Breaking News

ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి

Published on Thu, 05/15/2025 - 03:28

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పలుచోట్ల ఎండలతోపాటు ఉక్కపోత ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. గుంటూరు, విజయవాడ తదితర ప్రాంతాల్లో 42 డిగ్రీల మేర ఉష్ణోగ్రత నమోదైనా 45 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రత ఉన్నట్లు అనిపించింది. వడగాలులు కూడా ఎక్కువగా ఉండడంతో జనం బయట తిరిగేందుకు జంకుతున్నారు. బుధవారం ప్రకాశం జిల్లా కొనకనమిట్ల, తిరుపతి జిల్లా మంగనెల్లూరులో 42.8 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. 

పల్నాడు జిల్లా కాకానిలో 42.7 డిగ్రీలు, బాపట్ల జిల్లా కొమ్మలపాడులో 42 డిగ్రీలు, నెల్లూరు జిల్లా దగదర్తిలో 41.7, నంద్యాల జిల్లా బొల్లవరంలో 41.6 డిగ్రీల చొప్పున అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 33 ప్రాంతాల్లో 41 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదైనట్లు విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. మరోవైపు శ్రీకాకుళం జిల్లా జగ్గిలి»ొంతులో 5.3. సెంటీమీటర్ల వర్షం కురిసింది. 

అదే జిల్లాలోని రాగోలులో 4.9 సెంటీమీటర్లు, శ్రీకాకుళంలో 4.7, ఏలూరు జిల్లా పూళ్లలో 4.4, శ్రీకాకుళం జిల్లా ఎల్‌ఎన్‌ పేటలో 3.8, ఆముదాలవలసలో 3.5, ఏలూరులో 3.4, పార్వతీపురం మన్యం జిల్లా  పాలకొండలో 3.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మరో నాలుగైదు రోజులు రాష్ట్రంలో ఇదేతరహా అనిశ్చిత వాతావరణ పరిస్థితులు కొనసాగనున్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ రోణంకి కూర్మనాథ్‌ తెలిపారు.   

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)