Breaking News

నేడు హైందవ శంఖారావం

Published on Sun, 01/05/2025 - 05:20

సాక్షి, అమరావతి/గన్నవరం: ఆలయాలను ప్రభుత్వ నియంత్రణ నుంచి విముక్తి కలిగించి, స్వయంప్రతిపత్తి కలిగిన ఉత్తమ ధార్మిక వ్యవస్థకు అప్పగించేలా చట్ట సవరణలు చేయాలని డిమాండ్‌ చేస్తూ విశ్వహిందూ పరిషత్‌ (వీహెచ్‌పీ) ఆదివా­రం ‘హైందవ శంఖారావం’పేరుతో విజయవాడ­కు సమీపంలోని కేసరపల్లి వద్ద భారీ బహిరంగ సభను నిర్వహించనుంది. వీహెచ్‌పీ దేశవ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని చేపట్టి, ఏపీ నుంచే తొలి బహిరంగ సభ నిర్వహించనుంది. 

ఈ సభకు 3.5 లక్షల మంది ఈ సభకు హాజరవుతారని అంచనా. 30 ఎకరాల పరిధిలో బహిరంగ సభ నిర్వహణకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. 3,500కి పైగా బస్సులు, 7 రైళ్ల ద్వారా సభకు ప్రజలు తర­లి­రానున్నారు. సభకు నాలుగు వైపుల 150 ఎక­రాల విస్తీర్ణంలో పార్కింగ్‌కు తగిన ఏర్పాట్లు చేశా­రు. 

ఆర్‌ఎస్‌ఎస్, దాని అనుబంధ సంఘాలు ఏపీలో చాలా ఏళ్ల తర్వాత ఇంతటి భారీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టగా..వీహెచ్‌పీ, ఏబీ­వీపీ, భారతీయ కిసాన్‌ సంఘ్, భారతీయ మ­జ్దూర్‌ సంఘ్, భజరంగ్‌దళ్, భారతీయ వికాస్‌ పరి­షత్‌ వంటి 40కి పైగా సంస్థల ప్రతినిధులు ఈ సభ­ను విజయవంతం చేసేందుకు 3 నెలలు పాటు పనిచేసినట్లు వీహెచ్‌పీ నేతలు చెప్పారు. 

ఈ సభకు వీహెచ్‌పీ జాతీయ అధ్యక్షుడు అలోక్‌ కుమా­ర్, అర్గనైజింగ్‌ సెక్రటరీ మిలింద్‌ పరందే, శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర కోశాధికారి గోవిందదేవ్‌ గిరి మహరాజ్‌తో పాటు పెద్ద సంఖ్యలో స్వామీజీలు హాజరుకానున్నారు. సభ నేపథ్యంలో ఆదివారం విజయవాడ, చట్టుప్రక్కల ప్రాంతాల్లో భారీ ట్రాఫి­క్‌ ఆంక్షలను పోలీసులు అమలు చేయనున్నారు.

Videos

Fire accident : చార్మినార్ ప‌రిధిలో భారీ అగ్నిప్రమాదం

కోనేరులోకి దూసుకెళ్లిన ఇన్నోవా.. తప్పిన పెను ప్రమాదం

తెలుగు ప్రజలకు YS జగన్ దసరా శుభాకాంక్షలు

పులివెందులలో ఖాకీ కుట్ర.. YSRCP శ్రేణులపై ఏకే 47తో కాల్పులు..

రెండు కాళ్లు లేని దివ్యాంగుడిపై దాడి.. టీడీపీ నేతల దాష్టీకం

కివీస్ తో పోరుకు బుల్డోడు అసలు కారణం ఇదే

నీ బెదిరింపులకు ఎవరూ భయపడరు దీప్తి రెడ్డి సంచలన వ్యాఖ్యలు

ఐదు రౌండ్ల కాల్పులు.. టైగర్ ష్రాఫ్ కేసులో కీలక మలుపు..!

నాకు అంత కోపం రావడానికి కారణం.. నామినేషన్ వేసేటప్పుడు అసలు ఏం జరిగిందంటే

లోకల్ వార్ రెండో దశ మొదలు

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)