Breaking News

నాటు తుపాకులతో వేటగాళ్లు హల్‌చల్‌

Published on Tue, 05/13/2025 - 12:23

ఏలూరు: నాటుతుపాకులతో వేటగాళ్లు హల్‌చల్‌ చేస్తున్నారు. ప్రతిరోజు ఆక్వా చెరువులపై పిట్టలు కొట్టేందుకు తుపాకులను విచ్చలవిడిగా వాడుతున్నారు. పశ్చిమగోదావరి జిల్లాలోని ఉండి, అర్తమూరు తదితర గ్రామాలతోపాటు ఆకివీడు, కాళ్ళ, పాలకోడేరు, భీమవరం రూరల్‌ మండలాలు, ఏలూరు జిల్లాలోని గణపవరం, నిడమర్రు మండలాల్లోను ఇదే విధంగా నాటు తుపాకులు దర్శనమిస్తున్నాయి. పట్టపగలే వాహనాలపై తుపాకులను చేతపట్టుకుని తిరుగుతున్నా పోలీసులు గానీ, ఇతర అధికారులు గానీ ఎవరూ పట్టించుకోడం లేదంటూ సామాన్యులు ఆందోళన చెందుతున్నారు. తుపాకీ గురితప్పితే తమ పరిస్థితి ఏంటని ఆయా మండలాల్లోని ప్రజలు, వ్యవసాయ కూలీలు ఆందోళన చెందుతున్నారు.

ఇది నేరం కాదా?
నాటు తుపాకీలతో కేవలం పిట్టలనే కాలుస్తున్నారా.. లేక మరేదైనా జరుగుతుందా.. తుపాకుల సరఫరా ఎక్కడ నుంచి జరుగుతుంది అంటూ పలువురు వీటిపై ఆరా తీస్తున్నారు. ముఖ్యంగా ఈ నాటు తుపాకులతో ఇతర రాష్ట్రాలైన తమిళనాడు, ఒరిస్సా రాష్ట్రాల నుంచి వేటగాళ్లు ఇంత బహిరంగంగా ఎలా వస్తున్నారు? వారికి రూ.30 వేలు నుంచి రూ.40 వేలు జీతాలు ఎలా ఇస్తున్నారు?ఇదేమీ నేరం కాదా అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు.

గతంలో నాటుతుపాకీతో దారుణాలు
గతంలో నాటుతుపాకీతో జరిగిన దారుణాలు గుర్తు తెచ్చుకుని ప్రజలు భయపడుతున్నారు. గతంలో సరిగ్గా పంచాయతీ ఎన్నికల సమయంలో మండలంలోని ఎన్నార్పీ అగ్రహారంలో నాటుతుపాకీతో ఓ హత్య జరగడం అప్పట్లో సంచలనం సృష్టించింది. అప్పుడు కూడా ఆక్వా చెరువులపై పిట్టలు కొట్టేందుకు తెచ్చిన నాటుతుపాకీగా పోలీసులు గుర్తించినట్లు పలువురు చెబుతున్నారు. అలాగే చెరువుకువాడ గ్రామంలో నాటు తుపాకీతో ఓ వ్యక్తి కోతి(వానరం)ని కాల్చడం కూడా సంచలనానికి దారి తీసింది. ఇంతటి భయంకరమైన ఘటనలు చోటుచేసుకుంటున్నా అధికారులు పట్టంచుకోకపోవడంపై ప్రజలు తీవ్రంగా విమర్శిస్తున్నారు. వెంటనే వీటిపై చర్యలు తీసుకుని ప్రజల ప్రశాంత జీవనానికి అండగా నిలవాలని వారు కోరుతున్నారు.

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)