Breaking News

అణ్వాయుధ సామర్థ్య క్షిపణి ప్రయోగం విజయవంతం

Published on Fri, 12/26/2025 - 06:12

సాక్షి, విశాఖపట్నం: అణ్వాయుధ పరీక్షల్లో భారత రక్షణ దళం మరోసారి సత్తా చాటింది. విశాఖ తీరం వేదికగా అత్యంత కీలకమైన ప్రయోగాన్ని నౌకాదళం విజయవంతంగా నిర్వహించింది. అణ్వాయుధ సామర్థ్యం గల కే–4 క్షిపణిని అరిఘాత్‌ జలాంతర్గామి నుంచి బుధవారం ప్రయో­గించారు. దీంతో శత్రుదేశాల దాడిని వ్యూహాత్మకంగా నిరోధించే సామర్థ్యం భారత్‌కు మరింత పెరి­గిందని రక్షణ శాఖ అధికారులు వెల్లడించారు. అరిఘాత్‌ నుంచి కే–4 బాలిస్టిక్‌ మిసైల్స్‌ ప్రయోగం చేయడం ఇది రెండోసారి. గతేడాది నవంబర్‌లోనూ ఈ ప్రయోగం నిర్వహించారు. ఇండో పసిఫిక్‌ ప్రాంతంలో ఈ ప్రయోగం ప్రత్యర్థులకు ఓ హెచ్చరిక అని రక్షణ వర్గాలు చెబుతున్నాయి. 

ఆసియాలో రెండో దేశంగా భారత్‌ 
ఈ ప్రయోగంతో ఆసియా దేశాల్లో చైనాతో పోటీగా భారత్‌ నిలిచింది. ఇప్పటి వరకూ సబ్‌మెరైన్ల నుంచి మిసైల్‌ దాడి చెయ్యగల సామర్థ్యం ఆసియా దేశాల్లో చైనాకు మాత్రమే ఉండేది. కే–4 బాలిస్టిక్‌ క్షిపణి వరుస ప్రయోగాల తర్వాత సబ్‌మెరైన్‌ నుంచి అణుదాడి చేయగల సామర్థ్యం కలిగి ఉన్న ఆసియాలో రెండో దేశంగా భారత్‌ చరిత్ర సృష్టించింది. భవిష్యత్‌లో మరో అణు జలాంతర్గామి భారత్‌ అమ్ముల పొదిలోకి చేరనున్న క్రమంలో 5 వేల కి.మీ. రేంజ్‌ ఉన్న కే–5 మిసైల్స్‌ని కూడా ప్రయోగించే సామర్థ్యం మున్ముందు భారత్‌ సొంతం కానుందని, కే–5 సామర్థ్యం కూడా కలిస్తే, అణుదాడిలో ఇండియా తిరుగులేని శక్తిగా అవతరిస్తుందని రక్షణ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.

కే– 4 బాలిస్టిక్‌ మిసైల్‌ సత్తా ఇదీ
కే–4 బాలిస్టిక్‌ మిసైల్‌ అంటే కలామ్‌–4 అని అర్థం. పూర్తి అణు సామర్థ్యం కలిగిన ఇంటరీ్మడియట్‌ రేంజ్‌ సబ్‌మెరైన్‌ లాంచ్‌ బాలిస్టిక్‌ క్షిపణిగా దీన్ని డిఫెన్స్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌(డీఆర్‌డీవో) తయారు చేసింది. ఐఎన్‌ఎస్‌ అరిఘాత్‌లో ఈ క్షిపణి అమర్చి ఉంటుంది. 3,500 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్న లక్ష్యాల్ని సులువుగా ఛేదించగల సత్తా కే–4 సొంతం. 17 టన్నుల బరువు, 10 మీటర్ల పొడవు, 4.3 మీటర్ల వెడల్పు ఉన్న ఈ మిసైల్‌ 2,500 కిలోల వరకు న్యూక్లియర్‌ వార్‌హెడ్‌ని మోసుకెళ్లగల సామర్థ్యం కలిగి ఉంటుంది.

Videos

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)