Breaking News

కొనలేం.. తినలేం

Published on Tue, 11/18/2025 - 03:46

సాక్షి, అమరావతి: కూరగాయల ధరలు కొండెక్కాయి. కార్తీక మాసం చివరికి వచ్చినా ధరల మోత తగ్గలేదు. మోంథా తుపాను సాకుతో రైతుబజార్లతోపాటు బహిరంగ మార్కెట్‌లోనూ రేట్లు భారీగా పెంచేశారు. దళారులు ఆడిందే ఆట.. నిర్ణయించిందే రేటుగా సాగుతోంది. కార్తీక మాసం ఆరంభానికి ముందు రైతు బజారులో కిలో కూరగాయలు రూ.20 నుంచి రూ.30కి లభించేవి. మార్కెట్‌లోనూ రూ.40 నుంచి రూ.50కి దొరికేవి. ప్రస్తుతం రైతుబజారులో కూడా ధరలు భారీగా పెరిగిపోయాయి. బయటి మార్కెట్‌లో డబుల్‌ చేశారు.

వీటి ధరలు సామాన్య, మధ్య తరగతి ప్రజలకు అందనంత ఎత్తులో ఉన్నాయి. దినసరి కూలీలు, చిరుద్యోగులు మార్కెట్‌ వైపు చూడాలంటే హడలిపోతున్నారు. మోంథా తుపాను వల్ల పంట నష్టం వాటిల్లి దిగుబడులు కొంత తగ్గాయి. దీనికి తోడు భవానీ భక్తులు, అయ్యప్ప మాలధారులు, కార్తీక మాసంలో మాంసాహారానికి దూరంగా ఉండేవారిని దృష్టిలో పెట్టుకుని దళారులు చెలరేగిపోతున్నారు. వారికి నచ్చినట్టు ధరలు నిర్ణయిస్తున్నారు. తామేమీ తక్కువ కాదన్నట్టు బయట వ్యాపారులు సైతం సిండికేట్‌ అయి ధరలు పెంచి విక్రయిస్తున్నారు. 

పట్టించుకోండి బాబూ! 
కూరగాయల ధరలు మండిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ధరల నియంత్రణ తమ పని కాదన్నట్టు వ్యవహరిస్తోంది. ఫలితంగా వినియోగదారులు దోపిడీకి గురవుతున్నారు. పిల్లల్ని పస్తులు ఉంచలేక వ్యాపారులు చెప్పిన ధరలకే కొద్దోగొప్పో కూరగాయల్ని కొనుగోలు చేస్తూ వారి కడుపునింపుతున్నారు. ధరల పెరుగుదల మూడు నెలలుగా కొనసాగుతున్నా ప్రభుత్వం కనీసం నియంత్రణ చర్యలు చేపట్టడం లేదని వినియోగదారులు మండిపడుతున్నారు. మరోవైపు పెరిగిన ధరలు ఇప్పట్లో తగ్గే పరిస్థితి లేదని మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి. తుపానుకు పంటలు దెబ్బతిన్నాయని, ప్రస్తుతం సాగులో ఉన్న పంటలు దిగుబడి వచ్చే సరికి డిసెంబర్‌ ఆఖరు అవుతుందని రైతులు చెబుతున్నారు. అప్పటివరకు కొంచెం ఇటు అటుగా ఇవే ధరలు కొనసాగుతాయని వ్యాపారులు చెబుతున్నారు. 



రైతుకు దక్కేది అరకొరే 
మార్కెట్‌లో కూరగాయల ధరలు భారీగా పెరిగినా వాటిని పండించే రైతులకు మాత్రం ప్రయోజనం లేకుండాపోయింది. రైతులకు పాత ధరలే చెల్లిస్తూ దళారులు, హోల్‌సేల్‌ వ్యాపారులు లాభాలు దండుకుంటున్నారు. కాగా.. ధరలు భారీగా పెరగడంతో కూరగాయలు కొనేందుకు ప్రజలు జంకుతున్నారని, దీనివల్ల తాము తెచ్చిన కూరగాయలు అమ్ముడుపోవడం లేదని విజయవాడ జీఎస్‌ రోడ్డులో కూరగాయలు విక్రయించే రిటైల్‌ వ్యాపారి కొలుసు సత్యవతి చెప్పారు. సరుకు తక్కువగానే తెచ్చినా అమ్ముడవకపోవడంతో పాడైపోతున్నాయని తెలిపారు. హోల్‌సేల్‌ మార్కెట్‌లో ధరలు పెరిగిపోవడంతో తాము పెంచకతప్పడం లేదని సత్యవతి వాపోయారు. 

ఏమీ కొనలేని పరిస్థితి 
కార్తీక మాసం ఆరంభం నుంచి కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి.  ఏ కూరగాయ కొనాలన్నా కనీసం రూ.80 వెచ్చించాల్సి వస్తోంది. వంకాయలు కిలో రూ.100 చెబుతున్నారు. ఏమీ తినలేక పోతున్నాం. ఇలా అయితే ఎలా బతకాలి. – మీసాల దమయంతి. వంగపల్లిపేట, చీపురుపల్లి, విజయనగరం జిల్లా   

అందనంత ఎత్తులో కూరగాయలు ధరలు  
మార్కెట్‌లో కిలో వంకాయలు రూ.80 వరకు పలుకుతున్నాయి. బెండకాయలు, దొండకాయల ధరలు ఇందుకు భిన్నంగా ఏం లేవు. బీరకాయలు కిలో  రూ.40 నుంచి రూ.80 వరకూ పలుకుతున్నాయి. రైతుబజారుల్లో ధరలు ఇలా ఉంటే బహిరంగ మార్కెట్‌లో మరీ దారుణం.  – తంగుడు నాగమణి, మండలవీధి, గృహిణి, శ్రీకాకుళం నగరం.  

రూ.500 తీసుకెళ్లినా.. 
చిన్న ఉద్యోగం చేసుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాం. గతంలో రూ.200 తీసుకెళ్తే సంచి నిండా కూరగాయలు వచ్చేవి. ఇప్పుడు రూ.500 తీసుకెళ్లినా సగం సంచి కూడా నిండటం లేదు. కిలో కొనాల్సిన చోట అరకిలోతో సరిపెట్టుకుంటున్నాం. – కెల్లి పూర్ణమ్మ, పాత్రునివలస, జగనన్నకాలనీ, శ్రీకాకుళం. 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)