Breaking News

కళ్యాణదుర్గంలో పరువు హత్య!

Published on Sun, 11/30/2025 - 04:06

కళ్యాణదుర్గం: అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో పరువు హత్య జరిగింది. తమ అమ్మాయిని ప్రేమించాడన్న కోపంతో ప్రస్తుతం రాష్ట్రంలో కీలకంగా వ్యవహరిస్తున్న ఓ కులానికి చెందిన వారు బోయ (వాల్మీకి) సామాజిక వర్గానికి చెందిన యువకుడిని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారు. ఇటీవల జరిగిన ఈ ఘటన కళ్యాణదుర్గం నియోజకవర్గంలో హాట్‌ టాపిక్‌గా మారింది. 

మృతుడి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని బ్రహ్మసముద్రం మండలం యనకల్లు గ్రామానికి చెందిన బోయ ఆనంద్‌(21), బెళుగుప్ప మండలం నరసాపురం గ్రామానికి చెందిన యువతి ప్రేమించుకున్నారు.  ఈ విషయం తెలియడంతో యువతి తరఫు బంధువులు ఆనంద్‌ను, అతని కుటుంబ సభ్యులను చెప్పులతో కొట్టారు. దీంతో తమ కుమారుడి బతకనీయరని భయపడిన ఆనంద్‌ తల్లిదండ్రులు అతడిని ఉపాధి కోసం బెంగళూరుకు పంపించేశారు. 

యువతికి వేరే పెళ్లి చేసినా..!: అనంతరం యువతికి వేరే పెళ్లి చేశారు. అయితే తాను ఆనంద్‌ను ప్రేమించానని ఆమె భర్తతో చెప్పడంతో ఆ భర్త ఆమెకు విడాకులు ఇచ్చేశాడు. ఆ తర్వాత యువతికి మళ్లీ పెళ్లి చేసేందుకు ఆమె కుటుంబ సభ్యులు సిద్ధపడ్డారు. ఈ నేపథ్యంలో యువతి ఆనంద్‌కు వీడియో కాల్‌ చేసి పురుగు మందు బాటిల్‌ చూపించి ‘‘నువ్వు రాకపోతే చనిపోతా’’ అని బెదిరించింది. దీంతో భయపడిన ఆనంద్‌ ఈ నెల 20న బెంగళూరు నుంచి కళ్యాణదుర్గం వచ్చాడు. 

మరుసటి రోజు (21న) అతను పురుగు మందు తాగినట్టు సమాచారం అందడంతో కుటుంబ సభ్యులు అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. అప్పటికి పూర్తి వివరాలు తెలియకపోవడంతో కుటుంబ సభ్యులు అతని మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకువచ్చి అంత్యక్రియలు పూర్తి చేశారు.

టీడీపీ నేతల ఒత్తిళ్లు: బోయ ఆనంద్‌ మృతికి టీడీపీ నేతల ఒత్తిళ్లే కారణమని ప్రాథమికంగా నిర్ధారణైంది. అతని సెల్‌ ఫోన్‌లో మెసేజ్‌లు, ఆడియో, వీడియో రికార్డింగ్‌ ఉండటంతో.. తమ కుమారుడిది ఆత్మహత్య కాదని, ఇది ముమ్మాటికే హత్యేనని కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. యువతి తరఫు బంధువులు పథకం ప్రకారం బెంగళూరు నుంచి ఆనంద్‌ను రప్పించి ఆతర్వాత బలవంతంగా కొట్టి పురుగుల మందు తాగించారని ఆరోపిస్తున్నారు.

హత్యకాదు.. ఆత్మహత్యే: ఇదిలా ఉంటే ఆనంద్‌ది ఆత్మహత్యేనని, అతను వారం రోజుల క్రితం బలవన్మరణానికి పాల్పడ్డాడని డీఎస్పీ రవిబాబు తెలిపారు. డీఎస్పీ శనివారం పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో  మీడియాతో మాట్లాడారు. ఆనంద్‌ను హత్య చేశారనేందుకు ఎలాంటి ఆధారాలూ లేవన్నారు.  

మాకు సంబంధం లేదు: ఆనంద్‌ మృతితో తమకు సంబంధం లేదని బెళుగుప్ప మండలం నరసాపురం గ్రామానికి చెందిన యువతి తల్లి తెలిపారు. శనివారం అనంతపురం ప్రెస్‌క్లబ్‌లో ఆమె విలేకరులతో మాట్లాడారు. ఆనందే తమ కుమార్తె వెంటపడి వేధించాడని, ఆమె మొదటి భర్తకు లేనిపోనివి చెప్పి విడాకులు ఇచ్చేలా చేశాడని తెలిపారు. ఇప్పుడు మరో సంబంధం కుదిరితే మళ్లీ తమ కుమార్తెను బెదిరించాడని, తమ అమ్మాయి ఒప్పుకోక పోవడంతో ఆనంద్‌ ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని వెల్లడించారు. అంతేకానీ అతని మరణానికి తమకు సంబంధం లేదని వివరించారు.   

దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలి
బోయ ఆనంద్‌ది ముమ్మాటికీ పరువు హత్యే. అగ్రకుల యువతిని ప్రేమించాడనే కారణంతోనే హత్య చేశారు. బతుకు తెరువు కోసం బోయ ఆనంద్‌ బెంగళూరుకు వెళ్లినా.. అతన్ని స్వగ్రామానికి పిలిపించి హత్య చేయడం పలు అనుమానాలకు తావిస్తోంది. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పేద, బడుగు, బలహీన వర్గాలకు రక్షణ కరువైంది.దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలి.   – డాక్టర్‌ తలారి రంగయ్య,  వైఎస్సార్‌సీపీ కళ్యాణదుర్గం నియోజకవర్గ సమన్వయకర్త  

Videos

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

కడప మెగా డీఎస్సీలో మరో బాగోతం.. నకిలీ కుల ధృవీకరణతో ఉద్యోగమా..?

చైనా మాస్టర్స్ విజేతలకు YS జగన్ అభినందనలు

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)