Breaking News

పెరిగిన గృహావసరాల వినియోగ వ్యయం

Published on Mon, 06/10/2024 - 05:49

సాక్షి, అమరావతి: దేశంలో గృహావసరాల వినియోగ వ్యయంలో వివిధ సామాజికవర్గాల మధ్య అంతరాలు క్రమేణా తగ్గుతున్నాయి. దశాబ్దకాలంలో దేశంలో సగటు గృహావసరాల వినియోగ వ్యయం గణనీయంగా పెరిగింది. ఈ మేరకు జాతీయ గృహావసరాల వినియోగ వ్యయ(హెచ్‌సీఈఎస్‌) నివేదిక వెల్లడించింది. 

2011–12 నుంచి 2022–23 మధ్యకాలంలో దేశ పౌరులు సగటున గృహావసరాల కోసం వెచ్చిస్తున్న వ్యయాన్ని అధ్యయనం చేసి ఈ నివేదికను రూపొందించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజికవర్గాల వినియోగ వ్యయం 9.20శాతం పెరిగింది. కాగా, ఇతర వర్గాల్లో 8.5శాతం పెరిగిందని ఈ నివేదిక వెల్లడించింది. గ్రామీణ ప్రాంతాల కంటే పట్టణ ప్రాంతాల్లో గృహావసరాల వినియోగ వ్యయం అధికంగా పెరిగిందని తెలిపింది.  

హెచ్‌సీఈఎస్‌ నివేదికలోని ప్రధాన అంశాలు 
» 2011–12 దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో సగటు కుటుంబ నెల వ్యయం (ఎంపీసీఈ) రూ.1,430 ఉండగా, 2022–23లో రూ.3,773కు పెరిగింది. 
»   పట్టణ ప్రాంతాల్లో సగటు కుటుంబ నెల వ్యయం 2011–12లో రూ.2,630 ఉండగా, 2022–23లో రూ.6,459కు పెరిగింది. 
»   గృహావసరాల వినియోగ వ్యయంలో గ్రామీణ ప్రాంతాల్లో 46శాతం ఆహార పదార్థాలకు, 54శాతం ఇతర అవసరాలకు వెచ్చిస్తున్నారు.  
» పట్టణ ప్రాంతాల్లో 39శాతం ఆహార పదార్థాలకు, 61శాతం ఇతర అవసరాలకు ఖర్చు చేస్తున్నారు.  
»   సగటు గృహావసరాల వినియోగ వ్యయంలో సిక్కిం మొదటి స్థానంలో ఉండగా, ఛత్తీస్‌గఢ్‌ చివరి స్థానంలో ఉంది.  
»   ఆంధ్రప్రదేశ్‌లో ఎంపీసీఈ గ్రామీణ ప్రాంతాల్లో రూ.4,870 ఉండగా, పట్టణ ప్రాంతాల్లో రూ.6,782లుగా ఉంది.   

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)