Breaking News

కుర్చీకోసం ఎమ్మెల్యే మాధవీరెడ్డి చిందులు

Published on Sat, 08/16/2025 - 05:07

సాక్షి ప్రతినిధి, కడప: స్వాతంత్య్రదిన వేడుకల్లో వేదికపై తనకు కుర్చీవేయలేదని కడప ఎమ్మెల్యే మాధవీరెడ్డి అధికారులపై చిందులేశారు. ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ అయిన తనకు వేదికమీద చోటుకల్పించలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జేసీపై గుడ్లురిమి కేకలేశారు. వైఎస్సార్‌ కడప జిల్లా కేంద్రం కడపలోని పోలీసు పరేడ్‌ గ్రౌండ్స్‌లో శుక్రవారం స్వాతంత్య్రదిన వేడుకలు జరిగాయి. మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ ద్వారా ఈ వేడుకలు నిర్వహించేందుకు ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. ఉదయం 9 గంటలకు జెండా ఆవిష్కరించిన మంత్రి పరేడ్‌ పరిశీలన అనంతరం సందేశం చదివి విన్పించారు. 

వేదికపైన మంత్రి ఫరూక్, కలెక్టర్, ఎస్పీ, జాయింట్‌ కలెక్టర్‌ ఆశీనులయ్యారు. ప్రొటోకాల్‌ ప్రకారం స్టేజ్‌పైన ఎమ్మెల్యేకి అనుమతి లేదు. వీఐపీలకు వేదిక పక్కన సీట్లు కేటాయించారు. ఎమ్మెల్యే మాధవీరెడ్డి దంపతులు 10.34 గంటలకు వేడుకలకు వచ్చారు. అప్పటికే వేడుకలు ప్రారంభమై చాలా సమయం కావడంతో.. వీఐపీలకు కేటాయించిన కుర్చీల్లో కూడా కలెక్టర్, ఎస్పీ, జేసీ కుటుంబ సభ్యులు కూర్చున్నారు. వేదికపై కుర్చీ లేకపోవడంతో ఎమ్మెల్యే ఆగ్రహించారు. 

ఎమ్మెల్యే దంపతులు స్టేజీ వద్ద నిలబడి ఉండటాన్ని గమనించిన డీఆర్వో విశ్వేశ్వరనాయుడు వారివద్దకెళ్లి కూర్చోవాలని ఆహ్వానించారు. దీంతో ఎమ్మెల్యే.. ప్రొటోకాల్‌ తెలియదా? అంటూ ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తరువాత ఆర్డీవో జాన్‌ ఇర్విన్, కమిషనర్‌ మనోజ్‌రెడ్డి వెళ్లి ఆహ్వానించారు. వారిపైన కూడా ఎమ్మెల్యే చిర్రుబుర్రులాడారు. జాయింట్‌ కలెక్టర్‌ అదితిసింగ్‌ వెళ్లి ఆహ్వానించారు. అంతే ఎమ్మెల్యే ఒక్కమారుగా.. పిల్లాటలాడుతున్నారంటూ  గుడ్లురిమి చూశారు. సర్దిచెప్పేందుకు ప్రయత్నించినా ఎమ్మెల్యే వినిపించుకోకపోవడంతో జేసీ వెనుదిరిగి వెళ్లారు. 

ఆపై కలెక్టర్‌ చెరుకూరి శ్రీధర్‌ వెళ్లి ఆహ్వానించగా.. థ్యాంక్స్‌ సార్‌ మీ మర్యాదకు.. అంటూ ఎమ్మెల్యే బదులిచ్చారు. 20 నిమిషాల అనంతరం ఎమ్మెల్యే దంపతులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. లేని ప్రొటోకాల్‌ కోసం ఆగ్రహించి ఎమ్మెల్యే మాధవీరెడ్డి మరోమారు వివాదాస్పదంగా నిలిచారు. ఎమ్మెల్యే ఒకవైపు సమయపాలన పాటించకపోగా.. మరోవైపు వేడుకలకు హాజరుకావడంలేదని ఆర్డీవో జాన్‌ ఇర్విన్‌కు సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. ఆలస్యంగా వచి్చన తర్వాత కూడా హుందాగా వ్యవహరించకుండా కుర్చీకోసం అధికారులపై చిందులు వేయడాన్ని పలువురు తప్పుబడుతున్నారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)