Breaking News

వివరణలోనూ ‘మస్కా’!

Published on Tue, 08/05/2025 - 05:04

సాక్షి, అమరావతి: నావిగేషన్‌ ఛానల్‌ ముసుగులో కృష్ణా నదిలో జరుగుతున్న అక్రమ ఇసుక దందాపై ‘ఇసుక మస్కా’ శీర్షికతో సోమవారం సాక్షిలో ప్రచురితమైన కథనంపై ప్రభుత్వం తప్పించుకునే ధోరణిలో వివరణ ఇచ్చింది. అక్కడ జరుగుతున్న వందల కోట్ల ఇసుక దోపిడీపై కథనంలో ప్రస్తావించిన కీలకమైన అంశాలకు సమాధానం ఇవ్వకుండా, జిల్లా స్థాయి ఇసుక కమిటీ అనుమతి మేరకే కృష్ణా, గోదావరి వాటర్‌ వేస్, ఇన్‌ల్యాండ్‌ కార్గో మూవర్స్‌ తవ్వ­కాలు జరుగుతున్నట్లు తెలిపింది. టన్నుకు రూ.215 రేటును కమిటీయే నిర్ధారించినట్లు స్పష్టం చేసింది.

ఈ మేరకు సోమవారం గనుల శాఖ గుంటూరు జిల్లా డిప్యూటీ డైరెక్టర్‌ చంద్రశేఖర్‌ వివరణ ఇచ్చారు. టన్నుకు రూ.215 రేటును నిర్ధారించామని, అందులో రూ.70 నది కట్ట నుంచి స్టాక్‌ పాయింట్లకు ట్రాక్టర్ల ద్వారా ఇసుకను రవాణా చేయడానికి ఖర్చు అవుతుందని అంచనా వేశామన్నారు. అయితే, వాస్తవానికి ఈ రవాణాకు అసలు ట్రాక్టర్లే ఉపయోగించడం లేదు. నది వద్ద, స్టాక్‌ పాయింట్ల వద్ద పెద్ద లారీలు, టిప్పర్లు, డంపర్లు మాత్రమే కనిపిస్తున్నాయి. అలాగే స్టాక్‌ పాయింట్‌లో వినియోగదారుల వాహనాలకు ఇసుక లోడ్‌ చేసేందుకు టన్నుకు రూ.30 ఖర్చవుతుందని అంచనా వేసినా, ఇందుకు రూ.15 మాత్రమే ఖర్చవుతుందని బోట్స్‌­మెన్‌ సంఘాలు స్పష్టం చేస్తున్నాయి.

అన్ని రకాల చార్జీలు కలిపి టన్నుకు రూ.213.75 ఖర్చు అవుతుందని, దాన్ని రౌండ్‌ ఫిగర్‌ చేసి రూ.215గా నిర్ధారించినట్లు ప్రభుత్వ పేర్కొంది. రూ.213.75ను రౌండ్‌ ఫిగర్‌ చేస్తే రూ.214 అవుతుంది తప్ప రూ.215 ఎలా అవుతుందో గనుల శాఖకే తెలియాలి. దీన్నిబట్టి ఈ రేటు నిర్ధారణ మొత్తం కట్టుకథేనని, చినబాబు చెప్పిన రేటుకు కాంట్రాక్టు ఇచ్చినట్లు స్పష్టమవుతోంది.

7.70 లక్షల టన్నుల ఇసుక తవ్వకానికి అనుమతిచ్చామని వివరణలో పేర్కొన్నా, ఇప్పటి వరకు ఎన్ని టన్నుల ఇసుక తవ్వారు, ఏ స్టాక్‌ పాయింట్‌ నుంచి ఎంత ఇసుక తరలించారు.. రాజ­ధాని పనులకు ఎంత ఇసుక సరఫరా చేశారు.. బయటి వారికి ఎంత ఇసుక విక్రయించారు.. ఇంకా ఎన్ని టన్నుల ఇసుక తవ్వాల్సి ఉంది.. వంటి వివరాలేవీ వివరణలో పేర్కొనక పోవడాన్ని బట్టి పరిమితికి మించి 15 లక్షల టన్నులకుపైగా ఇసుకను అడ్డగోలుగా తవ్వినట్లు గనుల శాఖ పరోక్షంగా అంగీకరించినట్లయింది. డ్రెడ్జింగ్‌కు అనుమతి ఇచ్చిన కంపెనీకి ఉన్న అర్హతల గురించి కనీసం ప్రస్తావించక పోవడాన్ని బట్టి ఆ కంపెనీకి అర్హత లేదనే విషయం స్పష్ట­మవుతోంది. గనుల శాఖ ఇచ్చిన వివరణ ద్వారానే రూ.వందల కోట్ల విలువైన ‘ఇసుక మస్కా’ నిజమనే విషయం రూఢీ అవుతోంది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)