Breaking News

యాడున్నరో.. ఎట్టున్నరో..?

Published on Fri, 03/06/2026 - 13:42

మార్కాపురం జిల్లా:  పశ్చిమాసియాలోని అరబ్‌ దేశాల్లో కమ్ముకున్న యుద్ధ మేఘాలు మార్కాపురం జిల్లాలోని వందలాది కుటుంబాలను తీవ్ర భయాందోళనకు గురిచేయడమే కాదు కన్నీళ్లు కురిపిస్తున్నాయి. జీవనోపాధి కోసం గల్ఫ్‌ దేశాలకు వెళ్లిన వారి పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. ఫోన్లు, వాట్సప్‌లు, వీడియో కాల్స్‌పై అక్కడి ప్రభుత్వాలు ఆంక్షలు విధించడంతోపాటు తాత్కాలికంగా నిలిపివేయడంతో బంధుమిత్రుల సమాచారం తెలియక వారి కుటుంబ సభ్యులు, సన్నిహితులు ఆందోళన చెందుతున్నారు. మార్కాపురం, కంభం, గిద్దలూరు తదితర ప్రాంతాలకు చెందిన సుమారు 100 మంది గల్ఫ్‌ దేశాలైన దుబాయ్, కువైట్, ఖతార్‌లో ఉంటున్నారు. పొట్ట చేతపట్టుకుని కొందరు, గల్ఫ్‌లో బంధువుల వద్దకు మరికొందరు వెళ్లారు. 

ఈ క్రమంలో ఇరాన్‌కు ఇజ్రాయేల్, అమెరికా మధ్య యుద్ధం తలెత్తడంతో గల్ఫ్‌ దేశాలకు విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ఎక్కడివారు అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. స్వదేశానికి వచ్చేందుకు ఏర్పాట్లు చేసుకున్నా విమానాల రద్దుతో ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. రోజురోజుకూ యుద్ధం తీవ్రరూపం దాల్చడంతో ఏ క్షణాన ఏ వార్త వినాల్సి వస్తుందోనని కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళన చెందుతున్నారు. 

అరబ్‌ దేశాల్లో ఉంటున్న వారు సాధారణంగా ప్రతి రంజాన్‌ పండగకు స్వగ్రామాలకు వచ్చి కొద్దిరోజులు ఉండి మళ్లీ అక్కడికి వెళ్తుంటారు. ఈసారి మాత్రం పండగ 15 రోజుల్లో ఉందనగా ఇరాన్‌పై ఇజ్రాయేల్, అమెరికా క్షిపనులతో విరుచుకుపడటం, ఇరాన్‌ భీకర ప్రతిదాడులకు దిగడంతో వారి ప్రయాణానికి అవాంతరం ఏర్పడింది. తాము స్వదేశానికి రాలేమంటూ పలువురు తమ బంధువులకు ఫోన్‌ చేసి సమాచారం ఇచ్చారు. గత సోమవారం మధ్యాహ్నం నుంచి అక్కడి ప్రభుత్వాలు వీడియో, వాట్సప్‌ కాల్స్‌ను నిలిపివేయడంతో మార్కాపురం, కంభం, గిద్దలూరు ప్రాంతాల్లో ఉంటున్న బంధువులు ఆందోళన చెందుతున్నారు.  

విమానం టికెట్‌ రద్దయింది  
నా కూతురు, అల్లుడు కువైట్‌కు సమీపంలోని ఫర్మేనియా సిటీలో ఉంటున్నారు. నేను ఫిబ్రవరి 18వ తేదీన వారి వద్దకు వచ్చాను. మార్చి 6వ తేదీన మళ్లీ మార్కాపురం వచ్చేందుకు విమానం టికెట్‌ బుక్‌ చేసుకున్నా. ఆదివారం ఉదయం ఊహించని విధంగా యుద్ధం ప్రారంభం కావడంతో విమాన టికెట్లు క్యాన్సిల్‌ చేశారు. కువైట్‌ మీద కూడా ఇరాన్‌ బాంబులు వేసింది. మా ప్రాంతంలో ప్రస్తుతానికి ప్రాణనష్టం లేదు. బయట కూడా ఎవరూ తిరగడం లేదు. కువైట్‌ రాజు మా ప్రాంతానికి వచ్చి యోగక్షేమాలు అడిగారు. కానీ, ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియడం లేదు. పరిస్థితులు త్వరగా చక్కబడితే బాగుంటుందని కోరుకుంటున్నాం.  
     – ఎన్‌.బద్రి, మార్కాపురం  

దుబాయ్‌లో టెన్షన్‌గా ఉంది  
నా కుమారుడు అబ్దుల్‌ రహీమ్‌ దుబాయ్‌లో ఐటీ వింగ్‌లో పనిచేస్తున్నాడు. యుద్ధం కారణంగా ప్రభుత్వం వాట్సప్, వీడియో కాల్స్‌ నిషేధించింది. అతి కష్టంమీద ఈ రోజు ఫోన్‌లో మాట్లాడాడు. ప్రస్తుతానికి వర్క్‌ఫ్రమ్‌ హోం కింద దుబాయ్‌లోని ఇంట్లోనే ఉంటున్నాడు. కానీ ఏ క్షణంలో ఏం జరుగుతుందోనని భయంగా ఉంది.  
    – అజీజ్, మార్కాపురం  

Videos

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

కడప మెగా డీఎస్సీలో మరో బాగోతం.. నకిలీ కుల ధృవీకరణతో ఉద్యోగమా..?

చైనా మాస్టర్స్ విజేతలకు YS జగన్ అభినందనలు

Photos

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విశాఖ : రహదారిపై బైఠాయించి సచివాలయ ఉద్యోగుల ఆందోళన (ఫొటోలు)