Breaking News

విశాఖలో సెయిలర్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ప్రారంభం

Published on Thu, 06/13/2024 - 05:29

సాక్షి, విశాఖపట్నం: భారత నౌకాదళ సెయిలర్స్‌ కోసం సాగర్‌ పేరుతో ఏర్పాటు చేసిన ఇన్‌స్టిట్యూట్‌ విశాఖలో ప్రారంభమైంది. నావికుల శిక్షణ కోసం ఐఎన్‌ఎస్‌ విశ్వకర్మ బేస్‌లో ఉన్న సెయిలర్స్‌ ఎనెక్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ను పూర్తిస్థాయిలో ఆధునికీకరించారు. సాగర్‌ పేరుతో ఆధునికీకరించిన ఈ భవనాన్ని తూర్పు నౌకాదళాధిపతి వైస్‌ అడ్మిరల్‌ రాజేష్‌ పెందార్కర్‌ బుధవారం ప్రారంభించారు. 

అత్యాధునిక మౌలిక సదుపాయాలతో అప్‌గ్రేడ్‌ చేసిన సాగర్‌లో పురుషులతో పాటు మహిళా సెయిలర్స్, అగ్నివీర్‌లకు, యుద్ధ నౌకల్లో విధులు నిర్వర్తించే వారి కోసం ఏర్పాట్లు చేసినట్లు ఈఎన్‌సీ చీఫ్‌ అడ్మిరల్‌ పెందార్కర్‌ తెలిపారు. భారత దేశ రక్షణ కోసం అహర్నిశలూ శ్రమిస్తున్న సెయిలర్స్‌కు ఆహ్లాదకరమైన వాతావరణంలో మోటివేషన్‌ అందించడంతో పాటు విశ్రాంతి తీసుకునేలా సాగర్‌ నిర్మాణం సాగిందని వివరించారు. ఈ కార్యక్రమంలో తూర్పు నౌకాదళాధికారులు పాల్గొన్నారు.  

నౌకాదళ సిబ్బందికి ‘ఏఐ’ క్యాప్సుల్‌ కోర్సు 
సాంకేతిక పరిజ్ఞానంలో నౌకాదళ సిబ్బంది ప్రతిభా పాటవాలు మెరుగు పరిచేందుకు తూర్పు నౌకాదళంలో విధులు నిర్వర్తిస్తున్న వారికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ క్యాప్సుల్‌ కోర్సును అందించారు. గీతం యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఐఎన్‌ఎస్‌ కళింగలో ఈనెల 10 నుంచి 3 రోజుల పాటు ఏఐ అప్లికేషన్స్‌తో పాటు మెషిన్‌ లెర్నింగ్‌ గురించి శిక్షణ తరగతులు నిర్వహించారు.

ఇంటరాక్టివ్‌ సెషన్స్‌ ద్వారా సందేహాలు నివృత్తి చేయడంతో వివిధ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ అప్లికేషన్స్‌లో ప్రయోగాత్మక వివరణలు అందించారు. శిక్షణలో పాల్గొన్న తూర్పు నౌకాదళ సిబ్బందికి ధ్రువపత్రాలు అందజేశారు.  

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)