Breaking News

రేపటి నుంచి పవిత్ర రంజాన్‌ మాసం ప్రారంభం!

Published on Sun, 03/10/2024 - 03:00

వన్‌టౌన్‌(విజయవాడపశ్చిమ): రంజాన్‌ మాసం ముస్లిం­లకు అత్యంత పవిత్రమైనది. ఈ మాసంలో చేసే ప్రతి ఆధ్యాత్మిక కార్యక్రమం ఎన్నో రెట్ల ఫలితా­లను అందిస్తుందని వారి విశ్వాసం. భగవత్‌ ఆశీస్సు­లు అందించే పవిత్ర రంజాన్‌ కోసం ముస్లింలు సంవత్సరమంతా ఎదురుచూస్తుంటారు. సోమవారం సా­యంత్రం ఆకాశంలో నెల పొడుపు కనిపిస్తే ఈ ఏడాది రంజాన్‌ మాసం ప్రారంభవుతుందని, మంగళవారం నుంచి ఉపవాస దీక్షలు మొదలవుతాయని ముస్లిం మత పెద్దలు తెలిపారు.

రోజా (ఉపవాస దీక్ష) పాటించే ముస్లింలు నమాజ్‌కు మొదటి ప్రాధాన్యతనిస్తారు. నమాజ్‌ కోసం అన్ని మసీదుల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. సూర్యోదయానికి ముందు(సహర్‌) నుంచి సూర్యాస్తమయం(ఇఫ్తార్‌) వరకు ఉపవాసదీక్షలు పాటిస్తారు. రోజుకు ఐదుపూటల నమాజు చేస్తారు. దీనికి అదనంగా రాత్రి 8.30 నుంచి 10గంటల వరకు సాగే ‘తరావీహ్‌’ నమాజులో ఖురాన్‌ పఠనం చేస్తారు.  

దానధర్మాలకు ప్రాధాన్యం: రంజాన్‌ మాసాన్ని దివ్య ఖురాన్‌ భూమిపై అవతరించిన మాసంగా భావిస్తా­రు. ఈ నెలలో ‘సఫిల్‌’ చదివితే ‘ఫరజ్‌’ చదివినంతగా... అంటే 70సార్లు నమాజ్‌ చేసిన పుణ్యం వస్తుందని ఇస్లాం గ్రంథాలు ప్రబోధిస్తున్నాయి. ఈ మాసంలో ముస్లింలు దానధర్మాలకు (జకాత్, ఫిత్రాకు)  ప్రా­ధాన్యతనిస్తారు. ఈ నెల రోజుల్లో చేసిన దానాలు 70­రెట్లు అధిక ఫలితాన్ని అందిస్తాయని వారి నమ్మకం. రంజాన్‌ మాసంలో ప్రతి ముస్లిం ఫిత్రా (నిర్ణీత దానం) తప్పనిసరిగా చేయాలని నియమం.   

హలీం రుచులు సిద్ధం: రంజాన్‌ మాసంలో లభించే ప్రత్యేక వంటకం హలీం. కొన్నేళ్ల క్రితం హైదరాబాద్‌ వరకే పరిమితమైన హలీం దశాబ్ద కాలంగా ఆంధ్రాలోని అన్ని నగరాలు, పట్టణాలకు విస్తరించింది. ముఖ్యంగా విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం వంటి నగరాల్లో పెద్ద ఎత్తున రంజాన్‌ స్పెషల్‌ హలీం విక్రయాల కోసం స్టాల్స్‌ ఏర్పాటు చేస్తున్నారు.

మానవులను సంస్కరించే మాసం 
మానవులను సంస్కరించి మంచి మార్గంలో పయనింపజేసేందుకు రంజాన్‌ మాసం దోహదపడుతుంది. మానవులు ఏ విధంగా నడుచుకోవాలి, దైవం, సమాజం పట్ల ఎటువంటి బాధ్యతలను నిర్వర్తించాలనే అంశాలను కూడా ఈ మాసం తెలియజేస్తుంది. మానవాళికి సర్వశుభాలను చేకూరుస్తుంది.  – షేక్‌ ఆసిఫ్, చైర్మన్, ఏపీ స్టేట్‌ మైనారిటీస్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌

Videos

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)