Breaking News

కలవరపెడుతోన్న బెబ్బులుల మరణాలు!

Published on Mon, 06/23/2025 - 06:14

సాక్షి, అమరావతి: దేశంలో పెద్ద పులుల భద్రతపై మరోసారి తీవ్ర చర్చ మొదలైంది. ఒకవైపు వాటి సంఖ్య పెరుగుతున్నట్లు కనబడుతున్నా మరోవైపు మరణాల సంఖ్య కలవరపెడుతోంది. నేషనల్‌ టైగర్‌ కన్సర్వేషన్‌ అథారిటీ (ఎన్‌టీసీఏ) తాజా గణాంకాల ప్రకారం ఈ ఏడాదిలో ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 91 పులులు మృతి చెందాయి. అంటే నెలకు సగటున 15 పులులు మృత్యువాత పడుతున్నాయి. గతేడాది నమోదైన 126 మరణాలతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ. 2019 నుంచి 2023 మధ్య దేశవ్యాప్తంగా 628 పులుల మృతి చెందాయి.

 ఈ ఏడాది ఇప్పటి వరకు నమోదైన 91 పులుల మరణాల్లో అత్యధికంగా మహారాష్ట్రలో 26, మధ్యప్రదేశ్‌లో 24 చోటుచేసుకున్నాయి. కేరళలో 9, అసోంలో 8, ఉత్తరాఖండ్‌లో 7, కర్ణాటక, ఉత్తరప్రదేశ్‌లలో 4 చొప్పున, తెలంగాణలో ఒకటి, మిగిలినవి ఆయా రాష్ట్రాల్లో మరణించినట్లు గుర్తించారు. వీటిలో కొన్ని రైలు ప్రమాదాల వల్ల జరగ్గా, కొన్ని వ్యాధుల వల్ల, మరికొన్ని మానవ–వన్యప్రాణి ఘర్షణల వల్ల చోటుచేసుకున్నాయి. మృతి చెందిన 91 పులుల్లో 42 వాటి సంరక్షిత ప్రాంతాల్లోనే (టైగర్‌ రిజర్వులు) ప్రాణాలు కోల్పోయాయి.  

వేటగాళ్లు్ల చంపిన పులులు 24 
వన్యప్రాణి సంరక్షణ కోసం పనిచేస్తున్న వైల్డ్‌ లైఫ్‌ ప్రొటెక్షన్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియా (డబ్ల్యూపీఎస్‌ఐ) లెక్కల ప్రకారం ఈ ఏడాది ఇప్పటి వరకు 120 పులులు మృత్యువాత పడ్డాయి. అందులో 96 సహజ, మానవ–వన్యప్రాణి సంఘర్షణల వల్ల మృతి చెందినట్లు తేలింది. 24 పులుల్ని వేటగాళ్లు చంపినట్లు వార్తలు వచ్చాయి. గత 12 ఏళ్లలో దేశంలో మొత్తం 1,386 పులులు మరణించాయని డబ్ల్యూపీఎస్‌ఐ తెలిపింది.  

సవాలుగా మారిన పులుల సంరక్షణ.. 
ఆవాసాల కోసం కొన్నిచోట్ల పులుల మధ్య తీవ్ర­మైన టెరిటోరియల్‌ యుద్ధాలు జరుగుతున్నాయి. ఘర్షణలతో మృత్యువాత పడుతున్నాయి. నగరీకరణ, రహదారుల విస్తరణ, వ్యవసాయానికి అడవుల వినియోగం వల్ల టైగర్‌ రిజర్వులు కుంచించుకుపోవడంతో వాటి ఆవాసాలు తగ్గిపోతున్నాయి. ఎన్‌టీసీఏ లెక్కల ప్రకారం దేశంలో పులుల సంఖ్య 2010లో 1,706గా ఉండగా.. 2022 నాటికి అవి 3,700కి పెరిగాయి. ప్రస్తుతం 1,57,000 చద­రపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న పులుల ఆవాసాలు సామాజిక–ఆరి్థక కారణాల వల్ల క్షీణిస్తున్నాయి.

వాటి రక్షిత, ఆవాస ప్రాంతాలను విస్తరించడం, వేటగాళ్లపై కఠిన చర్యలు తీసుకోవడం, పులుల ఆవాసాల సమీపంలో నివసించే వారికి స్థిరమైన జీవనోపాధి కల్పించడం, ముందస్తు హెచ్చరిక వ్యవస్థల ద్వారా మానవ–వన్యప్రాణుల సంఘర్షణలను తగ్గించే అవకాశాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. అడవులను అనుసంధానించే టైగర్‌ కారిడార్‌ల ఏర్పాటు, రైలు మార్గాల్లో హీట్‌–సెన్సింగ్‌ అలర్ట్‌లు, స్పీడ్‌ లిమిట్‌లు విధించాలని సూచిస్తున్నారు.  

మృతి చెందిన రణథంబోర్‌ రాణి 
రాజస్తాన్‌లోని రణథంబోర్‌ టైగర్‌ రిజర్వ్‌లో 14 ఏళ్ల ప్రఖ్యాత ఆడపులి యారోహెడ్‌ శుక్రవారం మృతి చెందిందని అటవీ అధికారులు ధ్రువీకరించారు. బోన్‌ క్యాన్సర్, మెదడు ట్యూమర్‌ వల్ల మరణించినట్లు వెల్లడించారు. ఈ పులికి ఎంతో ప్రత్యేకత ఉంది. ముఖంపై బాణం(యారో) ఆకారంలో ఉన్న చారల వల్ల దీనికి యారోహెడ్‌ అనే పేరు వచ్చింది. ఫొటోగ్రాఫర్లు, పర్యాటకులకు ఎంతో ప్రీతిపాత్రమైన ఈ పులిని ‘క్రొకడైల్‌ హంటర్‌’ అని కూడా పిలిచేవారు. సరస్సులోని మొసళ్లను వేటాడే అరుదైన పులిగా యారోహెడ్‌ గుర్తింపు పొందింది.   

Videos

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)