Breaking News

‘గోదావరి’ టు హైదరాబాద్‌

Published on Wed, 11/12/2025 - 05:48

గోదావరి ఇసుకను అక్రమార్కులు సరిహద్దులు దాటించేస్తున్నారు. రాష్ట్ర అవసరాలకు ఉపయోగపడాల్సిన ప్రకృతి వనరును స్వప్రయోజనాలకు వాడుకుంటున్నారు. అయినా చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోవడంలేదు.  తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు నుంచి నిత్యం వందల లారీల ఇసుక హైదరాబాద్‌ తరలిపోతోంది. నియోజకవర్గ ప్రజాప్రతినిధి అండదండలతో టీడీపీ కీలక నేత కనుసన్నల్లో రూ.కోట్లలో ఈ దందా సాగుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అంతా తెలిసినా అధికారులు మామూళ్లు దండుకుని చూసీచూడనట్లు వదిలేస్తున్నారనే విమర్శలున్నాయి.  -సాక్షి, రాజమహేంద్రవరం 

ఒకే బిల్లుపై అనేకసార్లు 
కొవ్వూరు, తాళ్లపూడి మండలాల్లో 15 స్టాక్‌ పాయింట్లున్నాయి. వీటి వద్ద కనీస పర్యవేక్షణ లేదు. సీసీ కెమెరాలు, వేబ్రిడ్జి లేవు. నిత్యం ఒక అధికారి ఉండాలి. మామూళ్లు తీసుకుని వారు కనపడకుండా పోతున్నారు. ఎక్కడ ఉంటున్నారో తెలియడం లేదు. పై అధికారులు తనిఖీలకు వచ్చినప్పుడే కనిపిస్తున్నారు. దీనికితోడు సరిహద్దుల్లో నిఘా లేకపోవడంతో ఇసుక దందా యథేచ్ఛగా సాగుతోంది. 

» స్టాక్‌ పాయింట్ల వద్ద ఇసుక టన్ను రూ.160కు విక్రయించాల్సి ఉండగా కూటమి నేతల కనుసన్నల్లో రూ.300–రూ.350 వసూలు చేస్తున్నారు. 

» కొవ్వూరు, చిడిపి, తాళ్లపూడి, కుమారదేవం, అరికిరేవుల తదితర స్టాక్‌ పాయింట్లలో ఇసుకను లారీల్లో నింపి రాష్ట్రం దాటిస్తున్నారు. గోపాలపురం, ఏలూరు జిల్లా చింతలపూడి పరిసర ప్రాంతాల మీదుగా పరిమితికి మించి రవాణా చేస్తుండడంతో ఇసుక రోడ్డుపైకి జారి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దొంగ వే బిల్లులు, ఇతర పత్రాలు సృష్టించి హైదరాబాద్, ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఒక లారీకి బిల్లు తీసుకుని అనేక ట్రిప్పులు వేస్తున్నారు. ఒకవేళ పట్టుకుంటే లారీ మరమ్మతుకు వెళ్లింది, రెండ్రోజులు ఆగిందని బుకాయిస్తున్నారు. 

తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గంలో కూటమి నేతల అండదండలతో ఇసుక మాఫియా బరితెగించింది.  గామన్‌ బ్రిడ్జి సమీపంలో కుమారదేవం, ఆరికిరేవుల, పంగిడి, తాళ్లపూడి, చిడిపి, కొవ్వూరు తదితర చోట్ల నుంచి రోజుకు 200 లారీలకు పైగా ఇసుకను హైదరాబాద్‌కు అక్రమంగా తరలిస్తోంది. లారీకి రూ.50 వేల నుంచి రూ.70 వేలు వసూలు చేస్తున్నారు. రోజుకు రూ.కోటిన్నర నెలకు రూ.45 కోట్లు కూటమి నేతలు దండుకుంటున్నారు. 

నియోజకవర్గంలోని ద్విసభ్య కమిటీ సభ్యులు, ఓ కీలక నేతకు చెందిన ఉద్యోగులు, ఓ ప్రజాప్రతినిధి అనుచరులు వ్యవహారమంతా దగ్గరుండి నడిపిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. నెల మామూళ్లు దండుకుంటున్న మైనింగ్‌ అధికారులు కళ్లెదుటే లారీలు తరలుతున్నా కన్నెత్తి చూడడం లేదు. ఇటీవల హైదరాబాద్‌ వెళ్తున్న లారీలను పట్టుకున్నట్లు హడావుడి చేసిన రెవెన్యూ అధికారులు రెండ్రోజుల తర్వాత మిన్నకున్నారు. 

కలెక్టర్‌ దృష్టిసారిస్తేనే... 
స్టాక్‌ పాయింట్ల నుంచి నిత్యం వందల లారీల ఇసుక తెలంగాణకు తరలుతోంది. మైనింగ్, రెవెన్యూ, పోలీసులు నిమ్మకు నీరెత్తినట్లున్నారు. నామమాత్రంగా జరిమానాలు, కేసులు పెట్టి వదిలేస్తున్నారు. మామూళ్లు ముట్టజెప్పి మరుసటి రోజే ఇసుక మాఫియా రంగంలోకి దిగుతోంది. తిరిగి అవే లారీలతో అక్రమ రవాణా చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో అధికార యంత్రాంగం నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. జిల్లా కలెక్టరైనా దృష్టిసారిస్తేనే దీనికి అడ్డుకట్ట వేయవచ్చన్న అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతోంది.  
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)