Breaking News

అయ్యో... ఎంత కష్టమొచ్చిందో!

Published on Wed, 07/01/2026 - 05:24

ఆమదాలవలస రూరల్‌: తాను లేకపోతే తన బిడ్డలు ఈ లోకంలో ఎలా బతుకుతారని కలత చెందిందో ఏమో ఆ మాతృహృదయం కర్కశంగా మారిపోయింది. అల్లారుముద్దుగా పెంచుకోవాల్సిన బిడ్డల గొంతు కోసం హతమార్చింది. ఆపై తానూ గొంతు కోసుకుంది.  ఈ హృదయ విదారక ఘటన శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం వెదుళ్లవలసలో మంగళవారం సంచలనం రేకెత్తించింది. ఆమదాలవలస రూరల్‌ మండలం వెదుళ్లవలసకు చెందిన తల్లి కూర్మాపు వరలక్ష్మి అనే మహిళ తన కుమార్తెలు భవానీ (3),  చాందిని (4నెలలు)లను గొంతుకోసి హతమార్చింది. ఆమె కూడా గొంతు కోసుకుంది. 

ప్రస్తుతం కొన ఊపిరితో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె భర్త రమణ వరంగల్‌లో కూలి పనులు చేస్తున్నారు. అత్త వేధింపులను తట్టుకోలేక పిల్లలను హతమార్చి ఆమె కూడా ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించినట్లు స్థానికులు చెబుతున్నారు. సోమవారం అర్ధరాత్రి రెండుగంటల వరకు అత్తాకోడళ్లు ఘర్షణ పడ్డారని, దీంతో అత్త వేధింపులు భరించలేక పిల్లలను హతమార్చినట్లు స్థానికులు చెబుతున్నారు. 

వేకువజామున ఈ ఘటన జరిగి ఉండవచ్చని, పొద్దున్నే అత్త తలుపులు తట్టగా స్పందన లేకపోవటంతో చుట్టు పక్కల ఉన్నవారిని పిలిచి చూడగా రక్తపు మడుగులో తల్లీపిల్లలు కనిపించారని తెలిపారు. శ్రీకాకుళం డీఎస్పీ వివేకానంద్, ఆమదాలవలస సీఐ బి.శ్రీనివాసరావు, ఎస్‌ఐ ఎస్‌.బాలరాజు ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేశారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)