Breaking News

46 రైళ్లలో జనరల్‌ బోగీల పెంపు

Published on Sat, 07/13/2024 - 05:46

సాక్షి, న్యూఢిల్లీ/రైల్వేస్టేషన్‌(విజయవాడ పశ్చిమ): దేశవ్యాప్తంగా జనరల్‌ బోగీలను పెంచాల­న్న ప్రయాణికుల డిమాండ్‌ నేపథ్యంలో రైల్వే­శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. తొలిదశలో దేశంలోని 46 ప్రముఖ రైళ్లలో రెండేసి చొప్పున మొత్తం 92 జనరల్‌ కోచ్‌లను పెంచుతున్నట్లు రైల్వేశాఖ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. అలాగే త్వరలో మరో 22 రైళ్లలో జనరల్‌ కోచ్‌లను పెంచనున్నట్లు పేర్కొంది. కాగా, విజయవాడ డివిజన్‌ మీదుగా నడుస్తున్న 12 జతల ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు అదనంగా 23 జనరల్‌ కోచ్‌లను ఏర్పాటు చేసి నడపనున్నట్లు స్థానిక అధికారులు ప్రకటించారు. 

ఆ జాబితాలో సికింద్రాబాద్‌–గూడూరు సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌ (12710/­12709) నవంబర్‌ 8 నుంచి, సికింద్రాబాద్‌–హౌరా, ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌ (12704/12703) న­వంబర్‌ 8 నుంచి, హైదరాబాద్‌–విశాఖపట్నం, గోదావరి ఎక్స్‌ప్రెస్‌ (12728/12727) నవంబర్‌ 10 నుంచి,    కాకి­నాడ పోర్టు–లింగంపల్లి, గౌతమి ఎక్స్‌ప్రెస్‌ (12737/­12738) నవంబర్‌ 8 నుంచి, కాకినాడ పోర్టు–భవనగర్, కాకినాడ పోర్టు ఎక్స్‌ప్రెస్‌ (12755/12756) ఈ నెల 14 నుంచి, కాకినాడ పోర్టు–షిర్డీ సాయినగర్, షిర్డీ ఎక్స్‌ప్రెస్‌ (17206/17205) నవంబర్‌ 11 నుంచి, హైద­రాబాద్‌–తాంబరం, చార్మినార్‌ ఎక్స్‌ప్రెస్‌ (12760/­­12759) నవంబర్‌ 11 నుంచి, కాకినాడ పోర్టు–­లింగంపల్లి, కొకనాడ ఎక్స్‌ప్రెస్‌ (12775/­12776) నవంబర్‌ 12 నుంచి, సికింద్రాబాద్‌–భువనేశ్వర్, విశాఖ ఎక్స్‌ప్రెస్‌ (17016/17015) నవంబర్‌ 14 నుంచి, మచిలీపట్నం–యశ్వంత్‌పూర్, కొండవీడు ఎక్స్‌ప్రెస్‌ (17211/17212) నవంబర్‌ 11 నుంచి, మచిలీపట్నం–ధర్మవరం, మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్‌ (17215/17216) ఈ నెల 12 నుంచి, కాకినాడ పోర్టు–­లోకమాన్య తిలక్‌ టెర్మినస్, షిర్డీ ఎక్స్‌ప్రెస్‌ (17221/­17222) నవంబర్‌ 16 నుంచి ప్రయాణికులకు అందు­బాటులోకి రానున్నాయి. అలాగే తిరుపతి–కొల్లం ఎక్స్‌­ప్రెస్‌ (17421/17422) కూడా ఈ జాబితాలో ఉంది.

Videos

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)