Breaking News

కుటుంబానికి భారం కాకూడదని..

Published on Mon, 07/20/2026 - 05:16

రావులపాలెం: అనారోగ్య కారణాలతో తల్లిని సక్రమంగా చూడలేకపోతున్నానని తీవ్రంగా బాధపడుతున్న ఓ మహిళ దారుణ నిర్ణయం తీసుకుంది. అనారోగ్యంతో బాధపడుతున్న తాను, వృద్ధురాలైన తన తల్లి కుటుంబానికి భారం కాకూడదని భావించింది. వృద్ధాశ్రమంలో చేర్పిస్తానని చెప్పి తీసుకువెళ్లి తన తల్లిని కాలువలోకి నెట్టివేసింది. ఆ తర్వాత ఆమె కూడా కాలువలోకి దూకేసింది. ఈ విషాద ఘటన డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా రావులపాలెం మండలం ఊబలంక గ్రామం వద్ద ఆదివారం జరిగింది.

స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం చొప్పెల్ల గ్రామంలో మీసాల సూర్యవతి(60), సూర్యనారాయణ దంపతులు నివాసం ఉంటున్నారు. సూర్యవతి తల్లి వాడపల్లి బూరమ్మ(80) కూడా వారి వద్దే ఉంటున్నారు. బూరమ్మ కుమారుడు కొంతకాలం క్రితం మరణించడంతో ఆమె తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. సూర్యవతి కూడా ఇటీవల మోకాళ్లు, నడుము నొప్పితోపాటు వివిధ అనారోగ్యాలతో బాధప­డుతోంది. అనారోగ్య కారణాలతో తల్లిని సరిగా చూ­డలేకపోతున్నానని సూర్యవతి ఆవేదనకు గురయ్యేది.

వృద్ధాశ్రమంలో చేర్పిస్తానని...
తామిద్దరం కుటుంబ సభ్యులకు భారం కాకూడదని భావించిన సూర్యవతి ఆదివారం ఉదయం తల్లి బూరమ్మను వృద్ధాశ్రమంలో చేర్పిస్తానంటూ చొప్పెల్లలోని ఇంటి నుంచి బయల్దేరింది. తల్లితో కలసి రావులపాలెం మండలం ఊబలంక గ్రామం వద్దకు చేరుకుంది. గ్రామంలోని పెద్ద వంతెనపైకి చేరుకుని తల్లిని కాల్వలోకి నెట్టేసింది. ఆ తర్వాత సూర్యవతి కూడా దూకేసింది. స్థానికులు గమనించి వారిని కాపాడేందుకు ప్రయత్నించారు. అప్పటికే సూర్యవతి మృతదేహం నీటిపై తేలడంతో ఒడ్డుకు చేర్చారు. ప్రవాహం ఉధృతంగా ఉండటంతో బూరమ్మ గల్లంతైంది. సూర్యవతి భర్త సూర్యనారాయణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, బూరమ్మ ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు రావులపాలెం ఎస్‌ఐ చంటి తెలిపారు.

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఎగ్జిబిషన్‌ మైదానంలో సందడిగా దత్తన్న అలయ్‌ బలయ్‌ (ఫొటోలు)

+5

ప్రభాస్ హీరోయిన్ కొత్త ఫొటోలు! (ఫొటోలు)