Breaking News

వేటకు వెళ్లిన బోటుకు అగ్ని ప్రమాదం

Published on Wed, 06/19/2024 - 05:24

మహారాణిపేట(విశాఖ దక్షిణ): సముద్రంలో వేటకు వెళ్లిన బోటు అగ్ని ప్రమాదా­నికి గురైంది. ఈ ఘటన సోమవారం అర్ధరాత్రి తర్వాత చోటుచేసుకుంది. విశాఖ దక్షిణం వైపు 28 నాటికల్‌ మైళ్ల దూ­రం పూడిమడక సముద్ర తీరంలో ఈ అగ్ని ప్రమాదం సంభవించింది. గనగళ్ల అప్పయ్యమ్మ బోటు ఈనెల 15న వేటకు వెళ్లింది. సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత పూడిమడక ప్రాంతంలో బోటు నంబర్‌ ఐఎన్‌డి–ఏపీ–వి5–ఎంఎం–17తో చేపలు, రొయ్యల వేట సాగుతోంది. తొలుత బోటు ఇంజన్‌ నుంచి మంట­లు వచ్చాయి. 

సిబ్బంది వెళ్లి ఇంజన్‌ను పరిశీలించగా, ఒక్కసారిగా మంటలు వ్యాప్తి చెందాయి. దీంతో బోటు సిబ్బంది వెంటనే సముద్రంలో దూకారు. వేటకు వెళ్లిన ఏడుగురు మత్స్యకారులు సురక్షితంగా బయటపడ్డారు. చూస్తుండగానే బోటు కాలిపోయింది. వేటాడిన మత్స్య సంపద, ఇతర సామగ్రి కూడా అగ్నికి ఆహుతయ్యాయి. మత్స్యకారులు మంగళవారం ఉదయానికి స్థానిక ఫిషింగ్‌ హార్బర్‌­కు చేరుకున్నారు. ప్రమాదం నుంచి బయట పడిన వారిలో వాసుపల్లి రాజు (36), వాసుపల్లి అప్పన్న (58), వాసుపల్లి దాసీలు (41), వాసుపల్లి అప్పారావు (41), గనగళ్ల ఎరికొండు (40), మైలపల్లి ఎరయ్య్ర (50), గనగళ్ల పోలిరాజు (20) ఉన్నారు.

బోటు దగ్ధం కావడంతో యజమానికి రూ.30 లక్షలు మేర నష్టం కలిగిందని ఫిషింగ్‌ హార్బర్‌ మెకనైజ్డ్‌ బోటు ఓనర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు వాసుపల్లి జానకిరామ్‌ మీడియాకు తెలిపారు. సురక్షితంగా బయటపడ్డ మత్స్యకారులకు ఆశ్ర­యం కల్పించామన్నారు. ఘటనలో నష్టపోయిన బోటు యజమానికి ప్రభు­త్వం ఆర్థికసాయం చేయాలని కోరారు. ప్రమాదం విషయాన్ని మంత్రి అచ్చెన్నాయు­డు దృష్టికి తీసుకెళ్తానని సంఘం మాజీ అధ్యక్షుడు పి.సి.అప్పారావు తెలిపారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)