Breaking News

అరటి.. ధర అదిరింది!

Published on Thu, 08/22/2024 - 05:38

మధురమైన రుచులతో సామాన్యులకు అందుబాటులో ఉండే అరటి పండు ధర అమాంతం పెరిగింది. సామాన్యులు కొనుగోలు చేయాలంటేనే బెదిరిపోతున్నారు. నిన్నమొన్నటి వరకు ధరలు లేక తోటల్లో గెలలు చెట్లకే మగ్గిపోయిన పరిస్థితి.

 ఇప్పుడు బహిరంగ మార్కెట్‌లో భారీగా ధర పెరగడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దిగుబడి లేని సమయంలో డిమాండ్‌ పెరగడంతో మరికొందరు రైతులు  మాత్రం ఆవేదన చెందుతున్నారు. పండ్ల కొనుగోలుదారులు మాత్రం అరటి అంటే చాలు అమ్మో అనే పరిస్థితికి వచ్చారు.  

కొల్లూరు:  మారిన వాతావరణ పరిస్థితిలో అరటి దిగుబడి అంతగా లేదు. పెనుగాలులు, ఎండలు, ప్రస్తుతం వాతావరణంలో వేడి తీవ్రంగా ఉండటంతో అరటి దిగుబడి మందగించింది. జిల్లాలో సుమారు 2,379 మంది రైతులు 3,710 ఎకరాలలో అరటి సాగు చేస్తున్నారు. కర్పూర, చక్రకేళి, కూర అరటి రకాలు ఇందులో ఉన్నాయి.

ఎకరాకు 800 వరకు అరటి మొక్కలు సాగు చేస్తే 10 నెలల వ్యవధిలో పంట చేతికి అందుతుంది. ఎకరాకు సుమారు రూ. 1.50 లక్షల వరకు పెట్టుబడి అవసరం. పంట చేతికందిన అనంతరం స్థానిక మార్కెట్లలో అమ్మకాలు జరపడంతోపాటు తోటల్లోనే వ్యాపారులకు గెలలు విక్రయిస్తున్నారు. 

రాష్ట్రంలోని నెల్లూరు, ప్రకాశం, విజయవాడ, తిరుపతి ప్రాంతాలతోపాటు తెలంగాణ, తమిళనాడు, పశ్చిమబెంగాల్, ఒరిస్సా వంటి రాష్ట్రాలకు ఎగుమతులు చేస్తున్నారు. ప్రస్తుతం సాగు విస్తీర్ణంలో 5 శాతం కంటే తక్కువ తోటల్లో మాత్రమే గెలలు అందుబాటులో ఉన్నాయి. దీంతో కొరత ఏర్పడి ధరలకు రెక్కలొచ్చాయి. దీనికితోడు శ్రావణమాసంలో అధికంగా పూజలు, శుభకార్యాలు ఉండటంతో పండ్లకు డిమాండ్‌ పెరిగింది. 

వేసవిలో గెలలు కొనే వారే లేకపోవడంతో సాధారణ, మొద­టి రకం గెలలు రూ. 20 నుంచి రూ. 30కు సైతం విక్రయించిన రైతులు నష్టాలపాలయ్యారు. ప్రస్తు­తం కర్పూర అరటి మొదటి రకం రూ. 1,200, సాధా­రణ రకం రూ. 800 వరకు పలు­కుతున్నాయి. చక్రకేళి రకం గెలకు రూ. 450 వరకు ధర లభిస్తోంది. కూర అరటి  గెల రూ. 300కు అమ్ముడవుతోంది. పండ్లు డజను రూ. 80 నుంచి రూ. 120 వరకు విక్రయిస్తున్నారు.

గెల రూ. 400 పలికినా లాభమే.. 
అధిక పెట్టుబడులు పెట్టి సాగు చేస్తున్న అరటి పంటకు ప్రస్తుతం పలుకుతున్న ధరలు ఇలాగే ఎప్పుడూ ఉండవు. కనీసం గెలకు రూ. 400 వరకు పలికినా లాభాలు వస్తాయి. రెండేళ్ల పంట కాలంలో రెండు పర్యాయాలు కాపునకు వచ్చే గెలలు అధికంగా దిగుబడి వచ్చే నవంబర్‌ నుంచి రేట్లు పడిపోకుండా ఉంటే మాకు మేలు చేకూరుతుంది.   – ముత్తిరెడ్డి శ్రీనివాసరావు, రైతు, కిష్కిందపాలెం, కొల్లూరు మండలం 

#

Tags : 1

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)