Breaking News

మేం చెప్పే వరకూ ఆగండి

Published on Thu, 09/07/2023 - 04:42

సాక్షి, అమరావతి: ఈ ఏడాది పీజీ మెడికల్‌ కోర్సుల్లో ప్రైవేటు వైద్య కళాశాలల్లో యాజమాన్య కోటా రివైజ్డ్‌ ఫేజ్‌ –1 కౌన్సెలింగ్‌లో సీట్లు పొందిన అభ్యర్థులు సంబంధిత కాలేజీల్లో రిపోర్ట్‌ చేయవద్దని డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం బుధవారం ప్రకటించింది. రాజమండ్రిలోని జీఎస్‌ఎల్‌ కళాశాలలో ఎండీ– రేడియో డయగ్నోసిస్‌ కోర్సులో 14 సీట్లకు నకిలీ అనుమతులు జారీ అయినట్లు నేసనల్‌ మెడికల్‌ కమిషన్‌ (ఎన్‌ఎంసీ) మంగళవారం తెలిపింది.

దీంతో యాజమాన్య కోటా విద్యార్థుల ప్రవేశాల ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేశారు. విశ్వవిద్యాలయం మళ్లీ తెలిపే వరకూ విద్యార్థులు కళాశాలల్లో రిపోర్ట్‌ చేయద్దని రిజిస్ట్రార్‌ డాక్టర్‌ రాధికారెడ్డి కోరారు. ఇప్పటికే కళాశాలల్లో రిపోర్ట్‌ చేసిన, చేయని విద్యార్థులు విశ్వవిద్యాలయం నుంచి జారీ చేసే తదుపరి నిర్ణయం కోసం వెబ్‌సైట్‌ను చూస్తుండాలని సూచించారు. 

ఎన్‌ఎంసీకి వైద్య, ఆరోగ్య శాఖ లేఖ
నంద్యాల జిల్లా శాంతీరామ్, విజయనగరం జిల్లా మహారాజా, తూర్పుగోదావరి జిల్లా జీఎస్‌ఎల్‌ వైద్య కళాశాలల్లో నకిలీ అనుమతులతో పీజీ సీట్లు పెంచినట్లు వెల్లడవడంతో గత నెలలో నిర్వహించిన తొలి దశ కౌన్సెలింగ్‌ను విశ్వవిద్యాలయం రద్దు చేసింది. ఎన్‌ఎంసీ నుంచి స్పష్టత తీసుకుని తిరిగి మొదటి నుంచి కౌన్సెలింగ్‌ నిర్వహించి సోమవారం సీట్లు కే­టాయించింది. అయితే అనూహ్యంగా మంగళవా­రం మరో 14 సీట్లకు జీఎస్‌ఎల్‌ నకిలీ అనుమతులు ఉన్నాయంటూ ఎన్‌ఎంసీ పేర్కొంది.

దీంతో ఈ అంశంపై స్పష్టత కోసం వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్ర­ధాన కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు ఎన్‌ఎంసీకి లేఖ రాశారు. ఎన్‌ఎంసీ నుంచి వివరణ వచ్చాక తదుపరి చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. నకిలీ అనుమతులపై పోలీసులకు ఫిర్యా­దు చేసినట్టు ఎన్‌ఎంసీ సమాచారమిచ్చిందని తెలి­పా­రు. ఫిర్యాదు వి­వ­రాలను కోరామని చెప్పారు. విచారణకు రాష్ట్ర ప్ర­భు­త్వం నుంచి పూర్తి సహకారం అందిస్తామని తెలి­యజేశామన్నారు. మరో వైపు నకిలీ అనుమతుల అంశంపై మూడు క­ళా­శాలలకు విశ్వవిద్యాలయం వీసీ నోటీసులు జా­రీ చేసినట్టు తెలిపారు. 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)