Breaking News

'మంట' పుట్టిస్తున్న వంటనూనెలు

Published on Thu, 10/31/2024 - 04:30

కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చిన తరువాత నిత్యావసరాల ధరలు పట్టపగలే చుక్కలు చూపిస్తున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. ఓ వైపు పప్పుల ధరలు చుక్కలనంటుతుంటే.. మరోవైపు వంటæనూనెల ధరలు తారాజువ్వల్లా దూసుకెళ్తుండడంతో పండుగ వేళ పిండివంటలు చేసుకోవాలంటేనే సామాన్య, మధ్యతరగతి ప్రజలు భయపడే పరిస్థితి నెలకొంది.   – సాక్షి, అమరావతి

చిరువ్యాపారులపై తీవ్ర ప్రభావం 
వంటనూనెల ధరల పెరుగుదల ప్రభావం సామాన్య, మధ్యతరగతులపైనే కాదు.. హోటల్‌ ఇండస్ట్రీస్‌పై కూడా తీవ్రంగా పడుతుంది. ముఖ్యంగా రోడ్‌సైడ్‌ చిన్న చిన్న తోపుడు పండ్లపై చిరువ్యాపారులు చేసుకునే వారిపై తీవ్ర ప్రభావం పడుతోంది.  కృత్రిమ కొరత సృష్టిస్తోన్న వ్యాపారులపై నిఘా కొరవడింది. సుంకం సాకుతో ధరలు పెంచిన తర్వాత మొక్కుబడి తంతుగా నాలుగైదు రోజులు విజిలెన్స్‌ అధికారులు హడావుడి చేశారు. అయితే కూటమి పెద్దల నుంచి వచ్చిన ఒత్తిళ్లతో ఆ తర్వాత పత్తా లేకుండా పోయారు.

చూసీ చూడనట్టు వదిలేసిన ప్రభుత్వం..
క్రూడ్‌ పామ్, సోయాబీన్, సన్‌ఫ్లవర్‌ ఆయిల్స్‌పై దిగుమతి సుంకాలు 5.5 శాతం నుంచి 27.5 శాతానికి కేంద్రం పెంచేసింది. శుద్ధి చేసి తినదగిన నూనెలపై 13.7 శాతం నుంచి 35.7 శాతానికి దిగుమతి సుంకాలు పెరిగాయి. ఈ పెంపు సెపె్టంబర్‌ 14వ తేదీ నుంచి అమలులోకి వచ్చీ రాగానే దేశంలో మరెక్కడా లేని విధంగా ఆంధ్ర­ప్రదేశ్‌లో ప్రభుత్వ పెద్దలు మామూళ్ల మత్తులో చూసీచూడనట్టు వ్యవహరించడంతో కంపెనీలు ఉన్నఫళాన రేట్లను అమాంతం పెంచేసాయి. 

ధరలు పెరిగిన సందర్భంలో పౌరసరఫరాల మంత్రి హడావుడి చేసినా ఆ తర్వాత ధరల పెంపుపై నోరు మెదపడం లేదు. వంటనూనెలతో పాటు నిత్యావసర వస్తువుల ధరలు 20–30 శాతం పెరగగా, కూరగాయల ధరలు 40–60 శాతం మేర పెరిగాయి. చివరికి కాఫీ ధరలు  60 శాతం, టీ ధరలు 25 శాతం పెరిగాయి. ప్రధానంగా బియ్యం ధర 15 శాతం, పప్పుల ధరలు 50–67 శాతం మేర పెరిగాయి.

5 నెలల్లో 60% పెరిగిన ధరలు
పామాయిల్‌ ధర సరిగ్గా ఐదు నెలల క్రితం మే 29న బ్రాండ్‌ను బట్టి లీటర్‌ రూ.88–90 మధ్య ఉండగా, ప్రస్తుతం రూ.128–140కు చేరుకుంది. రిఫైన్డ్‌ సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ రూ.108–113 నుంచి రూ.149–160 పెరిగిపోయింది. వేరుశనగ నూనె గతంలో రూ.157 ఉండగా, ప్రస్తుతం రూ.170–200 వరకు ఉంది. సన్‌డ్రాప్, ప్రియా, ఫ్రీడమ్‌ వంటి కంపెనీల ఆయిల్స్‌ అయితే ఏకంగా రూ.200కు పైగానే ఉన్నాయి. గత నెలతో పోలిస్తే 29–37 శాతం మేర పెరగగా, మేతో పోలిస్తే వంట నూనె ధరలు 40–60 శాతం మేర పెరిగాయి. ఇళ్లల్లో వాడే ఆవనూనె ధర సైతం నెల రోజుల్లో ఏకంగా 29శాతం పెరిగింది. గత నెలలో ముడిపామ్, సోయా బీన్, పొద్దుతిరుగుడు నూనెల ధరలు వరుసగా 10.6 శాతం, 12.3 శాతం, 16.8 శాతం చొప్పున పెరిగినందున.. ఆ ప్రభావం ధరలపై పడుతోందని మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి.  

గతంలో అండగా వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం
గతంలో ఉక్రేయన్‌ యుద్ధం నేపథ్యంలో 2022లో ఇదే రీతిలో పామాయిల్, సన్‌ఫ్లవర్‌ ఆయిల్స్‌ ధరలు అనూహ్యంగా పెరిగిన సందర్భంలో వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన వినియోగదారులకు అండగా నిలిచే కార్యక్రమాలు చేపట్టింది. ఆయిల్‌ ఫెడ్‌ ఉత్పత్తి అయిన విజయా బ్రాండ్‌ ఆయిల్స్‌ను రైతు బజార్లలో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసి సబ్సిడీ ధరలపై అందుబాటులోకి ఉంచింది.

ఆ సమయంలో క్రూడ్‌ ఆయిల్‌ ధరలు భారీగా పెరిగినప్పటికీ ఏమాత్రం ఆలోచించకుండా విదేశాల నుంచి దిగుమతి చేసుకోవడమే కాదు.. కంపెనీల నుంచి నేరుగా కొనుగోలు చేసి  సుమారు 3.5లక్షల లీటర్ల ఆయిల్స్‌ను సబ్సిడీ ధరలకు అందించారు. అదే విధంగా టమాటా, ఉల్లిపాయలను సబ్సిడీపై అందించి అండగా నిలిచింది. రోజురోజుకు పెరుగుతున్న ధరలను నియంత్రించడంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏ మాత్రం సీరియస్‌గా తీసుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  

Videos

తమన్నాతో బ్రేకప్.. మళ్లీ ఆమెతో డేటింగ్.!

అగ్నిగుండంగా పారిస్.. చారిత్రక భవనానికి నిప్పు

టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. లారెన్స్ బిష్ణోయ్ సంచలన ప్రకటన

వైఎస్సార్ జిల్లాలో ఉద్రిక్తత.. YSRCP ఛైర్మన్ అభ్యర్థి పోరెడ్డి ఇంటిపై టీడీపీ దాడి

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)