Breaking News

హిందుస్థాన్‌ స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ నకిలీ సంస్థ 

Published on Sat, 06/10/2023 - 04:38

సాక్షి, అమరావతి: హిందుస్థాన్‌ స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ స్టేట్‌ అసోసియేషన్‌కు, పాఠశాల విద్యాశాఖకు ఎటువంటి సంబంధం లేదని ఆ శాఖ కమిషనర్‌ సురేష్ కుమార్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. హిందుస్థాన్‌ స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ పేరుతో కొందరు వ్యక్తులు రాష్ట్రంలోని పాఠశాలలు, కళాశాలల్లో స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ సంస్థలో ఉద్యోగాలు ఇప్పిస్తామని ప్రచారం చేస్తున్నారని, నిరుద్యోగ యువత వారిని నమ్మి మోసపోవద్దని సూచించారు.

ఈ తరహా మోసపూరిత కార్యకలాపాలపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని కోరారు. రాష్ట్రంలో కొన్ని అనధికార సంస్థలు స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ పేరుతో కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం గుర్తించిన ఒకే ఒక్క సంస్థ భారత్‌ స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ అని, ఈ సంస్థ న్యూఢిల్లీలోని నేషనల్‌ అసోసియేషన్‌కు అనుబంధంగా ఆంధ్రప్రదేశ్‌లో ఉందని తెలిపారు.

అసోసియేషన్‌ ఆఫ్‌ గర్ల్‌ గైడ్స్‌ అండ్‌ గర్ల్‌ స్కౌట్స్‌ కూడా రాష్ట్రంలోని పాఠశాలలు, కళాశాలల్లో తన కార్యకలాపాలను కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు. హిందుస్థాన్‌ స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ స్టేట్‌ అసోసియేషన్‌ అనేది నకిలీ సంస్థ అని, రాష్ట్రంలో కార్యకలాపాలు కొనసాగించేందుకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్, రాష్ట్ర ప్రభుత్వంలోని ఏ ఇతర కార్యాలయాలు ఆ సంస్థకు ఎలాంటి అనుమతి ఇవ్వలేదని ఆయన 
స్పష్టంచేశారు.   

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)