Breaking News

ఏలూరులో అమానుషం

Published on Fri, 12/05/2025 - 06:03

ఏలూరు టౌన్‌: ఏలూరులో అర్ధరాత్రి వేళ అమానుష ఘటన చోటుచేసుకుంది. ఇద్దరు యువతులు ఒంటరిగా ఉన్నారని తెలుసుకుని వారి ఇంటి తలుపులు, కిటికీలు బాదుతూ ఇద్దరు రౌడీషీటర్లు భయభ్రాంతులకు గురిచేశారు. అనంతరం వారిలో ఒక యువతిని ఓ రౌడీషీటర్‌ కొట్టుకుంటూ సమీపంలోని సచివాలయానికి లాక్కెళ్లి అత్యాచారానికి పాల్పడినట్లు విశ్వసనీయ సమాచారం. ఆ తర్వాత ఇద్దరు యువతులనూ రౌడీషీటర్లు బెల్టుతో దారుణంగా కొట్టినట్లు తెలిసింది. తాము పోలీసులను ఆశ్రయిస్తే వారు సరిగ్గా స్పందించలేదని బాధితులు ఆరోపిస్తున్నారు. చివరికి.. ఈ ఘటన పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో కేసు నమోదు చేసినట్లు తెలిసింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాలివీ..  ఎన్టీఆర్‌ జిల్లాకు చెందిన యువతి (23) తండ్రి మరణించగా.. ఆమె తల్లితో గొడవపడి ఇంటి నుంచి వచ్చేసింది.

ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన ఏలూరుకు చెందిన యువతి వద్ద ఉంటోంది. ఈ నెల 2న రాత్రివేళ వీరిద్దరూ ఇంట్లో ఒంటరిగా ఉండగా.. నగరంలోని కొత్తపేటకు చెందిన ఇద్దరు రౌడీషీటర్లు అతిగా మద్యం సేవించి అర్ధరాత్రి వేళ  యువతులు ఉంటున్న ఇంటి తలుపులు, కిటీకీలు బాదుతూ వారిని భయభ్రాంతులకు గురిచేశారు. ఎన్టీఆర్‌ జిల్లా నుంచి వచ్చిన యువతి తలుపులు తీయగా.. ఆమెను కొట్టుకుంటూ లాక్కెళ్లిన ఒక రౌడీషీటర్‌ సమీపంలోని సచివాలయంలోకి తీసు­కెళ్లి అత్యాచారానికి పాల్పడినట్లు సమాచారం. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించాడు.

ఆ తర్వాత యువతులిద్దరినీ బెదిరించి వెళ్లిపోయిన ఆ ఇద్దరు రౌడీషీటర్లు.. మరో గంట తర్వాత స్నేహితులతో వచ్చి యువతులను మళ్లీ బెల్టులతో ఇష్టమొచ్చినట్లు కొట్టి బెదిరించి వెళ్లారు. దీంతో బాధితులిద్దరూ నగరంలోని ఒక పోలీస్‌స్టేషన్‌కు వెళ్లగా పోలీసులు పట్టించుకోలేదని సమాచారం. అయితే, పోలీసు ఉన్నతాధికారులకు ఈ దారుణ ఘటన గురించి తెలియడంతో అత్యాచార బాధితురాలిని ఓ ఆçస్పత్రిలో చేర్పించి చికిత్స చేయిస్తున్నట్లు తెలిసింది. అలాగే, హడావుడిగా కేసు నమోదు చేశారు. మరోవైపు.. ఈ ఘటనను పోలీసులు చిన్న కేసుగా చిత్రీకరించే ప్రయత్నం చేయడం అనేక సందేహాలకు తావిస్తోంది. పోలీసులు ఈ ఘటనపై మీడియాకు సైతం తెలియకుండా అత్యంత గోప్యత పాటిస్తున్నారు. 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)