Breaking News

ఆదేశాలిచ్చినా కౌంటర్లు వేయరా?

Published on Fri, 08/16/2024 - 05:32

సాక్షి, అమరావతి: తగినంత సమయం ఇస్తున్నా, ఆయా కేసుల్లో అధికారులు కౌంటర్లు దాఖలు చేయ­క­పోతుండటంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కేసుల విషయంలో అధికారులు మందకొడిగా ఉన్నారని, ఇలా నిద్రపోవడానికి వీల్లేదని స్పష్టం చేసింది. నంద్యాల జిల్లాలో లైమ్‌ స్టోన్‌ ఖనిజం ఉన్న భూములను అసైన్‌మెంట్‌ కింద భూమి లేని పేద­లకు ఇస్తున్నారని, దీని వెనుక బనగానపల్లి ఎమ్మె­ల్యే కాటసాని రామిరెడ్డి (ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే) ఉన్నారని, దీనిని అడ్డుకోవాలని కోరు­తూ అప్పటి మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి (ప్రస్తు­తం ఎమ్మెల్యే) 2023లో హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్‌) దాఖలు చేశారు. 

ఈ వ్యా­జ్యంపై గతంలో విచారణ జరిపిన సీజే ధర్మా­సనం అన్ని వివరాలతో మెరుగైన అఫిడవిట్‌ దాఖలు చేయా­లని కలెక్టర్‌ను ఆదేశించింది. కేంద్ర గనుల మంత్రిత్వ శాఖ కార్యదర్శిని సుమోటోగా ప్రతివాదిగా చేరుస్తూ కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశించింది. తాజాగా ఈ వ్యాజ్యం బుధవారం మరోసారి ప్రధా­న న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ ధీరజ్‌ సింగ్‌ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్‌ చీమలపాటి రవి ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. గతంలో ఆదేశాల మేరకు కౌంటర్లు దాఖలు కాలేదని తెలుసుకున్న ధర్మాసనం ‘అసలు మీరు (అధికా­రులు) కోర్టును సీరియస్‌గా తీసుకుంటున్నారా.. లేదా?’ అంటూ తీవ్ర స్వరంతో ప్రశ్నించింది. 

కౌంటర్‌ దాఖలు చేసేందుకు మరో అవకాశం ఇస్తున్నామని, అయితే అసాధారణ జాప్యానికి గాను కేంద్ర కార్యదర్శికి రూ.20 వేలు, కలెక్టర్‌కు సైతం రూ.10 వేలు ఖర్చు­లు విధిస్తున్నట్లు తెలిపింది. ఈ మొత్తాన్ని అడ్వొకేట్స్‌ క్లర్కుల సంక్షేమ నిధిలో జమ చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై ఇలా జాప్యం చేసే ప్రతి కేసులోనూ జరిమానా విధిస్తామని తేల్చి చెప్పింది. తదుపరి విచారణ నాటికి మెరుగైన అఫిడవిట్‌ను దాఖలు చేయాల్సిందేనని స్పష్టం చేస్తూ విచారణను సెప్టెంబర్‌ 11వ తేదీకి వాయిదా వేసింది. 

Videos

ఓటమి భయంతోనే.. చంద్రబాబు అండ్ కో దాడులు

నామినేషన్ కేంద్రాల వద్ద రాళ్ల గుట్టలు.. YSRCP నేతలే టార్గెట్..!

టైగర్ ష్రాఫ్ కేసులో కొత్త కోణాలు..

ఏపీ మున్సిపల్ ఎన్నికలపై సుప్రీంకోర్టు దృష్టి..

పచ్చ కుట్ర జోరు.. రూ.600, బిర్యానీ ప్యాకెట్లు.. ఎన్నికల వేళ విద్యార్థులకు ఎర..

గుర్తుపెట్టుకో అనిత.. మేమిచ్చే రిటర్న్స్ గిఫ్ట్ కి దిమ్మతిరిగి బొమ్మ కనపడుద్ది

పులివెందులలో YS అవినాష్ రెడ్డిపై కాల్పులు

వీళ్లు అసలు పోలీసులా రౌడీలా... YSRCP నేతలపై దాడులు.. సజ్జల స్టాంగ్ రియాక్షన్

అర్ధరాత్రి కాసు మహేష్ రెడ్డి హౌస్ అరెస్ట్.. పల్నాడులో హైటెన్షన్...

ఏపీలో నేటి నుంచి పరిషత్ పోరు.. నామినేషన్ల వేళ టెన్షన్!

Photos

+5

అపరంజి బొమ్మలా నభా నటేశ్ (ఫొటోలు)

+5

ఏపీలో ప్రసిద్ధి చెందిన లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం ఎక్కడో తెలుసా?

+5

విజయవాడ : భవానీ భక్తులతో ఎరుపెక్కిన ఇంద్రకీలాద్రి (ఫొటోలు)

+5

విజయదశమి శుభాకాంక్షలు చెప్పిన సెలెబ్రెటీలు (ఫొటోలు)

+5

యాంకర్ అనసూయ ఇంట్లో దసరా సెలబ్రేషన్ ఇలా (ఫొటోలు)

+5

ఫ్యాషన్ షో కోసం తృప్తి దిమ్రి క్రేజీ గ్లామర్ (ఫొటోలు)

+5

దసరా స్పెషల్.. చూడముచ్చటగా విజయ్-రష్మిక జంట (ఫొటోలు)

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌