Breaking News

ఈ చిన్నారి.. మృత్యుంజయురాలు

Published on Fri, 08/15/2025 - 06:01

పెద్దదోర్నాల: చిరుత నోటికి చిక్కిన చిన్నారి.. గాయాలతో బయటపడిన ఘటన ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల మండలంలో బుధవారం అర్ధరాత్రి జరిగింది. వివరాలు.. చిన్నారుట్ల గూడేనికి చెందిన కుడుముల అంజయ్య, లింగేశ్వరి తమ మూడేళ్ల కుమార్తె అంజమ్మతో కలిసి బుధవారం రాత్రి తమ ఇంట్లో నిద్రపోయారు. అర్ధరాత్రి సమయంలో చిరుత వారి ఇంట్లోకి ప్రవేశించి.. అంజమ్మ తలను నోట కర్చుకొని అడవిలోకి వెళ్లేందుకు ప్రయత్నించింది. ఇంతలో చిన్నారి పెద్దగా ఏడవటంతో నిద్రలేచిన తల్లిదండ్రులు.. చిరుతను చూసి షాక్‌కు గురయ్యారు.

భయంతో గట్టిగా కేకలు వేయగా.. చిన్నారిని వదిలేసి చిరుత పారిపోయింది. గాయపడిన చిన్నారిని తల్లిదండ్రులు వెంటనే శ్రీశైలం ప్రాజెక్టు వైద్యశాలకు తీసుకెళ్లి.. ప్రథమ చికిత్స చేయించి ఇంటికి తీసుకెళ్లారు. ఈ ఘటన గురించి తెలుసుకున్న అటవీ శాఖ అధికారులు, పోలీసులు గురువారం ఉదయం చిన్నారుట్ల గూడేనికి చేరుకుని.. బాలికను పెద్దదోర్నాలలోని సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. బాలిక మెడపై గాయాలు కావడంతో వైద్యులు కుట్లు వేశారు. బాలిక చికిత్స నిమిత్తం ఆమె తల్లిదండ్రులకు ఎస్సై మహేష్‌ ఆరి్థక సాయం చేశారు.

బాలికను డీఎఫ్‌వో సందీప్‌ కృపాకర్‌ పరామర్శించారు. క్షతగాత్రురాలికి మెరుగైన వైద్య సదుపాయాలు అందిస్తామని చెప్పారు. చిరుత కదలికలు కనిపెట్టేందుకు ఐదుగురు సిబ్బందిని నియమించడంతో పాటు 15 కెమెరాలు ఏర్పాటు చేస్తామన్నారు. గూడెం వాసులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కాగా, విద్యుత్‌ సదుపాయం లేకపోవడం వల్లే తరుచూ వన్యప్రాణులు దాడులు చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తూ శ్రీశైలం రహదారిపై గూడెం వాసులు నిరసన తెలిపారు. డీఎఫ్‌వో స్పందిస్తూ.. చిన్నారుట్ల గూడేనికి త్వరలో విద్యుత్‌ సౌకర్యం ఏర్పాటుచేసేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)