Breaking News

రాష్ట్రంలో శాంతిభద్రతలు భేష్‌

Published on Wed, 10/25/2023 - 05:06

అనంతపురం క్రైం: సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మార్గనిర్దేశంలో పోలీస్‌ శాఖ అద్భుతంగా పని­చేస్తూ.. రాష్ట్రంలో శాంతిభద్రతలను సమర్థవంతంగా పరిరక్షిస్తుందని రాష్ట్ర హోంశాఖ మంత్రి తానేటి వనిత అన్నారు. అనంతపురం పోలీసు శిక్షణ కళాశా­లలో ట్రైనింగ్‌ పూర్తిచేసుకున్న 28 మంది ప్రొబే­షనరీ డీఎస్పీల పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌ను సోమవారం పీటీసీ ఆవ­రణలో ఘనంగా నిర్వహించారు. ముఖ్య­అతిథు­లుగా హోం మంత్రి తానేటి వనిత, డీపీజీ రాజేంద్రనాథ్‌ రెడ్డి హాజ­రయ్యారు.

హోంమంత్రి మాట్లాడుతూ.. దేశంలోనే ఎక్కడా లేనివిధంగా తొలిసారిగా రాష్ట్రంలో మహిళల భద్రత, రక్షణ కోసం సీఎం జగనన్న ‘దిశ’యాప్‌ తీసుకొచ్చి పోలీస్‌­స్టేషన్లు, ప్రత్యేక కోర్టులు తీసుకొచ్చారని గుర్తు చేశారు. రాష్ట్ర­వ్యాప్తంగా దిశ యాప్‌ ద్వారా 30,500 మంది మహిళలు సహా­యం పొందారని చెప్పారు. పోలీసుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. పోలీసు శాఖలోకి నూతనంగా ప్రవేశి­స్తున్న డీఎస్పీలు నిజాయితీగా, సమర్థవంతంగా, నిష్పక్ష­పాతంగా సేవలందించాలని సూచించారు.

డీజీపీ రాజేంద్ర­నాథ్‌రెడ్డి మాట్లాడుతూ సైబర్‌ నేరాల నియంత్రణ, సోషల్‌ మీడియా పోకడలను నియంత్రించేందుకు ప్రత్యేక దృష్టి పెట్టామని తెలి­పారు. పోలీసులు ఒత్తిడికి లోనుకాకుండా బాధితులకు సకా­లంలో సేవలందించేందుకు కృషి చేయాల­న్నారు. అనంతపు­రం పీటీసీ ప్రిన్సిపాల్‌ వెంకట్రామిరెడ్డి, వైస్‌ ప్రిన్సిపాల్‌ గీతా­దేవి, అనంతపురం, శ్రీసత్య­సాయి జిల్లాల ఎస్పీలు కేకేఎన్‌ అన్బురాజన్,  మాధవ­రెడ్డి, తాడిపత్రి బెటాలియన్‌ కమాండెంట్‌ గంగాధర్‌ రావు, అనంతపురం ఎంపీ తలారి రంగయ్య, పలువురు ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతి­నిధులు, పోలీసు అధికారులు పాల్గొన్నారు.

Videos

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినానో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)