Breaking News

మంత్రి స్వగ్రామంలో అమానుషం

Published on Tue, 01/27/2026 - 05:01

సాక్షి, టాస్క్ ఫోర్స్‌: రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి స్వగ్రామమైన నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం యనకండ్లలో దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికుల వివరాల మేరకు..గ్రామంలోని దళిత వర్గానికి చెందిన వృద్ధురాలు (65) ఈ నెల 15న పశువుల కోసం గడ్డిమోపు ఎత్తుకుని పొలం నుంచి ఇంటికి వస్తుండగా అదే గ్రామానికి చెందిన దాట్ల అమర్నాథ్‌ (24) వెనుకవైపు నుంచి వచ్చి ఆమె నెత్తిన ఉన్న గడ్డిమోపును కిందకు నెట్టేశాడు. ఆపై ఆమె నోరు మూసి అత్యాచార యత్నం చేశాడు. ఈ ప్రయత్నంలో వృద్ధురాలి ఛాతీ, శరీరంపై గాయాలయ్యాయి. ఆమె గట్టిగా కేకలు వేయడంతో అటుగా వెళుతున్న మద్దిలేటి గట్టిగా అరవడంతో అమర్నాథ్‌ వృద్ధురాలిపై దాడి చేసి పరారయ్యాడు.

ఈ ఘటనను ఇంట్లో కుటుంబ సభ్యులకు చెప్పలేక వృద్ధురాలు తీవ్ర మనోవేదనకు గురైంది. అవమాన భారంతో వారం పాటు మానసిక బాధను అనుభవిస్తూ అన్న పానీయాలు మానేసింది. దీంతో అస్వస్థతకు గురై ఈ నెల 22న మృతి చెందింది. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు బనగానపల్లె పోలీస్‌స్టేషన్‌ వద్ద ఆందోళనకు దిగారు. అమర్నాథ్‌ గతంలో కూడా గ్రామంలో కొంత మంది మహిళలపై అసభ్యకరంగా ప్రవర్తించిన ఘటనలున్నాయి. ఈ క్రమంలో ఆ యువకుడికి గ్రామస్తులు దేహశుద్ధి చేసినట్లు తెలుస్తోంది.

వృద్ధురాలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. మంత్రి సొంత ఊరు కావడంతో పోలీసులు కేసు విషయంలో పెద్దగా స్పందించడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అమర్నాథ్‌పై అత్యాచారం, ఎస్సీ, ఎస్టీ కేసుతో పాటు హత్యాయత్నం కేసు నమోదు చేయా­లని ఎమ్మార్పీఎస్‌ నాయకులు డిమాండ్‌ చేశారు.

Videos

నేను తాడిపత్రి పోతా.. ఏం పీకుతారో పీక్కోండి.. మాస్ వార్నింగ్

మరి గోరం... హీరోయిన్ ఎంగిలి చేసిన బాటిల్ ధర రూ.3 లక్షలు..!

అనంతపురం రూరల్ EX ZPTCపై పోలీసుల ఓవర్ యాక్షన్

జోగి రమేష్ హౌస్ అరెస్ట్

ఆ 15 స్థానాల్లో పోటీయే లేదు..! లైవ్ లో మొత్తం బయటపెట్టిన YS జగన్

సంచలనం రేపుతున్న ప్రశాంత్ భూషణ్ ట్వీట్

ఏం చంపుతావా? విడదల రజినీని నెట్టేసి కిందపడేసిన SI

బంగారానికి ఏమైంది? వరుసగా పడిపోతున్న ధరలు!

జగన్ లాస్ట్ పంచ్... జస్ట్ సింగిల్ డిజిట్!

పోరాడిన ప్రతి అక్కచెల్లమ్మకు హ్యాట్స్ ఆఫ్.. జగన్ ఎమోషనల్

Photos

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం...నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఎగ్జిబిషన్‌ మైదానంలో సందడిగా దత్తన్న అలయ్‌ బలయ్‌ (ఫొటోలు)

+5

ప్రభాస్ హీరోయిన్ కొత్త ఫొటోలు! (ఫొటోలు)

+5

సన్ ఫ్లవర్ తో రితికా నాయక్‌ (ఫొటోలు)

+5

సంజూ, నమన్ మెరుపులు.. ఓడిపోయే మ్యాచ్‌లో గెలిచిన భారత్ (ఫొటోలు)