భూమన కరుణాకరరెడ్డిపై అక్రమ కేసు

Published on Wed, 09/17/2025 - 05:32

తిరుపతి క్రైమ్,తిరుపతి మంగళం: టీటీడీ మాజీ చైర్మన్, వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నేత భూమన కరుణాకర రెడ్డిపై తిరుపతి అలిపిరి పోలీస్‌స్టేషన్‌లో మంగళవారం రాత్రి అక్రమ కేసు నమోదు చేశారు. హిందూ మత మనోభావాలు దెబ్బతీయడానికి, టీటీడీని కించపరచడానికి, ప్రజల్లో అల్లర్లు రేపడానికి దు్రష్పచార వీడియోలు పోస్ట్‌ చేశారంటూ ఆయనపై టీటీడీ డిప్యూటీ ఇంజనీర్‌ గోవిందరాజులు అలిపిరి పోలీస్‌ స్టేషన్లో మంగళవారం ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు 196(1)(ఎ), 197(1), 299, 352, 353(3), 356(2), రెడ్‌ విత్‌ 356(1) బిఎంఎస్‌ చట్టం కింద భూమనపై కేసు నమోదు చేశారు. 

తిరుపతి అలిపిరి బస్టాండు సమీపంలో చెత్త, మద్యం సీసాలు, మూత్ర విసర్జన జరిగే ప్రదేశాల్లో వేంకటేశ్వర స్వామి విగ్రహాన్ని వదిలిపెట్టినట్లుగా భూమన కరుణాకరరెడ్డి చూపించారని గోవిందరాజులు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించి వీడియోలు వాట్సాప్‌ గ్రూపుల్లో వైరల్‌ అయ్యాయన్నారు. రాయల్‌ చెరువుకు చెందిన దివంగత పట్టా కన్నాచారి సుమారు 20 ఏళ్ల క్రితం ఈ శిల్పాన్ని పూర్తిచేయకుండా వదిలేశారని తెలిపారు. 

ఆ సమయంలో చాలా రాళ్లతో పాటు శనీశ్వర విగ్రహాన్ని భూదేవి కాంప్లెక్స్‌ వెనుకవైపు ఉన్న ఖాళీ స్థలంలో పడేశారన్నారు. ఈ విగ్రహానికి, టీటీడీకి ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని కించపరిచి రాజకీయ లబ్ధి కోసమే భూమన ఈ చర్యలకు పాల్పడ్డారని ఆరోపించారు.  

శనీశ్వరుడికి శంఖు, చక్రాలు ఉంటాయా? 
భూమన మండిపాటు 
రాజకీయాల కంటే హిందూ ధర్మ పరిరక్షణే లక్ష్యంగా పోరాడుతానని టీటీడీ మాజీ చైర్మన్‌ భూమన కరుణాకర రెడ్డి స్పష్టం చేశారు. తిరుపతిలో మంగళవారం రాత్రి ఆయన తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. అలిపిరి పాదాలచెంత మహావిష్ణువు విగ్రహాన్ని మద్యం బాటిళ్ల మధ్య పడేశారని చూపించి ప్రశ్నిస్తే టీటీడీ అధికారులు తనపై కేసులు పెట్టడం వారి నీచత్వానికి నిదర్శనమని మండిపడ్డారు. 

టీటీడీలో జరుగుతున్న తప్పిదాలు, అపచారాలు, ఘోరాలను సరిదిద్దుకోవాల్సిన టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడు తనపై కేసులు పెట్టించడం దుర్మార్గమన్నారు. మహావిష్ణువు విగ్రహానికి అపచారం జరిగిందని చూపితే అసలు ఆ విగ్రహం మహావిష్ణువుదే కాదు.. శనీశ్వర స్వామిదని చెప్పడం ఏంటని మండిపడ్డారు. శనీశ్వరస్వామి విగ్రహానికి శంఖు, చక్రాలు ఉంటాయా అని నిలదీశారు. తనపై ఎన్ని కేసులు పెట్టినా, జైలుకు పంపినా భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.   

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)