Breaking News

మూగ.. వేదన!

Published on Thu, 06/04/2026 - 05:02

సాక్షి, అన్నమయ్య: కూటమి సర్కార్‌లో మూగజీవుల వేదన అరణ్యరోదనగా మారింది. ఒకవైపు తీవ్రమైన కరువు పరిస్థితుల వల్ల తినడానికి మేత, తాగడానికి నీరు లేక రైతులు తమ పశువులను సాకలేక నిస్సహాయ స్థితికి చేరుకుంటే, మరోవైపు ఈ కష్టాలను అక్రమ వ్యాపారులు పెట్టుబడిగా మార్చుకుంటున్నారు. రాయలసీమ వ్యాప్తంగా ఉన్న ప్రధాన మార్కెట్ల నుంచి తక్కువ ధరలకే పశువులను కొనుగోలు చేసి, గుట్టుచప్పుడు కాకుండా పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడు, కేరళలోని కసాయి ఖానాలకు యథేచ్ఛగా తరలిస్తున్నారు. 

అక్రమ రవాణా మార్గాలు 
రాయలసీమలోని ప్రధాన కేంద్రాల నుండి పొరుగు రాష్ట్రాలకు ప్రతిరోజూ రెండు ప్రధాన మార్గాల ద్వారా ఈ అక్రమ రవాణా సాగుతోంది. ఒకటి బెంగళూరు మార్గం..వైఎస్సార్‌ జిల్లాలోని ప్రొద్దుటూ­రు, పులివెందుల, మైదుకూరు, కడప ప్రాంతాల నుండి పశువుల ను సేకరిస్తున్నారు. అక్కడి నుండి వాటిని రాయచోటి, మదనపల్లె మీదుగా కర్ణాటక రాజధాని బెంగళూరుకు తరలిస్తున్నారు. రెండో రూట్‌లో హిందూపురం, అనంతపురం, కదిరి, మదనపల్లె, పుంగనూరు, పలమనేరు మీదుగా భారీ కంటైనర్లలో మూగజీవాలను తమిళనాడు, కేరళ సరిహద్దులు దాటిస్తున్నారు. 

కంటైనర్లలో కుక్కి... ఊపిరాడక పశువుల మృతి! 
అక్రమార్కులు కేవలం డబ్బు సంపాదన మార్గంగా మార్చుకుని, పశువుల పట్ల అత్యంత క్రూరంగా వ్యవహరిస్తున్నారు. ఒక్కో భారీ కంటైనర్‌లో సామర్థ్యానికి మించి దాదాపు 70 నుండి 80 కి పైగా ఆవులు, ఎద్దులు, గేదెలను ఎలాబడితే అలా కుక్కుతున్నారు. అవి కదలకుండా ఉండేందుకు గట్టిగా తాళ్లతో కట్టేసి గంటల తరబడి నరకయాతన చూపిస్తున్నారు. అనంతపురం జిల్లా నుంచి పెద్దమండ్యం మీదుగా మంగళవారం ఉదయం వెళ్తున్న 10 భారీ కంటైనర్లను తనిఖీ చేయగా ఈ దారుణం బయటపడింది. ఆయా వాహనాలలో మొత్తం 510 పైగా మూగజీవాలను అక్రమంగా తరలిస్తుండగా, గాలి కూడా ఆడని రీతిలో ఒకదానిపై ఒకటి కుక్కడం వల్ల ఊపిరాడక పలు పశువులు కంటైనర్లలోనే మృత్యువాత పడటం స్థానికులను తీవ్రంగా కలిచివేసింది.  

చెక్‌ పోస్టుల వద్ద ‘అమ్యామ్యాలు’..  
ఈ అక్రమ రవాణా అంతా అధికారులకు తెలిసినా ఎవరికీ తెలియనట్లుగా సాగిపోతుండటం గమనార్హం. జిల్లా సరిహద్దుల్లోని చెక్‌పోస్టుల వద్ద పోలీసులు, సంబంధిత అధికారులు అక్రమార్కుల వద్ద ’చేయి తడు పుకుంటూ’ వాహనాలను వదిలేస్తున్నారనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. నోరు లేని మూగజీవాలకు  విపత్కర పరిస్థితులు ఎదురవుతున్నా పరిరక్షించా ల్సిన ప్రభుత్వ అధికారులు చేష్టలుడిగి చూస్తున్నారని జీవకారుణ్యమూర్తులు మండిపడుతున్నారు. ఇప్ప టికైనా ప్రభుత్వం ప్రత్యేక నిఘా పెట్టి ఈ మాఫియా ఆటకట్టించాలని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు.

రవాణాను అడ్డుకున్న ప్రజలు
పెద్దమండ్యం/గాలివీడు: అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గం పెద్దమండ్యం మండల కేంద్రంలో  పశువుల అక్రమ రవాణా కలకలం రేపింది. 10 కంటైనర్‌లలో 510 పశువులను తరలిస్తుండగా.. స్థానిక యువకులు అడ్డుకున్నారు. రాష్ట్రంలోని అనంతపురం, హిందూపురం, గోరంట్ల, పత్తికొండ తదితర ప్రాంతాల నుంచి ఈ పశువుల రవాణా జరుగుతున్నట్లు తెలుస్తోంది. అక్కడి రైతులు, వ్యాపారస్తుల నుంచి కొనుగోలు చేసి తరలించేందుకు ప్రత్యేకంగా రూపొందించిన కంటైనర్‌లను వినియోగిస్తున్నారు. 

వీటి రవాణా వెనుక బడాడాన్‌ ఉన్నట్లు తెలుస్తోంది. కదిరి నియోజకవర్గంలోని నల్లచెరువు ప్రాంతానికి చెందిన ఒకరు సూత్రధారిగా ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్థానిక యువకులు తంబళ్లపల్లె పోలీసులకు సమాచారం అందించారు. వారు వచ్చి కంటైనర్‌లను అదుపులోకి తీసుకున్నారు. ఈ కంటైనర్‌లలో 165 ఎద్దులు, 345 దున్నపోతులు, ఎనుములు ఉన్నాయి. 

వీటిని పుంగనూరు, తమిళనాడు, కేరళ ప్రాంతాలలో జరిగే సంతలకు తరలిస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుతం వాటికి రాయచోటి సమీపంలోని మామిడి తోటలో వసతి, సంరక్షణ కల్పించారు. అలాగే గాలివీడు మండల కేంద్రంలోని వెలిగల్లు ప్రాజెక్టు సమీపాన అక్రమంగా తరలిస్తున్న గోవులను  పోలీసులు స్వా«దీనం చేసుకుని విచారణ చేపట్టారు.  

పోలీసుల కళ్లుగప్పేందుకు ‘హైటెక్‌’ వ్యూహాలు! 
అధికారులకు చిక్కకుండా ఉండేందుకు ఈ అక్రమ రవాణా ముఠాలు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుతున్నాయి. పశువుల కంటైనర్‌ కంటే ఒక కిలోమీటరు ముందే ఒక ‘పైలట్‌ వాహనం’ (కార్‌ లేదా బైక్‌) రోడ్డుపై వెళ్తుంటుంది. మార్గమధ్యంలో పోలీసులు లేదా అధికారులు తనిఖీలు చేస్తున్నట్లు కనిపిస్తే, వెంటనే వెనుక వస్తున్న కంటైనర్ల డ్రైవర్లను అప్రమత్తం చేసి దారి మళ్లిస్తారు. రవాణాకు ఉపయోగిస్తున్న ప్రతి కంటైనర్‌కు జీపీఎస్‌ ట్రాకింగ్‌ సిస్టమ్‌తో పాటు వాహనం ముందు భాగంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. దీనివల్ల ప్రధాన సూత్రధారులు ఆఫీసుల్లో కూర్చుని లైవ్‌లో రోడ్డు కదలికలను గమనిస్తూ అప్రమత్తం అవుతున్నారు.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)