Breaking News

ఇసుకపై ఇరకాటం..!

Published on Fri, 08/23/2024 - 05:33

సాక్షి, అమరావతి: ఇసుక పేరుతో సాగుతున్న దోపిడీ వ్యవహారాలపై ప్రజాగ్రహం వెల్లువె­త్తుతుండటంతో ఆ తప్పంతా అధికార యంత్రాంగంపై నెట్టివేసేందుకు సీఎం చంద్రబాబు సన్నద్ధమయ్యారు. కూటమి ప్రభుత్వం అధికా­రం­లోకి రావడమే ఆలస్యం స్టాక్‌ యార్డుల్లో ఉన్న ఇసుకలో దాదాపు 40 లక్షల టన్నులు మాయం చేసి అందినకాడికి విక్రయించి పచ్చముఠాలు సొమ్ము చేసుకుంటున్నట్లు ఇప్పటికే బహిర్గత­మైంది. పెద్ద ఎత్తున ఇతర రాష్ట్రాలకూ తరలించారు. నిత్యం తవ్వుకో తమ్ముడూ అంటూ రీచ్‌ల్లోనూ యథేచ్ఛగా అక్రమాలకు పాల్పడు­తుం­డటంపై ప్రజల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమ­వుతున్నాయి.

ఇక ఇతర మీడియాల్లోనూ దీనిపై కథనాలు వెలువడుతుండటంతో ప్రభుత్వం తప్పనిసరి పరిస్థితుల్లో స్పందించింది. వైఎస్‌ జగన్‌ సర్కారు హయాంలో కంటే ఇసుక ధర ఇప్పుడే ఎక్కువగా ఉన్నట్లు ప్రజల నుంచి ఫీడ్‌ బ్యాక్‌ రావడంతో బుధవారం నిర్వహించిన సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారు­లపై తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు సమాచా­రం.

ప్రధానంగా ఉత్తరాంధ్రలో విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో గతంలో కంటే ఇప్పుడే ఇసుక ధర ఎక్కువగా ఉన్నట్లు ఫీడ్‌ బ్యాక్‌ వస్తోందని ప్రస్తావించారు. స్టాక్‌ యార్డుల్లో నిల్వ ఉన్న ఇసుకను ఇష్టానుసారంగా విక్రయించినప్పుడు కళ్లు మూసుకుని బుకాయించిన ప్రభుత్వ పెద్దలు ఇప్పుడు దీన్ని అధికారులపై నెట్టివేసే యత్నాలపై యంత్రాంగంలో విస్మయం వ్యక్తమ­వుతోంది. కాగా రాష్ట్రంలో 59 ఇసుక యార్డుల్లో ఇక 24.08 లక్షల టన్నులు ఇసుక మాత్రమే నిల్వ ఉన్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)