Breaking News

మటన్‌.. నాణ్యత మటాష్‌

Published on Sun, 03/16/2025 - 10:11

కర్నూలు(అగ్రికల్చర్‌): మాంసం లేనిదే నాన్‌ వెజ్‌ ప్రియులకు ముద్ద దిగదు. కొందరు ఆదివారం కోసం ఎదురు చూస్తుంటారు. మరి కొందరు వారంలో రెండు, మూడు రోజులు మాంసాహారమే తీసుకుంటారు. బర్డ్‌ఫ్లూ నేపథ్యంలో ఇటీవల మటన్‌ తినేవారు ఎక్కువయ్యారు. అయితే అడిగిందే ఇస్తున్నారా.. ఆరోగ్యంగా ఉన్న గొర్రెలు, మేకలు, పొట్టేళ్లను కోస్తున్నారా.. ఇలా ఎన్నో ప్రశ్నలు వస్తున్నాయి. ఉమ్మడి కర్నూలు జిల్లాలో చాలా చోట్ల నాణ్యతలేని మటన్‌ను ధర పెంచి అమ్ముతున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాల్సి ఉంది.  

నిబంధనలు బేఖాతర్‌..  
కర్నూలు, నంద్యాల జిల్లాల్లో దేవరలు జరుగుతుండటంతో మటన్‌కు డిమాండ్‌ పెరిగింది. ఒక మోస్తరు గ్రామంలో దేవర జరుగుతుందంటే 2,000, పెద్ద గ్రామంలో అయితే 4,000 వరకు జీవాలు కట్‌ అవుతాయి. దీనినే అవకాశంగా తీసుకొని అనారోగ్యానికి గురైన వాటిని కూడా వ్యాపారులు మాంసానికి వినియోగిస్తున్నారు. ధర పెరగడంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలకు మటన్‌ కొనలేకపోతున్నారు. నిబంధనలు పాటించకుండా కొందరు మాంసం వ్యాపారులు మోసం చేస్తున్నారు. మాంసానికి వినియోగించే జీవాల ఆరోగ్యాన్ని  నిబంధనల ప్రకారం శానిటరీ ఇన్‌స్పెక్టర్, పశు సంవర్ధక శాఖ వైద్యుడు పరిశీలించాలి. వీరి పర్యవేక్షణలో వధించిన మాంసంపై ముద్ర (రౌండ్‌ సీల్‌) వేసినది మాత్రమే విక్రయించాల్సి ఉంటుంది.

 నిబంధనలు పాటించే విధంగా నగరపాలక సంస్థ, మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలు చొరువ తీసు కోవాల్సి ఉంది. అయితే ఉమ్మడి కర్నూలు జిల్లాలో అధికారులు తనిఖీలు చాలా తక్కువ చేస్తున్నారు. దీంతో సగానికిపైగా వ్యాపారులు ఇళ్లు, దుకాణాల వద్దనే గొర్రెలు, మేకలు, పొట్టేళ్లను వధిస్తున్నారు. అంతేకాకుండా రోగాల బారినపడినవి, వయసు పైబడిన వాటిని కూడా వధించి విక్రయాలు చేస్తున్నారనే ఆరోపణలున్నా యి. ముఖ్య పట్టణాల్లో లైసెన్సు కలిగిన దుకాణాల్లో కాకుండా ఎక్కడ పడితే అక్కడ రోడ్లపైన, మురికి కాలువల పక్కన అపరిశుభ్ర వాతావరణంలోనే  అమ్మకాలు సాగిస్తున్నారు. ధరల వివరాల పట్టిక కనిపించకపోయినా ఎవరూ అడగడం లేదు. 

వినియోగం ఇలా.. 
ఉమ్మడి కర్నూలు జిల్లాలో 15 లక్షల కుటుంబాలు ఉన్నాయి. ఇందులో 80 శాతం అంటే 12 లక్షల కుటుంబాలు మాంసాహారాన్ని ఇష్టంగా తీసుకుంటాయి. ఇందులో 60 శాతం కుటుంబాలు (7.20 లక్షలు) చికెన్‌తో సరిపుచ్చుకుంటాయి. మిగిలిన 4.80 లక్షల కుటుంబాలు మటన్‌ తీసుకుంటాయి. వారం విడిచి వారం కిలో ప్రకారం వినియోగించినా... 24 వేల టన్నుల వరకు మాంసం అవసరమవుతోంది.   బర్డ్‌ప్లూ తర్వాత హోటళ్లలో చికెన్‌ వినియోగం కొంతవరకు తగ్గింది. మటన్‌పై వినియోగదారులు దృష్టి పెట్టారు. కొన్ని హోటళ్లలో వినియోగించే మటన్‌ నాణ్యత కూడా ప్రశ్నార్థకంగానే ఉంది.  

పెరిగిన ధరలు.. 
బర్డ్‌ప్లూ వెలుగు చూసిన తర్వాత కర్నూలు, నంద్యాల, ఆదోని, ఎమ్మిగనూరు, నందికొట్కూరు, ఆత్మకూరు వంటి ప్రాంతాల్లో మటన్‌ కిలో ధర రూ.900 పెంచేశారు. కర్నూలు, నంద్యాల, ఆదోని ప్రాంతాల్లో కిలో రూ.1000 వరకు అమ్ముతున్నారు. ఇంత ధర పెట్టినప్పటికి మాంసంలో నాణ్యత ఉంటుందా అంటే అదీ లేదు. పరీక్షలు లేవు... వధించింది పొట్టేలా..గొర్రెనా.. మేకనా.. అనేది తెలియదు. కొన్ని చోట్ల అనార్యాగంతో అపుడో, ఇపుడో చనిపోయే వాటిని కూడా మాంసానికి వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది. రోడ్డు ప్రమాదాలు, ఇతరత్రా కారణాలతో మరణించిన జీవాలను కూడా కొందరు వ్యాపారులు మాంసానికి వినియోగిస్తున్నట్లు సమాచారం.  

ఇలా చేయాలి... 
⇒ మురుగు కాలువల సమీపంలో, అపరిశుభ్ర వాతావారణం ఉన్న దుకాణాల్లో మాంసం తీసుకోవద్దు. 
⇒ మాంసానికి వినియోగిస్తున్న జీవాలు ఆరోగ్యంగా ఉంటున్నాయా... అనే దానిని పట్టించుకోవాలి.  
⇒ అధికారుల ముద్ర (రౌండ్‌ సీల్‌) వేసిన మాంసం మాత్రమే విక్రయించాలి. ఫ్రిజ్‌లలో నిల్వ చేసిన దానిని అస్సలు కొనొద్దు. 
⇒ తూకం వేసేటప్పుడు పరిశీలించాలి. అనుమానం వస్తే వెంటనే అధికారులకు ఫిర్యాదు చేయాలి.  

#

Tags : 1

Videos

ఏం తమాషాలు చేస్తున్నారా.. కలెక్టర్ ఆఫీస్ వద్ద అధికారుల ఓవర్ యాక్షన్

పులివెందులలో YS అవినాష్ రెడ్డిపై కాల్పులు Exclusive Visuals

RO రూమ్ లో ఉంటే TDP గూండాలు వచ్చి.. దాడి చేశారు.. YSRCP అభ్యర్థి

విశాఖ మేయర్ నేనే.. పోటీ ఎవరున్నా గెలుపు నాదే

విద్యార్థులకు TDP డబ్బు,బిర్యానీ వైరల్ అవుతున్న ఆడియో రికార్డింగ్

లోన్ కట్టలేదని వేధిస్తున్నారా? RBI రూల్స్ ఇవే!

దేనితో కొట్టాలి వీళ్లని.. పోలీసులే అభ్యర్థులను లాక్కెళుతున్నారు

సల్మాన్ ఖాన్‌తో పనిచేస్తే ఇదే గతి.. ఈ అనిల్ పండిత్ ఎవరు..?

PF ఉన్నవారందరికీ పెన్షన్ వస్తుందా? అసలు లెక్కలు తెలుసుకోండి..

వేటకొడవల్లితో TDP రౌడీలు దాడి.. బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

యాంకర్ అనసూయ ఇంట్లో దసరా సెలబ్రేషన్ ఇలా (ఫొటోలు)

+5

ఫ్యాషన్ షో కోసం తృప్తి దిమ్రి క్రేజీ గ్లామర్ (ఫొటోలు)

+5

దసరా స్పెషల్.. చూడముచ్చటగా విజయ్-రష్మిక జంట (ఫొటోలు)

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)