Breaking News

చలిలో బెల్స్‌ పాల్సీ ముప్పు!.. పెరుగుతున్న ముఖపక్షవాతం

Published on Sun, 12/14/2025 - 10:21

కర్నూలు(హాస్పిటల్‌): మూతి వంకర పోవడం, అ లాంటి నోటి నుంచి నీరు కారుతుండటం, తినాల­న్నా, తాగాలన్నా ఇబ్బంది వంటి లక్షణాలు కనిపి­స్తే దానిని వైద్యపరిభాషలో బెల్స్‌ పాల్సీ అంటా­రు. తెలుగులో దానిని ముఖ పక్షవాతమని పిలు­స్తా­రు.  శీతాకాలంలో ఇలాంటి ఇబ్బందులు మరీ ఎక్కువవుతాయి. శీతల గాలుల నుంచి రక్షణ పొందడమే ఈ సమస్య రాకుండా నివారించే చర్య అని వైద్యులు చెబుతున్నారు. ఉమ్మడి జిల్లాలో ఇటీవల కాలంలో చలిగాలులు తీవ్రమయ్యాయి. 

రాత్రి పూ­టే కాదు పగలు కూడా వాతావరణం చల్లగా ఉంటోంది. ఈ కారణంగా ఇల్లు, కార్యాలయం ఏదై­నా, ఎక్కడైనా ఫ్యాన్‌ వేయాలన్నా జంకుతున్నారు. విపరీతమైన చలి ప్రజలను తీవ్రంగా వణికిస్తోంది. చలికారణంగా వాతావరణంలో ఉష్ణోగ్రతలు పగ­లు 20 డిగ్రీల సెల్సియస్‌కు, రాత్రి 13 డిగ్రీల సె­ల్సియస్‌కు పడిపోతున్నాయి. చాలా మందికి వృత్తి, ఉద్యోగం, వ్యాపారాల రీత్యా చల్లగాలికి బయటకు వెళ్లాల్సి ఉంటోంది. మరికొందరు ఉదయం వేళల్లో వాకింగ్‌కు వెళ్తుంటారు. 

ఇలా చల్లగా ఉన్న సమయంలో బయటకు వెళ్లే వారు సరైన జాగ్రత్త­లు తీసుకోకపోతే చెవుల్లో నుంచి చల్లగాలి లోపలికి వెళ్లి ముఖ పక్షవాతానికి దారి తీస్తుంది. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని న్యూరాలజి, జనరల్‌ మెడిసిన్, క్యాజువాలిటీ విభాగాలకు ప్రతి వారం ముగ్గురు నుంచి నలుగురు ముఖ పక్షవాతానికి (బెల్స్‌పాల్సీ) గురై చికిత్స నిమిత్తం వస్తున్నారు. ప్రైవేటు ఆసుపత్రులకు సైతం రోజూ 6 నుంచి 8 మంది వరకు న్యూరాలజిస్టులు, జనరల్‌ ఫిజీషియన్ల వద్దకు చికిత్సకు వెళ్తున్నారు.  

కారణాలు 
బెల్స్‌పాల్సీకి కచ్చితమైన కారణం ఉండదు. దీనికి అనేక వైరస్‌లు కారణమవుతాయి. వీటిలో హెర్పస్‌ సింప్లెక్స్, హెర్పెస్‌ జోస్టర్, హెచ్‌ఐవీ, సైటోమెగలోవైరస్, ఎప్సీ›టన్‌ బార్‌ వైరస్‌లు ప్రధానమైనవి. మధుమేహం, గర్భిణులు, గాయం, వాపు, ముఖ నరాలకు హాని కలిగించే ఏదైనా కారణం ముఖ పక్షవాతానికి దారి తీస్తుంది. చలివాతావరణంలో ఈ వైరస్‌లు మనుగడు ఎక్కువగా సాగిస్తాయి కాబట్టి అధిక శాతం వీటి ప్రభావానికి గురవుతుంటారు. వీరు వైద్యుల సూచన మేరకు మందులు వాడుతూ ఫిజియోథెరపీ కూడా చేయించుకోవాల్సి ఉంటుంది.

బెల్స్‌ పాల్సీ అంటే...! 
బెల్స్‌ పాల్సీ (ముఖపక్షవాతం) అనేది ముఖంలోని నరాలకు హాని కలిగించే ఒక రకమైన ఆరోగ్య సమస్య. తద్వారా రోగి ముఖ కదలికలను వ్యక్తం చేయడం, తినడం, మాట్లాడటం వంటివి చేయలేడు.  

లక్షణాలు 
⇒ కనురెప్పలు మూసివేయడం, రెప్పలు కొట్టుకోవడం సాధ్యపడదు 
⇒ ముఖం కదిలించడంలో ఇబ్బంది 
⇒ నోరు ఒకవైపునకు వాలిపోవడం 
⇒ ముఖ ఆకృతులను సమతుల్యం చేయడంలో ఇబ్బందులు 
⇒ బెల్స్‌ పాల్సీలో వ్యక్తి తన కనుబొమ్మలను ఎగురవేయలేడు 
⇒ మాట్లాడటం, తినడంలో ఇబ్బంది

చలిలో తిరిగితే ఈ సమస్య 
గత కొన్ని రోజులుగా వాతావరణంలో ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. చలి తీవ్రంగా ఉంటోంది. చలిగాలులు  పగలు సైతం అధికమవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో చెవులకు అచ్ఛాదన లేకుండా బయటకు వెళ్లకూడదు. ఎందుకంటే  చల్లటి వాతావరణంలో వైరస్‌లు ఎక్కువగా ఉంటాయి. ఇవి మనిషి నరాలపై దాడి చేస్తాయి. దీనినే న్యూరోట్రోపిక్‌ అటాక్స్‌ అంటాము. అధిక శాతం వైరస్‌ల వల్ల బెల్స్‌ పాల్సీ వస్తుంది. కొందరిలో ఎలాంటి కారణం లేకుండా వస్తుంది. ఇలాంటి వారికి అవసరమైన మందులు ఇచ్చి చికిత్స చేస్తాము.
– డాక్టర్‌ సి. శ్రీనివాసులు, న్యూరాలజి హెచ్‌ఓడీ, జీజీహెచ్, కర్నూలు     

Videos

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

Photos

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)