Breaking News

ఎస్సీ కమిషన్‌ నివేదిక నోటిఫై అయ్యాకే డీఎస్సీ

Published on Thu, 03/13/2025 - 05:27

సాక్షి, అమరావతి: ‘ఎస్సీ వర్గీకరణపై వచ్చిన నివేదిక ప్రభుత్వ పరిశీలనలో ఉంది. అది హౌస్‌లో చర్చకు వస్తుందని అనుకుంటున్నాం. ఆ తర్వాత కేబినెట్‌ ఆమోదంతో ఎస్సీ కమిషన్‌కు పంపించి ఆ మేరకు నోటిఫికేషన్‌ విడుదలయ్యాక డీఎస్సీ నోటిఫికేషన్‌ ఇస్తాం’ అని మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్‌ స్పష్టం చేశారు. డీఎస్సీకి కట్టుబడి ఉన్నామని, ఈ సంవత్సరమే ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేస్తామని చెప్పారు. 

బుధవారం శాసన మండలిలో ‘విద్యా రంగంలో సంస్కరణల’పై నిర్వహించిన చర్చలో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వం విద్యార్థులకు ట్యాబ్స్‌ ఇవ్వడం ద్వారా రూ.1,300 కోట్లు వృథా చేసిందని విమర్శించారు. ‘తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పిల్లలకు ట్యాబ్స్‌ ఇవ్వడం సరికాదని నాతో చెప్పారు. మళ్లీ మీరు ట్యాబ్స్‌ ఇవ్వకండన్నారు. నాకు తొమ్మిది సంవత్సరాల అబ్బాయి దేవాన్‌‡్ష  ఉన్నాడు. తనకు ఫోన్‌ ఇవ్వం. ఐప్యాడ్‌ లేదు.

వారానికి రెండు గంటలు ఒక సినిమా చూడొచ్చు. కానీ, టెక్నాలజీ యుగంలో హోం వర్క్, రీసెర్చ్‌ ఆన్‌లైన్‌ చేయాలంటే డెస్‌్కటాప్‌ (కంప్యూటర్‌)ని అది కూడా సూపర్‌వైజ్‌ చేసి∙యాక్సెస్‌ ఇస్తాం’ అంటూ చెప్పుకొచ్చారు. సీబీఎస్సీ మోడల్‌ ఎగ్జామ్‌ విధానంపై చాలా ప్రిపరేషన్‌ అవసరమని, అది పూర్తి అయిన తర్వాతే కొనసాగించేందుకు వాయిదా వేశామన్నారు. స్థానికంగా విద్యార్థులు ఇంగ్లిష్ లో వెనుకబడితే గత ప్రభుత్వం టొఫెల్‌తో ఇబ్బంది పెట్టిందన్నారు. 

ఉపాధ్యాయులకు యాప్‌ల భారం తగ్గిస్తామని, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలను దశల వారీగా విడుదల చేస్తామని చెప్పారు. కాలేజీ యాజమాన్యాలు ఫీజుల కోసం విద్యార్థులను ఇబ్బంది పెడితే చర్యలు తీసుకుంటామన్నారు. ఇకపై ఉపాధ్యాయులకు సెలవుల్లోనే శిక్షణ తరగతులు పెడతామని, వర్సిటీలకు ఉమ్మడి చట్టం తీసుకురావడంతో పాటు డీప్‌టెక్‌ వర్సిటీని నెలకొల్పుతామని చెప్పారు. 

అంబేడ్కర్‌ ఓపెన్‌ వర్సిటీని డిజిటల్‌ వర్సిటీగా మారుస్తామన్నారు. పంచాయతీరాజ్‌ శాఖను నిర్వహించడం ఎంతో సులువని, అయితే తాను కఠినమైన విద్యా శాఖను తీసుకున్నానని తెలిపారు.   

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)