Breaking News

మండుటెండలో నిలబెట్టి... ఆపై జుత్తు కత్తిరించి!

Published on Mon, 11/18/2024 - 05:34

జి.మాడుగుల: అసెంబ్లీకి సమయానికి రాలేదని అల్లూరి సీతారామరాజు జిల్లా జి.మాడుగులలోని కస్తూర్బా బాలికల విద్యాలయం (కేజీబీవీ)లో చదువుతున్న విద్యార్థినుల జుత్తును ప్రిన్సిపాల్‌ కత్తిరించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కార్తీక పౌర్ణమి రోజైన శుక్రవారం నాడు పాఠశాల, కళాశాల విద్యార్థినులు కాలకృత్యాలు తీర్చుకొని పూజలు చేసుకొని ఆలస్యంగా కేజీబీవీకి వచ్చారు.

పాఠశాలలో రోజువారీ నిర్వహించే అసెంబ్లీకి ఇంటర్‌ బైపీసీ ద్వితీయ సంవత్సరం విద్యార్థినులు అలస్యంగా రావడంతో వారిపై ప్రిన్సిపాల్‌ ఆగ్రహించారు. విద్యార్థినులను పాఠశాల, కళాశాలల ఆవరణలో ఎండలో 2 గంటలు సేపు నిలబెట్టారు. అసెంబ్లీకి రాని విద్యార్థినుల్లో కొంతమందిని దండించారు. వీరిలో 15 మందికి జట్టును ఇష్టానుసారంగా కత్తిరించారు. 

మనోవేదనకు గురైన విద్యార్థినులు ప్రిన్సిపాల్‌ నుంచి తప్పించుకునేందుకు ప్రయతి్నంచినా.. వెంబడించి మరీ జుత్తు కత్తిరించినట్టు సమాచారం. వీరిలో ఒక విద్యార్థిని దేవుని మొక్కు ఉందని జుత్తు కటింగ్‌ చేయవద్దని ప్రాథేయపడినా ప్రిన్సిపాల్‌ కనికరించలేదు. జుత్తు కట్‌ చేస్తున్న సమయంలో మనోవేదనకు గురైన ఒక విద్యార్థిని సొమ్మసిల్లి పడిపోయినప్పటికీ తాగడానికి మంచినీరు కూడా ప్రిన్సిపాల్‌ అందించటానికి నిరాకరించారు. 

క్రమశిక్షణ నేర్పాలనే... 
విద్యార్థినుల జుత్తు కత్తిరింపుపై కేజీబీవీ ప్రిన్సిపాల్‌ సాయి ప్రసన్నను వివరణ కోరగా విద్యార్థినుల జుత్తు బాగా పెరిగిపోవడం వల్ల పేలు పట్టి, తలపై కురుపులు వస్తాయని, క్రమశిక్షణగా ఉంటారనే ఉద్దేశంతో జుత్తు కట్‌ చేసినట్లు తెలిపారు. తమపై వచ్చిన ఆరోపణల్లో వాస్తవం లేదని సాయిప్రసన్న తెలిపారు. 

ఉన్నతాధికారులకు సమాచారమిచ్చాం 
కేజీబీవీలో విద్యార్థినుల జుత్తును అకారణంగా కటింగ్‌ చేసినట్టు కొంతమంది సర్పంచ్‌లు, ఎంపీటీసీలు తమ దృష్టికి తీసుకు వచ్చారని ఎంఈవో బాబూరావుపడాల్‌ తెలిపారు. ఈ విషయంపై కేజీబీవీని సందర్శించేందుకు వెళ్లగా ప్రిన్సిపాల్‌ సెలవులో ఉన్నట్టు చెప్పారన్నారు. అక్కడ నుంచి ఫోన్‌లో ప్రిన్సిపాల్‌ని సంప్రదించగా విద్యార్థినులకు జుట్టు పెరిగిపోయిందని, క్రమశిక్షణ(డిసిప్లేన్‌)  కోసం విద్యార్థినుల్లో కొంతమంది జత్తు కటింగ్‌ చేసినట్టు చెప్పారని ఎంఈవో తెలిపారు. దీనిపై జిల్లా విద్యాశాఖ, జీసీడీవోకు సమాచారం అందించామని ఆయన వెల్లడించారు.  

Videos

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)