Breaking News

టెకీలూ.. కాస్త విశ్రమించండి

Published on Sun, 07/28/2024 - 05:44

సాక్షి, అమరావతి: జీవితంలో త్వరగా స్థిరపడాలంటే ఐటీ ఉద్యోగమే భేష్‌ అని చాలామంది అనుకుంటారు. మంచి వేతనం.. వారాంతపు సెలవులు వంటి వెసులుబాట్లు సౌకర్యాలెన్నో వారికి ఉంటాయని చెబు­తారు. టెకీల జీవితంలో ఇది నాణేనికి ఒక వైపు మాత్రమే. రెండో వైపు పరిశీలిస్తే వారిని ఒత్తిడి, ఆరోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయి. ఒత్తిడి వల్ల తరచూ వెన్నునొప్పి వంటి సమస్యలతో టెకీలు ఇబ్బందులు పడుతున్నారు. యాంత్రిక జీవన శైలితో 25 నుంచి 40 ఏళ్లలోపే ఇబ్బందులు తలెత్తున్నాయి. ఒకేచోట గంటల తరబడి కూర్చుని పని చేయడం, శారీరక శ్రమ లేమి వంటి కారణాలతో 40 ఏళ్లు పైబడిన వారిలో ఆరోగ్య సూచీలు ప్రమాదకర స్థాయికి చేరుకుంటున్నాయి. 

43% మందిలో ఆరోగ్య సమస్యలే 
దేశంలో 43 శాతం మంది టెకీలు పని నుంచి ఉత్పన్నమయ్యే ఆరోగ్య సమస్యలతో సతమతం అవుతున్నారు. ఈ అంశాన్ని నాలెడ్జ్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్, ఇండస్ట్రీ (కేసీసీఐ) సంస్థ తన అధ్యయనంలో వెల్లడించింది. టెకీల్లో సగానికిపైగా వారానికి సగటున 52.50 గంటలు పని చేస్తున్నారు. అస్థిరమైన పని షెడ్యూళ్లతో 26 శాతం మంది నిద్ర లేమి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 51 శాతం మంది రోజుకు సగటున ఐదున్నర గంటల నుంచి ఆరు గంటలు మాత్రమే నిద్రపోతున్నారు. 

ఎక్కువ మందిలో వెన్నునొప్పి 
ఐటీ ఉద్యోగుల్లో ఎక్కువ మందిలో మెడ, వెన్నునొప్పి సాధారణంగా ఉంటోంది. ఈ సమస్యలతో తమ దగ్గరకు వచ్చే యువతలో అత్యధికులు టెకీలే ఉంటున్నట్టు వైద్యులు చెబుతున్నారు. టెకీలు గంటల తరబడి కార్యాలయాల్లో కూర్చుని పనిచేస్తుంటారు. మెడ ఎముక, భుజం ఎముక వెన్నెముకతో అనుసంధానమై ఉంటాయి. ఎక్కువసేపు కూర్చుని పనిచేయడం వల్ల మెడ, వెన్నెముకలో ఒకచోట అమరిక అస్తవ్యస్తమై ఇతర భాగా లపై ప్రభావం పడుతుంది. ఈ క్రమంలో కూర్చోవడంతో పాటు, నిలబడినప్పుడు భంగిమ సరిగా ఉండేలా చూసుకోవాలని వైద్యు లు సూచిస్తున్నారు. 

నిల్చున్నప్పుడు తల, భుజాల వెనుక భాగం, పిక్కలు గోడకు తాకి ఉండేలా చూసుకోవాలంటున్నారు. ఫోన్, ల్యాప్‌ట్యాప్‌ చూసేప్పుడు సహజంగానే మెడ ముందుకు వాల్చకుండా ఉండాలి. ఒత్తిడిని అధిగమించడానికి యోగా, మెడిటేషన్‌ చేయాలని మానసిక వైద్యులు సూచిస్తున్నారు. ఆఫీస్‌ నుంచి ఇంటికి రాగానే కుటుంబ సభ్యులు, పిల్లలతో గడపడం, ఇష్టమైన సంగీతం వినడం, సినిమాలు చూడటం ద్వారా ఒత్తిడి నుంచి విముక్తి పొందాలంటున్నారు.   

యాంత్రిక జీవన శైలితో ఇబ్బందులు పడుతున్న టెకీల వయసు  25 - 40

సగానికి పైగా టెకీలు వారానికి (5 రోజులు) సగటున పనిచేస్తున్న గంటలు   52.50

అస్థిరమైన పని షెడ్యూళ్లతో నిద్రలేమిని ఎదుర్కొంటున్నవారు (శాతంలో) 26

రోజుకు సగటున ఐదున్నర గంటలు మాత్రమే నిద్రపోతున్న టెకీలు (శాతంలో) 51

ఐసీఎంఆర్‌ ఏం చెబుతోందంటే.. 
పనిలో ఎంత బిజీగా ఉన్నా శారీరక శ్రమను మాత్రం నిర్లక్ష్యం చేయొద్దని.. శరీరాన్ని కాస్త అటూఇటూ కదల్చాలని ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) సూచిస్తోంది. ఆ సూచనలు ఇవీ..
» ఎంత బిజీగా ఉన్నప్పటికీ పనిచేసే ప్రదేశాల్లో, ఇతర సందర్భాల్లో కుర్చీకే అతుక్కుపోకుండా పనిచేసే ప్రదేశాల్లో స్టాండింగ్‌ డెస్క్‌ ఉపయోగించాలి. లేదంటే ప్రతి అరగంటకు ఒకసారి లేచి నిలబడాలి.  
» ప్రతి కొన్ని గంటలకు లేచి 5 నుంచి 10 నిమిషాలు అటూఇటూ నడవాలి.  
» ఇల్లు లేదా పని ప్రదేశాల్లో ఫోన్‌ మాట్లాడేప్పుడు నడుస్తూ ఉండాలి. లిఫ్ట్, ఎలివేటర్‌కు బదులు మెట్లను వినియోగించాలి.  
» టీవీ చూస్తున్నప్పుడు కుర్చికే పరిమితం కాకూడదు. కమర్షియల్‌ బ్రేక్‌ సమయంలో లేచి తిరగాలి.  
»  రోజుకు 30 నుంచి 60 నిమిషాలు మితమైన, తీవ్రమైన వ్యాయామం చేయాలి. వారంలో ఐదు రోజులు వ్యాయామం తప్పనిసరి. 
»  రోజులో 8 గంటలు తప్పనిసరిగా నిద్రపోవాలి.   

Videos

లోన్ కట్టలేదని వేధిస్తున్నారా? RBI రూల్స్ ఇవే!

దేనితో కొట్టాలి వీళ్లని.. పోలీసులే అభ్యర్థులను లాక్కెళుతున్నారు

సల్మాన్ ఖాన్‌తో పనిచేస్తే ఇదే గతి.. ఈ అనిల్ పండిత్ ఎవరు..?

PF ఉన్నవారందరికీ పెన్షన్ వస్తుందా? అసలు లెక్కలు తెలుసుకోండి..

వేటకొడవల్లితో TDP రౌడీలు దాడి.. బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

తిరుపతిలో దొంగల బీభత్సం 90 గ్రాముల బంగారం చోరీ!

టీడీపీ దాడులకు భయపడే ప్రసక్తేలేదు.. సజ్జల మాస్ వార్నింగ్

వైరల్ అవుతున్న వీడియో, దారుణం.. వెంటబడి మరి TDP గూండాల అరాచకం

టీడీపీ గూండాలు... కడపలో కత్తిపోట్లు.. పులివెందులలో కాల్పుల కలకలం

ఒక్కొక్కడి పేరు అడ్రస్ నోట్ చేస్తున్న.. సిగ్గు లేకుండా ఫోన్ ఆఫ్ చేసి పారిపోయారు

Photos

+5

యాంకర్ అనసూయ ఇంట్లో దసరా సెలబ్రేషన్ ఇలా (ఫొటోలు)

+5

ఫ్యాషన్ షో కోసం తృప్తి దిమ్రి క్రేజీ గ్లామర్ (ఫొటోలు)

+5

దసరా స్పెషల్.. చూడముచ్చటగా విజయ్-రష్మిక జంట (ఫొటోలు)

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)