Breaking News

బదిలీల పేరుతో బంతాట!

Published on Thu, 07/17/2025 - 05:59

సాక్షి, అమరావతి: ఉమ్మడి కృష్ణా జిల్లా పెనమలూరు మండలంలో పని చేస్తున్న దివ్యాంగ కేటగిరీకి చెందిన వెల్ఫేర్‌ అసిస్టెంట్‌ను ఇబ్రహీంపట్నం మండలంలోని ఒక గ్రామ సచివాలయానికి ఉన్నతాధికారులు బదిలీ చేశారు. అక్కడ విధుల్లో చేరేందుకు ఆయన రెండు రోజుల కిందట వెళ్లారు. ఉదయం 11 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సచివాలయంలో వేచి ఉన్నా, ఆయన నుంచి జాయినింగ్‌ రిపోర్టు తీసుకోలేదు. కారణం అడిగితే ఎమ్మెల్యే కార్యాల­యం నుంచి ఒత్తిళ్లు ఉన్నాయని సచివాలయ సిబ్బంది బదులిచ్చారు. 

ఈ విషయాన్ని సదరు వెల్ఫేర్‌ అసిస్టెంట్‌ జిల్లా ఉన్నతాధికారులకు తెలియజేస్తే... మరోచోటకు బదిలీ చేస్తామని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా చాలా మంది సచివాలయాల ఉద్యోగులు ఇదే రకమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు. ఎమ్మెల్యే కార్యాలయం ఆదేశాలు లేకపోతే ఉద్యోగులు విధుల్లో కూడా చేరలేని దుస్థితి నెలకొందని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.

వారం కిందటే బదిలీల ప్రక్రియ ముగిసినా...
సచివాలయాల ఉద్యోగుల బదిలీల ప్రక్రియ అధికారికంగా వారం రోజుల కిందటే ముగిసింది. సినియారిటీతో సంబంధం లేకుండా అధికార పార్టీ నేతల సిఫార్సులను పరిగణనలోకి తీసుకుని వేలాది మంది ఉద్యోగులను ఇష్టానుసారం బదిలీ చేశారు. అయితే, బుధవారం నాటికి కూడా చాలాచోట్ల బదిలీ అయిన స్థానాల్లో ఉద్యోగులను విధుల్లో చేర్చుకోవడం లేదు. 

తమను ఎందుకు విధుల్లో చేర్చుకోవడం లేదని సచి­వాల­యాల ఉద్యోగులు ప్రశ్నిస్తే... ‘మిమ్మల్ని చేర్చుకో­వద్దని ఎమ్మెల్యే కార్యాలయం నుంచి ఫోన్‌ వచ్చింది’ అంటూ అక్కడ పనిచేసే తోటి పర్యవేక్షణ సిబ్బంది బదులిస్తున్నారు. దీంతో వివిధ కేటగిరీ­లకు చెందిన వందలమంది ఉ­ద్యోగులు తమ బదిలీల ఉత్తర్వుల కాపీలను ప­ట్టుకొని పోస్టింగ్‌ల కోసం జిల్లా శాఖాధిపతుల కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఇందు­లో దివ్యాంగులు కూడా ఉన్నారు. అధికార పార్టీ నేతలు తమ రాజకీయ స్వార్థం కోసం సచివా­లయ ఉద్యోగులతో చెలగాటం ఆడు­తున్నారని ఉ­ద్యోగ సంఘాల నాయకులు మండిపడుతున్నారు.   

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)