కొత్త రైళ్లను తగ్గించి.. కోచ్‌ల సంఖ్య పెంచేలా!

Published on Tue, 09/17/2024 - 05:32

సాక్షి, అమరావతి: ప్రతిష్టా­త్మకంగా చేపట్టిన వందేభారత్‌ స్లీపర్‌ రైళ్ల కాంట్రాక్టును రైల్వే శాఖ సవరించింది. రైళ్ల సంఖ్య­ను తగ్గిస్తూ.. కోచ్‌ల సంఖ్యను పెంచుతూ కాంట్రా­క్టు­లో మార్పులు చేసింది. స్లీపర్‌ రైళ్లను ప్రవేశపెట్టే రూట్ల­ను కూ­డా కుదించాలని నిర్ణయించింది. ప్రస్తుతం నిర్వహి­స్తు­న్న చైర్‌ కార్‌ వందేభారత్‌ రైళ్లతోపాటు స్లీపర్‌ కోచ్‌లతో కూ­డిన వందేభారత్‌ రైళ్లను ప్రవేశపెట్టేందుకు రైల్వే శాఖ కాంట్రా­క్టు ఖరారు చేసింది. 800 కి.మీ. నుంచి 1,200 కి.మీ. దూర­ప్రాంతాలకు స్లీపర్‌ కోచ్‌లతో కూడిన 200 వందేభారత్‌ రైళ్లు ప్రవేశపెట్టాలని ప్రణాళిక రూపొందించింది. ఇందు­కోసం రూ.58వేల కోట్ల విలువైన టెండర్లు ఖరారు చేసింది. కానీ.. స్లీపర్‌ రైళ్లను ఏయే రూ­ట్లలో ప్రవేశపె­ట్టా­లనే అంశంపై రైల్వే శాఖ కచ్చితమైన నిర్ణ­యానికి రాలేకపోయింది.

స్లీపర్‌ కో­చ్‌­ల నిర్వ­హ­ణ వ్య­యం, టికెట్ల ద్వారా వచ్చే రాబడి మధ్య సమ­తు­ల్యత లేక­పోవ­డంతో సందిగ్ధంలో పడింది. అందుకే.. మొదటి స్లీపర్‌ వందే­భారత్‌ రైలును ప్రారంభించే విషయంలో కాలయాపన చేస్తోంది. డిమాండ్‌ ఉన్న, అంతగా లేని మొత్తం 200 రూ­ట్ల­లో స్లీపర్‌ రైళ్లను ప్రవేశపెట్టడం నిర్వహణ వ్యయం పర­ంగా సరైన నిర్ణయం కాదని తాజాగా రైల్వే శాఖ నిర్ణయించింది. ఎందుకంటే.. ఒక్కో కోచ్‌లో 80 సీట్లు ఉంటాయి. 16 కోచ్‌లతో కూడిన స్లీపర్‌ రైళ్లను అంతగా డిమాండ్‌లేని రూట్లలో కూడా నిర్వహించడం ఆర్థికంగా భారంగా మారు­తుందని అంచనాకు వచ్చింది.

దాంతో స్లీపర్‌ కోచ్‌లకు అధి­క డిమాండ్‌ ఉంటుందని భావిస్తున్న రూట్లలోనే ఆ రైళ్ల­ను పరిమితం చేయాలని నిర్ణయించింది. దాంతోపాటు రైళ్లలో కోచ్‌ల సంఖ్యను పెంచడం ద్వారా టికెట్ల ఆదాయా­న్ని పెంచుకోవాలని భావించింది. ఈ మేరకు స్లీపర్‌ రైళ్ల సంఖ్యను 200 నుంచి 133కు తగ్గించింది. ఇక ఒక్కో రైలు­లో కోచ్‌ల సంఖ్యను 16 నుంచి 24కు పెంచింది. కాంట్రా­క్టు మొత్తం వ్యయం మాత్రం రూ.58వేల కోట్లుగానే ఉంటుంది. ఈ మేరకు ఇప్పటికే టెండర్లు ఖరారు చేసిన కాంట్రాక్టు సంస్థలు రైల్‌ వికాస్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (ఆర్‌వీఎన్‌ఎల్‌), భారతహెవీ ఎలక్ట్రికల్స్‌ లిమిటెడ్‌ (బీహెచ్‌ఈఎల్‌)కు సవ­రించిన కాంట్రాక్టును ఖరారు చేసింది.

Videos

ఎల్లో మూకలపై శివంగుల్లా తిరగబడ్డ మహిళలే మాకు స్ఫూర్తి

నేడు భారత్ -న్యూజిలాండ్ మధ్య రెండో T20 మ్యాచ్

జగనన్న మళ్లీ వస్తేనే రాష్ట్రంలో మహిళలకు రక్షణ

2029 నీకు పుట్టగతులు ఉండవ్..! పరిటాల సునీతకు గోరంట్ల మాస్ వార్నింగ్

నా సర్వీసులో ఇలాంటి ఎన్నికలు ఎప్పుడూ చూడలేదు

మహిళ అని చూడకుండా నాపై దాడి చేసి.. చేతిని మెలిపెట్టి విరిచేశారు

సుప్రీం చెప్పినా లెక్కలేదు.. కూటమికి అడుగడుగునా జగన్ భయం

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)