Breaking News

మా జీవితాలతో 'ఆటొ'ద్దు..!

Published on Wed, 09/10/2025 - 05:33

గాందీనగర్‌(విజయవాడసెంట్రల్‌): మా జీవితాలతో ఆటలొద్దని, స్త్రీశక్తి పథకంతో రోడ్డున పడిన ఆటో, క్యాబ్‌ కార్మికులను ఆదుకోవాలని ఆటోవాలాలు గళమెత్తారు. కూటమి సర్కారు తీరుకు నిరసనగా   మంగళవారం విజయవాడలో రణభేరి మోగించారు.  సీఐటీయూ అనుబంధ యూనియన్‌ ఆధ్వర్యంలో ఆటోలతో భారీ ర్యాలీ, ప్రదర్శన నిర్వహించారు. చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆటోడ్రైవర్ల ఉద్యమ గర్జనతో బీఆర్టీఎస్‌ రోడ్డు మార్మోగింది. 

సీతన్నపేట గేటు వద్ద నుంచి ప్రారంభమైన ర్యాలీ శారదా కళాశాల జంక్షన్‌ వరకు.. అక్కడ నుంచి తిరిగి సీతన్నపేట గేట్‌ వరకు సాగింది.  రెండు వరుసల్లో వందలాది ఆటోలు, వేలాది ఆటో కార్మికులు ప్రదర్శనలో పాల్గొన్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన  స్త్రీ శక్తి పథకం వల్ల ఉపాధి కోల్పోయామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. 

ఆటో,క్యాబ్‌ డ్రైవర్లకు సంవత్సరానికి రూ. 25,వేల ఆర్థిక సహాయం అందించాలని, జీవో నంబర్‌ 21 రద్దు చేయాలని, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, ఐదు శాతం వడ్డీతో ఆటోల కొనుగోలుకు ప్రభుత్వ బ్యాంకుల ద్వారా రూ.4 లక్షల రుణాలు ఇవ్వాలని, ఇన్సూరెన్స్‌ రేట్లు తగ్గించాలని, సీఎన్‌జీ గ్యాస్‌ సబ్సిడీపై ఇవ్వాలని ఆటో కార్మికులు డిమాండ్‌ చేశారు. 

ఇప్పటికే కార్పొరేట్‌ యాప్‌లతో నష్టం  
ఆందోళనకు మద్దతు తెలిపిన సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సీహెచ్‌ బాబురావు మాట్లాడుతూ ఇప్పటికే ఓలా, ఉబర్, ర్యాపిడో యాప్‌ల వల్ల ఆటో మోటార్‌ కార్మికులు కిరాయిలు తగ్గిపోయి ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ  నేపథ్యంలో మహిళలకు ఉచిత బస్సు పథకం వల్ల మరింత నష్టం వాటిల్లుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)