Breaking News

డ్రైవర్‌ లేని కారులా ‘జీరో అవర్‌’

Published on Sun, 11/17/2024 - 05:27

సాక్షి, అమరావతి: ‘జీరో అవర్‌.. డ్రైవర్‌లేని కారులా ఉంది.. సభ్యులు ప్రస్తావించే సమస్యలు ఎవరు రాసుకుంటున్నారో... ఎవరు చర్యలు తీసుకుంటున్నారో తెలియడం లేదు..’ అని టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్‌ ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో జీరో అవర్‌ను ఉద్దేశించి రవికుమార్‌ చేసిన వ్యాఖ్యలు చర్చను వేడెక్కించాయి. దీనిపై స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు స్పందిస్తూ నిండు సభలో అసత్యాలు మాట్లాడొద్దని రవికుమార్‌కు హితవు పలికారు. 
 
కొండవీటి వాగుపై బ్రిడ్జి కట్టాలి 
అమరావతికి కొండవీటి వాగు పెద్ద సమస్యగా మారింది. 2014–19 మధ్య దీనిపై బ్రిడ్జి మంజూరు చేశారు. కానీ కట్టలేదు. ఈ వాగు పొంగితే రాకపోకలు నిలిచిపోతున్నాయి. తక్షణమే బ్రిడ్జి కట్టాలి. అలాగే కోటేరు వాగుపై కూడా బ్రిడ్జి నిరి్మంచేలా చర్యలు చేపట్టాలి. – తెనాలి శ్రావణ్‌కుమార్, తాడికొండ ఎమ్మెల్యే
  
ఏపీఎస్పీ పోలీసులకు పదోన్నతుల్లేవ్‌ 
ఏపీఎస్పీ పోలీసులు ఏళ్ల తరబడి పదోన్నతులు లేకుండా ఇబ్బంది పడుతున్నారు. సివిల్‌ పోలీసులుగా కన్వర్షన్‌ చేయాలని దరఖాస్తులు చేసుకున్నారు. వీరికి కన్వర్షన్‌ అయినా ఇవ్వండి... లేకుంటే పదోన్నతులు, ఇంక్రిమెంట్లయినా ఇప్పించండి. 
– పెన్మెత్స విష్ణుకుమార్‌రాజు, ఎమ్మెల్యే, విశాఖ ఉత్తరం 

తుంగభద్ర 33 గేట్లు మార్చాలి 
75 ఏళ్ల చరిత్రగల తుంగభద్ర ఈ ఏడాది నీటితో కళకళలాడుతోంది. నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ తుంగభద్ర డ్యాం 33 గేట్లు మార్చాలని సిఫారసు చేసింది. ఇందుకోసం రూ.100 కోట్లు ఖర్చవుతుంది. ఈ ఖర్చును ఏపీ, కర్ణాటక ప్రభుత్వాలు భరించాలి.  – కాలవ శ్రీనివాసులు, రాయదుర్గం ఎమ్మెల్యే 
 


లో వోల్టేజీ సమస్య పరిష్కరించండి 
విద్యుత్‌ లో వోల్టేజీ సమస్య తీవ్రంగా ఉంది. ఈ కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. తగిన చర్యలు తీసుకుని లోవోల్టేజీ సమస్య పరిష్కరించాలి.   – పూసపాటి అదితి, ఎమ్మెల్యే, విజయనగరం  

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)