Breaking News

భయమేస్తోంది.. చచ్చిపోవాలనిపిస్తోంది

Published on Sun, 09/01/2024 - 05:44

సాక్షి, మచిలీపట్నం: గుడ్లవల్లేరు ఇంజనీరింగ్‌ కళాశాలలోని బాలికల హాస్టల్‌ వాష్‌రూమ్‌లో హిడెన్‌ కెమెరాల ఏర్పాటు ఘటనలో ఒక్కొక్క విద్యార్థినిదీ ఒక్కొక్క ఆవేదన. బంధువుల ఎదుట కొందరు తమ బాధను వెళ్లగక్కుతుండగా.. మరికొందరు స్నేహితులకు చెప్పుకుని కన్నీరు పెట్టుకుంటున్నారు. తాజాగా శనివారం ఓ విద్యార్థిని తన స్నేహితురాలికి ఫోన్‌ చేసి బాధతో ఏడ్చిన వాయిస్‌ బయటకు వచ్చింది. అందులో విద్యార్థిని చెప్పిన మాటలను పరిశీలిస్తే.. ‘ఆ అక్క ఎవరో తెలిసిందే. ఫోర్త్‌ ఇయర్‌ ఈసీఈ. ఆ అక్క ఫొటో కూడా చూశాం. ఆ అక్క అంటోంది రండి చూసుకుందాం అని. విత్‌ ప్రూఫ్‌లు ఉన్నాయని తెగేసి చెబు­తోంది.

గ్రౌండ్‌ ఫ్లోర్, పై ఫ్లోర్‌లో ఏదేదో అంటున్నారే. భయం వేస్తోందే. రెండు నెలల నుంచి పెడుతున్నారట. 300 వీడియోలు బయటకు వచ్చాయంటా. అందరూ అడుగుతున్నారే భయం వేస్తోంది. మా ఫ్లోర్‌లోనూ పెట్టారట ఏడుపొస్తోంది. చచ్చిపోవా­లనిపిస్తోందే బాబు. మేడంకు చెబితే బయటకు వస్తే డ్రగ్‌ కేసులో ఇరికిస్తామని అంటున్నారే. అలా.. ఇలా మాట్లాడు­తున్నారే. రవీంద్రబాబేమో చూసి చెబుతాడంటే.. వీడియోస్‌ చూసినాక చెబుతాడంట. ఇప్పటికి 300 వీడియోలు బయటకు వచ్చాయని మాత్రం అంటున్నారు. సీనియర్స్‌ ధర్నా చేస్తున్నారు. సీనియర్స్‌ ఏమో గొడవ పెడుతున్నారు.

మేడమ్, వార్డెన్స్‌ కర్రలు పట్టుకుని వెంటపడుతున్నారు. కానీ సీనియర్స్‌ చాలామంది ఏడుస్తున్నారే. రెండు నెలలనుంచి జరుగుతోదంట. అవతలేమో పొలిటీషియన్స్‌ అంట. మరి తెలియట్లా. అందుకనే భయపడుతున్నారు అడగటా­నికి. ప్లీజే ఎవరి దగ్గరైనా వీడియో ఉంటే ఇక్కడ వీడియో ప్రూఫ్‌ చూపిస్తేనే మమ్మల్ని పట్టించుకుంటారంట. లేకపోతే పట్టించుకోరంట. అసలు ఏడుపొచ్చేస్తోంది మా ఫ్లోర్‌లోనే కెమెరా దొరికిందంటే. ఓసే వీడియో పెడితే ఏదైనా చేస్తారంటే. లేకపోతే ఏమీ చేయరంటే. అడుగుతుంటే కర్రలు పెట్టి కొడుతున్నారు. అంత ఉందే మా హాస్టల్‌లో సిట్యువేషన్‌. అందరూ ఏడుస్తు­న్నారు’ అంటూ ఆమె కూడా ఏడుస్తూ తన బాధను చెప్పుకుంది.

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)