Breaking News

పుట్టింటి గోవు.. ఆ ఇంటికి ఆదరువు

Published on Sat, 01/11/2025 - 05:02

కుమార్తెకు పెళ్లిచేస్తే.. తోడుగా గోవును సాగనంపడం కొన్ని కుటుంబాల్లో ఆచారం. ఆస్తిపాస్తులు లేని గ్రామీణ పేదలు ఇలా గోవును కట్నంగా సమర్పించుకోవడం ఆనవాయితీ. ఆ నూతన వధూవరులిద్దరూ కట్నంగా వచ్చిన గోవును వరంగా భావించి.. దానిలోనే మహాలక్ష్మిని చూసుకు­న్నారు.

పుట్టింటి కానుకతో మెట్టినింట కాసుల పంటగా మలుచుకున్నారు. ఆ గోవుతో ఏకంగా 150 ఆవుల పాడిని సృష్టించారు. నలుగురు పిల్లల పెళ్లిళ్లు మంద ఆదాయంతోనే కానిచ్చారు. కరువు సీమలో ఒక్క ఆవుతో కరువును జయించి ఎందరికో ఆదర్శంగా నిలుస్తోంది అయ్యమ్మ, వీరారెడ్డి కుటుంబం.  – మంత్రాలయం

ఆ ఇంట అదే కామదేనువు
కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గంలోని కౌతాళం మండలం ఎరిగేరి గ్రామానికి చెందిన మూకయ్య, బంగారమ్మ దంపతుల పెద్ద కుమార్తె అయ్యమ్మ. ఆమెకు 18వ ఏట కోసిగి గ్రామానికి చెందిన కామన్‌దొడ్డి వీరారెడ్డితో వివాహం నిశ్చయించారు. మూకయ్య స్థోమతకు తగ్గట్టు అయ్యమ్మకు కట్నంగా గోవును ఇవ్వాలని నిర్ణయించి సుమారు 30 ఏళ్ల క్రితం పెళ్లి బాజాలు మోగించారు. అప్పగింతల రోజున తండ్రి మూకయ్య ఓ పెయ్యి ఆవును అయ్యమ్మకు ఇచ్చి భర్తతో మెట్టినింటికి సాగనంపాడు. 

అయ్యమ్మ, వీరారెడ్డి అనుబంధం వరకట్నంగా వచ్చిన ఆవుతోనే మొదలైంది. గోవునే వరలక్ష్మిగా భావించి.. కూలీనాలి చేసుకుంటూ ఆ దంపతులిద్దరూ గోవును పెంచుకున్నారు. తొలి చూడిలోనే అది మరో పెయ్యి దూడకు జన్మనిచ్చింది. ఇలా ఏడాదికి  రెండు ఆవుల చొప్పున జన్మించగా.. పుట్టిన ఆవుల సంతతిని విక్రయించకుండా కుటుంబ పోషణకు వనరుగా ఆ దంపతులు మలచుకున్నారు. 

కూలి పనులు మానేసి పశువులను పోషించుకుని కుటుంబాన్ని చక్కదిద్దుకుంటూ వచ్చారు. ఇలా 30 ఏళ్లలో ఆవుల సంతతి 150కి పెరిగింది. వారింట అడుగుపెట్టిన గోవు సుమారు 16 ఏళ్ల క్రితం మరణించగా.. దాని సంతతి మాత్రం ఇప్పటికీ వృద్ధి చెందుతూనే ఉంది.

వలసబాట పట్టకుండా..
ఏటా వయసు మళ్లిన ఆవులు, దూడలను విక్రయిస్తూ అయ్యమ్మ, వీరారెడ్డి దంపతులు బాగానే కూడబెడుతున్నారు. ఏటా 10 టన్నులకు పైగా ఆవు పేడను సైతం రైతులకు విక్రయిస్తూ ఆదాయం గడిస్తున్నారు. ప్రస్తుతం ఈ దంపతుల వద్ద 50 గోవులు ఉన్నాయి. కోసిగి ప్రాంతం కరువుకు ప్రసిద్ధి. ఇక్కడ వ్యవసాయ పనులు ముగియగానే ప్రజలంతా ఇతర ప్రాంతాలకు వలసపోతుంటారు. 

సుదూర ప్రాంతాలకు వెళ్లి బతుకు బండి నడుపుకుంటారు. ఏటా ఎంత లేదన్నా 15 వేల కుటుంబాలకు పైగా ఇక్కడి నుంచి వలస వెళ్తారు. అయితే, అయ్యమ్మ కుటుంబం ఏ ఒక్కరోజు వలసబాట పట్టలేదు. పాడితో కరువును జయించడం ఎలాగో అయ్యమ్మ కుటుంబానికి చూస్తే బోధపడుతుంది.

ఊపిరి ఉన్నంత వరకు వదలను
మా అయ్యకు మేం ఐదుగురు కూతుళ్లం. నేను పెద్ద కూతుర్ని. మా నాన్న ఓ ఆవును కట్నంగా ఇచ్చాడు. తోబుట్టువులు నలుగురికి ఒక్కో ఆవును కట్నంగా ఇచ్చాడు. నేను అదే ఆవుతోనే జీవితం ఆరంభించాను.  ఊపిరి ఉన్నంతవరకు పాడి పోషణను వదలను.  నేను తనువు చాలించినా పాడిని వదల పెట్టవద్దని నా పిల్లలకు చెబుతాను. గోవులు లేకుంటే మా బతుకు ఎలా ఉండేదో ఊహించలేను.     – కామన్‌దొడ్డి అయ్యమ్మ, కోసిగి

ఎప్పుడూ ఇబ్బంది పడింది లేదు
అత్తమామలు ప్రేమతో ఆవును కట్నంగా ఇచ్చారు. దానిని మేం దైవంగా స్వీకరించాం. ఆవు పోషిస్తూ పాడిని పెంచాం.  ఏనాడూ పాడి పోషణలో విసుగు చెందలేదు. ఇబ్బంది పడింది కూడా లేదు. 

ఇద్దరం పాడిని చూసుకుంటూ సంసారం కొనసాగించాం. మేం ఇప్పటివరకు కరువును చూడలేదు. ఇక్కడి నుంచి ఎంతోమంది వలసపోతున్నారు. మేం మాత్రం ఏ రోజూ వెళ్లలేదు. మా మామ మూకయ్య నేటికీ మా ఆదర్శ జీవనంపై ఆనందం వ్యక్తం చేస్తాడు. – కామన్‌దొడ్డి వీరారెడ్డి, కోసిగి

పైసా అప్పు లేకుండా పెళ్లిళ్లు
అయ్యమ్మ, వీరారెడ్డి దంపతులకు రాముడు, ఈరయ్య, వీరభద్ర, మహేష్, కుమార్తె రామేశ్వ­రమ్మతో కలిపి ఐదుగురు సంతానం. పెద్ద కుమా­రుడు రాముడికి 20వ ఏట వివాహం జరిపించారు. ఆ పెళ్లికి రూ.30 వేలు ఖర్చు కాగా.. మందలో కొన్ని దూడలను విక్రయించి గట్టెక్కారు. రెండో కొడుకు ఈరయ్యకు 21వ ఏట వివాహం జరిపించగా.. రూ.50 వేలు ఖర్చయ్యింది. దీంతో కొన్ని ఆవులు, దూడలను విక్రయించారు. 

మూడో కొడుకు వీరభద్ర పెళ్లికి రూ.1.50 లక్షలు ఖర్చు కాగా.. అందుకు కూ­డా లేగ దూడలను అమ్మి శుభకార్యం జరిపించారు. నాలుగో కుమారుడు మహేష్‌కు రెండేళ్ల క్రితం వివా­హం చేయగా.. రూ.3 లక్షలు ఖర్చయ్యింది. ఆ మొ­త్తాన్ని కూడా కొన్ని దూడల్ని విక్రయించి సొమ్ము సమకూర్చుకున్నారు. ఇక ఒక్కగానొక్క కూతురు రామేశ్వరమ్మకు సంబంధాలు వెతుకుతున్నారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)