Breaking News

ఆరేళ్ల చిన్నారిపై జనసేన కార్యకర్త కిరాతకం

Published on Tue, 10/27/2026 - 03:15

నాగులుప్పలపాడు: అమ్మమ్మ పక్కన నిద్రిస్తున్న ఆరేళ్ల చిన్నారిపై జనసేన కార్యకర్త మదపుటేనుగులా విరుచుకుపడ్డాడు. ఎత్తుకుపోయి నోట్లో గంజాయి, గుడ్డలు కుక్కి చిత్రవధ చేసి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అక్కడితో వదలక గొంతునులిమి కిరాతకంగా హత్యచేశాడు. ఆపై పాడుపడిన ఇంట్లో బాలికను పడేసి వెళ్లాడు. స్థానికులు అను­మా­నాస్పదంగా ఉన్న నిందితుడిని పట్టుకుని నిలదీయడంతో తాను చేసిన ఘాతుకాన్ని ఒప్పుకున్నా­డు. దీంతో గ్రామస్తులు అతడిని కట్టేసి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. 

పోలీసులు, గ్రామ­స్తుల కథనం మేరకు.. ప్రకాశం జిల్లా సంతనూతలపాడు మండలంలోని ఓ గ్రామానికి చెందిన దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. పెద్ద కుమారుడు 3వ తరగతి, ఆరేళ్ల కుమార్తె ఒకటో తరగతి చదువుతున్నారు. ఐదేళ్ల వయసున్న మరో బాబు ఉన్నాడు. సొంత గ్రామంలో పనులు లేక బిడ్డలను నాగులుప్పలపాడు మండలంలోని ఓ గ్రామంలో ఉంటున్న పిల్లల అమ్మమ్మ వద్ద వదిలి దంపతులు హైదరాబాద్‌లో బేల్దారి పనులకు వెళ్లారు. ముగ్గురు పిల్లలు అమ్మమ్మ వద్ద ఉంటూ స్థానిక ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు.

నోట్లో గంజాయి కుక్కి.. గుడ్డలు అదిమి.. 
ఒంగోలు మండలం గుడిమెట్లపాడుకు చెందిన అజ్జం ఆనంద్‌ (25) చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోవడంతో జులాయిగా తిరుగుతూ ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వారికి ఏడాది వయసున్న బాబు ఉన్నాడు. 2 నెలల కిందట భార్యతో గొడవపడి అలిగి గుడిమెట్లపాడు గ్రామం నుంచి తన అమ్మమ్మ ఊరుకు వచ్చాడు. ఆనంద్‌ అమ్మమ్మ ఉపాధి కోసం పొగాకు గ్రేడింగ్‌కు వెళ్లడంతో ఆనంద్‌ ఇక్కడే చిన్నచిన్న పనులు చేసుకుంటూ గంజాయి, మద్యం తాగుతూ బాధ్యతా రాహిత్యంగా తిరుగుతుండేవాడు. జనసేనలో క్రియాశీలక కార్యకర్తగాఉన్నాడు. 

ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి గ్రామంలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన తరఫున ఎంపీటీసీగా పోటీచేస్తున్న తన సమీప బంధువు ఎన్నికల ప్రచారంలో నాయకులు, కార్యకర్తలతో కలిసి పాల్గొన్న ఆనంద్‌ అనంతరం ఎస్సీ కాలనీ సమీపంలోని స్థూపం వద్ద మరో ఇద్దరు మిత్రులతో కలిసి మద్యం, గంజాయి తాగాడు. మత్తులో అర్ధరాత్రి 2 గంటల సమయంలో అమ్మమ్మ పక్కన నిద్రిస్తున్న ఆరేళ్ల చిన్నారిని భుజాన వేసుకుని ఆనంద్‌ తన ఇంటికి తీసుకెళ్లి బాలిక నోట్లో గంజాయి కుక్కి, గుడ్డలు నోటిలో అదిమి చిత్రవధ చేసి లైంగికదాడికి పాల్పడ్డాడు. బాలికకు ఊపిరాడక మృతిచెందిందని గమనించిన ఆనంద్‌ సమీపంలో పాడుబడిన ఇంట్లో పడేసి అక్కడ నుంచి తప్పించుకోవాలని యత్నించాడు. 

జాతీయ రహదారిపై రాస్తారోకో చేస్తున్న గ్రామస్తులు (ఇన్‌సెట్‌లో) ఘటనకు కారకుడైన అజ్జం ఆనంద్‌ (ఫైల్‌) 

ఇంతలో చుట్టుపక్కల వారు అలజడికి లేచి ఆనంద్‌ ప్రవర్తన సరిగా లేదని గమనించి గట్టిగా నిలదీయడంతో చిన్నారిపై అఘాయిత్యం చేసి చంపేసిన విషయాన్ని అంగీకరించాడు. దీంతో ఆనంద్‌ చెప్పిన ప్రదేశంలో బాలికను గుర్తించి హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. నిందితుడిని గ్రామస్తులు స్తంభానికి కట్టేసి కొట్టి పోలీసులకు అప్పగించారు. చిన్నారి మృతికి న్యాయం చేయాలని గ్రామస్తులు 216 జాతీయ రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేశారు. ఘటనా స్థలాన్ని డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు, డాగ్‌ స్క్వాడ్‌తో పరిశీలించారు. బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఒంగోలు రిమ్స్‌కు తరలించారు.  

బాధితులకు మేరుగు పరామర్శ
చిన్నారి కుటుంబానికి న్యాయం చేయాలని 216 జాతీయ రహదారిపై రాస్తారోకో చేస్తున్న బాధిత కుటుంబ సభ్యులను, బంధువులను సంతనూతలపాడు నియోజకవర్గ ఇన్‌చార్జ్, మాజీ మంత్రి మేరుగు నాగార్జున సోమవారం మధ్యాహ్నం పరామర్శించారు. రాస్తారోకో చేస్తున్న వారితో మాట్లాడి ఘటన జరిగిన తీరును తెలుసుకొని చలించిపోయిన మేరుగు రాష్ట్ర ప్రభుత్వం, అధికారులు బాలిక మృతికి న్యాయం చేయాలని డిమాండ్‌ చేయడంతో పాటు కలెక్టర్, ఎస్పీలతో ఫోన్‌లో మాట్లాడి సత్వర న్యాయం చేయాలని కోరారు. 

ఒంగోలు రిమ్స్‌ మార్చురీలో ఉన్న బాలిక మృతదేహాన్ని కలెక్టర్‌ పి.రాజాబాబు, ఎస్పీ హర్షవర్ధన్‌రాజు పరిశీలించి బంధువులతో మాట్లాడారు. నిందితుడు గంజాయి మత్తులో ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలిసిందని, పోక్సో కేసు నమోదు చేయడమే కాకుండా ఫాస్ట్‌ ట్రాక్‌ విచారణ జరిపేందుకు తగిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ రాజాబాబు అన్నారు.

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)