Breaking News

హెచ్‌3ఎన్‌2పై ఆందోళన వద్దు

Published on Fri, 03/10/2023 - 04:43

సాక్షి, అమరావతి : కొత్త రకం ఫ్లూ హెచ్‌3ఎన్‌2 ప్రభావం రాష్ట్రంలో పెద్దగా లేదని డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ (డీఎంఈ) డాక్టర్‌ వినోద్‌కుమార్‌ స్పష్టం చేశారు. అనవసరంగా ప్రజలు ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు. విజయవాడలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే.. 

♦ ముక్కు నుంచి గొంతు మధ్యలోనే ఈ ఫ్లూ వైరస్‌ ప్రభావం ఉంటుంది. 
♦ కరోనా వైరస్‌లాగా ఊపిరితిత్తుల్లోకి చొచ్చుకుపోయే స్వభావం దీనికి లేదు. 
♦ రెసిస్టెన్స్‌ పవర్‌ తక్కువగా ఉన్న కొందరిలో ఊపిరితిత్తుల్లోకి చేరి న్యుమోనియాకు దారితీస్తుంది. 
♦  ప్రస్తుతం ఫ్లూ చిన్న పిల్లలు, వృద్ధుల్లో కొంతమేర ప్రభావం చూపుతుంది. దీనిని కనిపెట్టడం చాలా సులభం.  
♦ప్రభుత్వాస్పత్రుల్లో ఆర్టీపీసీఆర్‌ టెస్ట్‌లు ద్వారా కేసులు గుర్తిస్తున్నాం  
♦ తిరుపతి స్విమ్స్‌లో తరచూ వైరస్‌లపై సీక్వెన్సింగ్‌ చేస్తుంటాం.. ఇలా గత జనవరిలో 12 కేసులు, ఫిబ్రవరిలో 9 హెచ్‌3ఎన్‌2 కేసులు నమోదయ్యాయి.  
♦దగ్గు, జలుబు, జ్వరం లక్షణాలున్న వారు జాగ్రత్తలు తీసుకోవాలి.  టవైరల్‌ జ్వరాలకు యాంటిబయోటిక్స్‌ పనిచేయవు. కాబట్టి జ్వరం వచి్చందని  ప్రజలు అనవసరంగా వాటిని వాడొద్దు.  

ఆస్పత్రుల్లో చేరేవారు చాలా అరుదు 
ఇక జ్వరాలు, ఇతర లక్షణాలతో ఆస్పత్రులకు వస్తున్నవారి­లో ప్రతి వెయ్యి ఓపీల్లో 0.1 శాతం సందర్భాల్లో అడ్మిషన్‌ అవసరం అవుతోందని విజయవాడ ప్రభుత్వ వైద్య కళాశాల ప్రి­న్సిపల్, జనరల్‌ మెడిసిన్‌ వైద్యుడు డా. సుధాకర్‌ చెప్పా­రు.

ఎవరికైనా జ్వరం, జలుబు వచ్చినట్లయితే పారాసిటమా­ల్, దగ్గు ఉన్నట్లైతే సిట్రిజీన్‌ మాత్ర వాడితే సరిపోతుందన్నా­రు. అదే విధంగా గొంతు ఇన్‌ఫెక్షన్‌ ఉంటే వేడినీళ్లు తాగడంతో పాటు, విక్స్‌ బిళ్లలు వాడాలన్నారు. మరోవైపు.. గుంటూ­రు జ్వరాల ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రఘు మాట్లాడు­తూ.. ప్రతి ఏడాది సీజన్‌ మారేప్పుడు జ్వరాలు వస్తుంటాయ­న్నారు. వీటికి ఇంటి వద్దే జాగ్రత్తలు తీసుకుంటే చాలన్నారు.  

వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఆ కాలేజీల్లో అడ్మిషన్లు 
కాగా.. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఐదు కొత్త వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్‌ అడ్మిషన్లు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించిందని డీఎంఈ వినోద్‌ తెలిపారు. విజయనగరం వైద్య కళాశాలకు ఇప్పటికే అనుమతులు లభించాయని.. మిగిలిన నాలుగు కళాశాలలకు అనుమతులు వస్తాయని భావిస్తున్నామన్నారు.

ఏడాదికి మూడు నుంచి నాలుగు వైద్య కళాశాలలను అందుబాటులోకి తీసుకురావాలని ప్రణాళికలు రచించామన్నారు. అలాగే, ఖాళీ అయిన 246 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులను ఎన్నికల కోడ్‌ ముగియగానే భర్తీ చేస్తామని.. సీనియర్‌ రెసిడెంట్‌ల భర్తీకి వాక్‌–ఇన్‌ ఇంటర్వ్యూలు నిర్వహిస్తామని వినోద్‌ చెప్పారు.  

Videos

లోన్ కట్టలేదని వేధిస్తున్నారా? RBI రూల్స్ ఇవే!

దేనితో కొట్టాలి వీళ్లని.. పోలీసులే అభ్యర్థులను లాక్కెళుతున్నారు

సల్మాన్ ఖాన్‌తో పనిచేస్తే ఇదే గతి.. ఈ అనిల్ పండిత్ ఎవరు..?

PF ఉన్నవారందరికీ పెన్షన్ వస్తుందా? అసలు లెక్కలు తెలుసుకోండి..

వేటకొడవల్లితో TDP రౌడీలు దాడి.. బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

తిరుపతిలో దొంగల బీభత్సం 90 గ్రాముల బంగారం చోరీ!

టీడీపీ దాడులకు భయపడే ప్రసక్తేలేదు.. సజ్జల మాస్ వార్నింగ్

వైరల్ అవుతున్న వీడియో, దారుణం.. వెంటబడి మరి TDP గూండాల అరాచకం

టీడీపీ గూండాలు... కడపలో కత్తిపోట్లు.. పులివెందులలో కాల్పుల కలకలం

ఒక్కొక్కడి పేరు అడ్రస్ నోట్ చేస్తున్న.. సిగ్గు లేకుండా ఫోన్ ఆఫ్ చేసి పారిపోయారు

Photos

+5

యాంకర్ అనసూయ ఇంట్లో దసరా సెలబ్రేషన్ ఇలా (ఫొటోలు)

+5

ఫ్యాషన్ షో కోసం తృప్తి దిమ్రి క్రేజీ గ్లామర్ (ఫొటోలు)

+5

దసరా స్పెషల్.. చూడముచ్చటగా విజయ్-రష్మిక జంట (ఫొటోలు)

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)