Breaking News

భారత్, యూఎస్‌ రక్షణ బంధం మరింత బలోపేతం

Published on Wed, 03/20/2024 - 05:10

సాక్షి, విశాఖపట్నం: భారత్, అమెరికా మధ్య రక్షణ విభాగ బంధం మరింత బలోపేతం కానుందని భారత్‌–యూఎస్‌ రాయబారి ఎరిక్‌ గార్సెట్టి స్పష్టం చేశారు. పసిఫిక్‌ సముద్రజలాల్లో అన్ని దేశాలూ స్వేచ్ఛాయుత వాణిజ్య కార్యకలాపాలు సాగించేలా చేయడమే తమ లక్ష్యమన్నారు. తూర్పు నౌకాదళ ప్రధాన కేంద్రం విశాఖపట్నంలో భారత్, యూఎస్‌ త్రివిధ దళాల ఆధ్వర్యంలో టైగర్‌ ట్రయాంఫ్‌ యుద్ధ విన్యాసాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా.. ఐఎన్‌ఎస్‌ జలాశ్వా యుద్ధనౌక ఆన్‌బోర్డుపై ఇరుదేశాల ప్రతినిధులు మంగళవారం మీడియా సమావేశంలో మాట్లాడారు.

ఎరిక్‌ మాట్లాడుతూ సాగర జలాల సరిహద్దుల్లో చొరబాట్లు, సముద్రపు దొంగల ఆట కట్టించేందుకు భారత్‌తో కలిసి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నామని తెలిపారు. యూఎస్‌ సెవెన్త్‌ ఫ్లీట్‌ రిజర్వ్‌ వైస్‌ కమాండర్‌ రియర్‌ అడ్మిరల్‌ జోక్విన్‌ జె మార్టినైజ్‌ మాట్లాడుతూ టైగర్‌ ట్రయాంఫ్‌ నిర్వహణతో భారత్, యూఎస్‌ మధ్య ఉన్న బంధాన్ని ప్రపంచానికి చాటిచెబుతున్నామన్నారు.

తూర్పు నౌకాదళాధిపతి వైస్‌ అడ్మిరల్‌ రాజేష్‌ పెందార్కర్‌ మాట్లాడుతూ టైగర్‌ ట్రయాంఫ్‌ విన్యాసాల్లో భాగంగా హార్బర్‌ ఫేజ్‌లో విపత్తు, యుద్ధ సమయంలో రెండు దేశాల మధ్య పరస్పర సహకారాన్ని ఎలా అందిపుచ్చుకోవాలనే అంశాలతో పాటు ప్రీసెయిల్‌ చర్చలు, వృత్తిపరమైన విషయాలపై ఎక్స్‌పర్ట్స్‌ ఎక్స్చేంజిలు జరగనున్నాయని తెలిపారు. విన్యాసాల్లో భాగంగా ఈస్ట్రన్‌ నేవల్‌ కమాండ్‌ ప్రధాన కేంద్రంలో కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్, జాయింట్‌ రిలీఫ్, మెడికల్‌ క్యాంపు ఏర్పాటు చేశామని వివరించారు.

29న కాకినాడలో మెడికల్‌ రిలీఫ్‌ క్యాంపుతో పాటు.. జాయింట్‌ ఎక్సర్‌సైజ్‌ నిర్వహించనున్నట్లు తెలిపారు. యూఎస్‌ఎస్‌ సోమర్‌సెట్‌ యుద్ధ నౌక కమాండింగ్‌ ఆఫీసర్‌ కెప్టెన్‌ మిచైల్‌ బ్రాండ్, ఈస్ట్రన్‌ ఫ్లీట్‌ ఫ్లాగ్‌ ఆఫీసర్‌ కమాండ్‌ రియర్‌ అడ్మిరల్‌ రాజేష్‌ ధన్‌కర్, ఐఎన్‌ఎస్‌ జలశ్వా కమాండింగ్‌ అధికారి కెప్టెన్‌ సందీప్‌ బిశ్వాల్‌తో పాటు ఇరు దేశాల త్రివిధ దళాల ప్రతినిధులు పాల్గొన్నారు.

#

Tags : 1

Videos

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)