Breaking News

హోంమంత్రి అనిత ఇలాకాలో దారుణం

Published on Fri, 03/13/2026 - 03:47

నక్కపల్లి/పాయకరావుపేట: రాష్ట్ర హోంమంత్రి అనిత ప్రాతినిధ్యం వహిస్తున్న అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో బాలికపై లైంగిక దాడి జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. నాలుగు రోజుల క్రితమే ఈ ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. గుట్టుచప్పుడు కాకుండా పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండ్‌కు తరలించారు. హోం మంత్రి నియోజకవర్గం కావడంతో ఈ వ్యవహారం బయటకు పొక్కకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 

ఈ వ్యవహారం బయటకు పొక్కడంతో గురువారం మీడియాకు వెల్లడించారు. సీఐ జి.అప్పన్న కథనం ప్రకారం..  బాధితులు ఇచి్చన ఫిర్యాదు వివరాల మేరకు.. అనకాపల్లి జిల్లాకు చెందిన బాలికను తల్లిదండ్రులు విశాఖలో ఓ ప్రైవేట్‌ కళాశాలలో ఇంటర్‌లో చేర్పించారు. హాస్టల్‌లో ఉంటున్న ఈ బాలికకు తన స్నేహితురాలి ద్వారా చినగదిలి(విశాఖ)కి చెందిన దల్లి సాయిచంద్‌(20) పరిచయమయ్యాడు. ఇతడు బాలికను ప్రేమించాలని వెంబడిస్తూ వేధింపులకు గురిచేసేవాడు. తన ప్రేమను అంగీకరించకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. 

గతేడాది ఏప్రిల్‌లో బాలికను పాయకరావుపేటకు సమీపంలో ఓ లాడ్జికి తీసుకువెళ్లి అసభ్యంగా వీడియోలు చిత్రీకరించాడు. ఈ వీడియోలు సోషల్‌ మీడియాలో పోస్టు చేస్తానని బెదిరించి బ్లాక్‌మెయిల్‌ చేసి బాలికను విశాఖలో పెందుర్తి ప్రాంతంలో తన నివాసానికి తీసుకెళ్లి పలుమార్లు లైంగిక దాడి చేశాడు. ఈ ఏడాది జనవరి చివరి వారంలో బాధితురాలిని నిందితుడు తన ఇంటికి తీసుకువెళ్లాడు. జరిగిన విషయాన్ని పోలీసులకు చెబితే వీడియోలను సోషల్‌ మీడియాలో పోస్టు చేస్తానని ఆమె తల్లిదండ్రులను ఫోన్‌లో బెదిరించాడు. బాధితురాలు మైనర్‌ అని తెలిసినప్పటికీ ఆమెను నెల పాటు పెందుర్తిలో తన ఇంట్లోనే నిందితుడి తల్లి నిర్బంధించింది. 

బాధితురాలు ఈ వేధింపులను భరించలేక ఈ నెల 8న నిందితుడి ఇంటి నుంచి తప్పించుకుని తన తల్లిదండ్రుల వద్దకు వచ్చి జరిగిన విషయాన్ని తెలిపింది. దీంతో వారు పాయకరావుపేట పోలీసులను ఆశ్రయించారు. నిందితుడు తీసిన వీడియోలను బాధితురాలి తల్లిదండ్రులకు పంపడంతోపాటు ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా వారి బంధువులకు కూడా పంపినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.  నిందితుడు మరో ఇద్దరు అమ్మాయిలతో కూడా ఇలాగే వీడియోలు తీసినట్లు  విచారణలో వెల్లడైంది. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడు దల్లిసాయిచంద్, అతడి తల్లిని అరెస్టు చేశారు. 

Videos

లోకల్ వార్ రెండో దశ మొదలు

ఘోర రోడ్డు ప్రమాదం..ఎగిరిబడ్డ వ్యక్తి

YSRCP MPTC అభ్యర్థిపై దాడి పోలీస్ స్టేషన్ కు YS అవినాష్ రెడ్డి

Ramchandrapuram : కూటమిని చిత్తుచిత్తుగా ఓడిస్తాం

నామినేషన్ పత్రాలు చించేసిన TDP గూండాలు అక్కడ ఎన్నిక వాయిదా

Kurnool: YSRCP మహిళలపై TDP మహిళలు దాడి

ఖాకీ చొక్కాల మాటున టీడీపీ గూండాలు.. ఎన్నికలు జరిగితే 100% YSRCPదే గెలుపు..

70MMలో చంద్రముఖి బాబు నిజస్వరూపం

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)