Breaking News

చలికాలం.. జర భద్రం

Published on Tue, 11/18/2025 - 05:44

భీమవరం (ప్రకాశం చౌక్‌)/బుట్టాయగూడెం:  వారం రోజులు గా చలి తీవ్రత క్రమేపీ పెరుగుతోంది. సాయంత్రం 5 గంటలకే వాతావరణం చల్లబడి చలి మొదలవుతోంది. రాత్రి ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయి. చలి పెరుగుతున్న క్రమంలో పిల్లలు, వృద్ధులు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ము ఖ్యంగా గుండె సమస్యలు, డయాబెటిస్, ఆస్తమా, పొగతాగే వారు, క్యాన్సర్, ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నవారు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని చెబుతున్నారు. చలికాలంలో ముఖ్యంగా శ్వాసనాళాలు ముడుచుకుపోయే అవకాశం అధికంగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు. 

జాగ్రత్తలు తప్పనిసరి 
⇒ చర్మం పొడి బారకుండా మాయిశ్చరైజర్లు వినియోగించాలి.  
⇒ తగిన మోతాదులో నీరు కచ్చితంగా తాగాలి.  
⇒  శీతల పానియాలు, ఐస్‌క్రీమ్‌లు, కూలింగ్‌ వా టర్‌కు దూరంగా ఉండాలి.  
⇒ దుమ్ము, ధూళి ఉండే ప్రాంతాలకు దూరంగా, చలిగాలుల్లో తిరగడం మానేయాలి.   
⇒ ఇమ్యూనైజేషన్‌ వ్యాక్సిన్‌ ఏడాదికి ఒకసారి, న్యూమోనియా వ్యాక్సిన్‌ ఐదేళ్లకు ఒకసారి వై ద్యుల సూచనలతో వేయించుకోవాలి.  

⇒  ఇండోర్‌ వ్యాయామం, జిమ్‌ ప్లాన్‌ చేసుకోవాలి. 
⇒  బయటకు వెళ్లే సమయంలో తగినంత వేడిని శరీరానికి అందించే ఉన్ని దుస్తులు ధరించాలి.  
⇒ ఇంట్లో ఎవరికైనా జలుబు, దగ్గు వస్తే వైద్యుల సూచనలతో మందులు వాడాలి.  
⇒ సొంత వైద్యం సరికాదు. కుటుంబంలో ఒకరికి వాడే ఔషధాలు వేరొకరికి వినియోగించరాదు. 
⇒  శ్వాస సంబంధిత సమస్యలు ఎదురైతే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. 

ఏజెన్సీలో చలి పంజా   
పశ్చిమ గోదావరి ఏజెన్సీ ప్రాంతంలో కొద్ది రోజులుగా పగటి, రాత్రి ఉష్ణోగ్రతలు తగ్గుతున్నా యి. రోజురోజుకూ చలితీవ్రత పెరుగుతోంది.  మా రుమూల కొండ ప్రాంతాల్లోని గ్రామాల్లో ఉదయం 8 గంటలు దాటితే కానీ ప్రజలు బయటకు రాలేని, సాయంత్రం 6 గంటలకే ఇళ్లకు చేరాల్సిన పరిస్థితి. బ్యాక్టీరియా, వైరస్‌ల ప్రభావంతో చాలామంది జలుబు, దగ్గు, జ్వరాలతో బాధపడుతున్నారు. దీంతో ఆస్పత్రులకు వెళ్లే వారి సంఖ్య ఎక్కువగా ఉంది. డిసెంబర్, జనవరిలో చలి మరింత పెరిగే అవ కాశం ఉంది. మంచులో ప్రయాణాలు ప్రమాదకరమని పోలీసులు సూచిస్తున్నారు. గతంలో గిరిజన మండలాల్లో వేకువజామున మంచులో ప్రయాణం చేస్తూ ప్రమాదాలకు గురైన సంఘటనలు ఉన్నాయి.  

తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన చలి తీవ్రత

శరీరాన్ని రక్షించుకోవాలి 
శీతాకాలంలో జాగ్రత్తగా ఉండాలి. చలి నుంచి శరీరాన్ని రక్షించుకోవాలి. ఈ సీజన్‌లో వ్యాధినిరోధక శక్తిని పెంచే విటమిన్‌ సీ కలిగిన పదార్థాలు, సీజనల్‌ ఫ్రూట్స్‌ తీసుకోవాలి. గోరువెచ్చని నీటిని తీసుకోవాలి. శ్వాసకోశ సమస్యతో ఇబ్బందులు వస్తే ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు, ఏరియా ఆస్పత్రుల్లో మందులు అందుబాటులో ఉన్నాయి. మెరుగైన వైద్యం అవసరమైతే వైద్య సేవలను ఉపయోగించుకోవాలి. ముఖ్యంగా పిల్లలను, వృద్ధులు చలిలో తిరగకుండా చూసుకోవాలి.  – గీతాబాయ్, డీఎంహెచ్‌ఓ, భీమవరం 

Videos

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)