగనుందని ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) అభిప్రాయపడింది.

2034 నాటికి దాదాపు 10.56 లక్షల వాహనాలు రాష్ట్ర రోడ్లపై తిరిగే అవకాశం ఉందని, వీటన్నిటి కోసం 677 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ అవసరం అవుతుందని, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విద్యుత్‌ ప్రణాళిక (ఏపీ స్టేట్‌ ఎలక్ట్రిసిటీ ప్లాన్‌)లో వెల్లడించింది. దీనికి తగ్గట్టు రాష్ట్ర ప్రభుత్వం వివిధ ప్రాంతాల్లో సుమారు 400 ఈవీ ఛార్జింగ్‌ స్టేషన్‌లను ఏర్పాటు చేస్తోంది. రోడ్డు పన్ను, రిజిస్ట్రేషన్‌ ఫీజు మినహాయింపు వంటి ప్రయోజనాలను కల్పిస్తోంది. లక్ష మంది ఉద్యోగులకు ఈవీలను వాయిదా పద్ధతిలో ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రణాళిక రచించింది.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)