Breaking News

కరెంట్‌ ‘కాలి’పోతోంది

Published on Mon, 06/03/2024 - 04:21

సాక్షి, అమరావతి: వేసవి ఉష్ణోగ్రత విద్యుత్‌ సరఫరా వ్యవస్థపై ప్రభావం చూపిస్తోంది. మునుపెన్నడూ లేనంతగా మండిపోతున్న ఎండలు, వర్షాలు, ఈదురుగాలులు, వడగండ్లు వంటి విపత్తుల కారణంగా కరెంటును పంపిణీ చేసే ట్రాన్స్‌ఫార్మర్లు, లైన్లు తీవ్రంగా దెబ్బతింటున్నాయి. ముఖ్యంగా సబ్‌ స్టేషన్లు అగ్ని గుండంలా మారుతున్నాయి. సాధారణంగానే వాటి వద్ద ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయి. ఈసారి ఆ పరిధిని మించి వేడి తరంగాలు చుట్టుముడుతున్నాయి.  

పవర్‌ ట్రాన్స్‌ఫార్మర్లు పనిచేసేలా చర్యలు  
ఎండలకు భయపడి జనం బయటకు రావ­డం తగ్గించారు. పాఠశాలలకు సెలవులు.  అవుట్‌డోర్‌ వర్క్స్‌ లేవు. ఇంట్లో ఉండి అన్ని ఎలక్ట్రికల్, ఎల్రక్టానిక్‌ ఉపకరణాలను ఉప­యోగిస్తున్నారు. ముఖ్యంగా ఇళ్లలో ఎసీల వినియోగం వల్ల ట్రాన్స్‌ఫార్మర్లపై ఊహించని భారం పడుతున్నది. ఒక ఇంటిలో ఒక ఏసీ వాడితే వచ్చే లోడ్‌ అకస్మాత్తుగా 500 వాట్స్‌ నుంచి 2 వేల వాట్స్‌గా మారుతోంది. ఇది రాత్రి సమయంలో సాధారణ హౌస్‌ డ్రాల్‌ కంటే 3 రెట్లు ఎక్కువ. దీనివల్ల ఎనిమిదేళ్లలో ఎప్పుడూ లేనంతగా ఎక్కువకు విద్యుత్‌ డిమాండ్‌కు చేరుకుంది. 

ఇంతలా కరెంట్‌ వాడకం రోజురోజుకూ పెరుగుతున్నప్పటికీ వ్యవస్థ దాదాపు స్థిరంగా ఉండడం విశేషం. ఈ పరిస్థితిని ముందే ఊహించి ట్రాన్స్‌ఫార్మర్ల సామర్థ్యాన్ని  పెంచడమే దీనికి కారణం. అయితే సాధారణ లోడ్‌ ఉన్పప్పుడు పవర్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ చమురు ఉష్ణోగ్రత 35 నుంచి 40 డిగ్రీలు ఉంటుంది. కానీ అసాధారణ లోడ్, వేడి వల్ల ట్రాన్స్‌ఫార్మర్‌ చుట్టూ 70 నుంచి 80 డిగ్రీల వేడి ఉంటోంది. 

విద్యుత్‌ సబ్‌ స్టేషన్లలో పనిచేస్తూ, ట్రాన్స్‌ఫార్మర్లæ నిర్వహణను చూస్తున్న అధికారులు,  సిబ్బంది ఇంత వేడిలో అక్కడ పనిచేయాలంటేనే భయపడిపోతున్నారు. అయినప్పటికీ విద్యుత్‌ సరఫరాలో ఆటంకం కలుగకూడదని, ప్రాణాలకు తెగించి విధులు నిర్వర్తిస్తూ, పవర్‌ ట్రాన్స్‌ఫార్మర్లు పనిచేసేలా చేస్తున్నారు.  

అన్నిటా పిల్లర్‌ మౌంటెడ్‌ ట్రాన్స్‌ఫార్మర్లు  
రాష్ట్రంలో అన్ని చోట్లా పిల్లర్‌ మౌంటెడ్‌ ట్రాన్స్‌­ఫార్మర్లు మాత్రమే పెట్టాలని విద్యుత్‌ సంస్థలు భావిస్తున్నాయి. అంటే అపార్ట్‌మెంట్లు, వాణిజ్య భవనాలు, పరిశ్రమల వద్ద పెట్టినట్లు గృహ, వ్యవసాయ అవసరాలకు కూడా సిమెంటు దిమ్మలపై ట్రాన్స్‌ఫార్మర్ల­ను పెట్టాలనుకుంటున్నారు. ప్రస్తుతం అనేక చోట్ల విద్యుత్‌ స్థంభాల మీద ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటు చేశారు. అవి గాలి, వానకు పడిపోతున్నాయి. 

స్థంభం కూలి­పోతే, దాని­పై ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌ను మార్చడానికి స­మయం పడుతోంది. ఈ లోగా విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని ముందుగానే అలాంటి ట్రాన్స్‌ఫార్మర్లు తీసేయాలని నిర్ణయించారు. కొన్ని చోట్ల 30 నుంచి 40 ఏళ్ల పాత కండక్టర్లు ఉన్నాయి. గత ప్రభుత్వాలు వాటిని పట్టించుకోకుండా వదిలేశాయి. దీంతో కొద్దిపాటి గాలివాన, ఎండకే అవి  తెగిపోతున్నాయి. వాటిని పూర్తిగా మార్చేసి, కొత్త లైన్లు వేసే పనిలో విద్యుత్‌ శాఖ ఉంది.  

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)