Breaking News

జూలైలో 5 శాతం క్షీణించిన జీఎస్టీ ఆదాయం

Published on Sun, 08/02/2026 - 05:25

సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వంలో మరోసారి రాష్ట్ర జీఎస్టీ(గూడ్స్‌ అండ్‌ సర్వీస్‌ ట్యాక్స్‌) ఆదాయం పడిపోయింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూలైలో రాష్ట్ర జీఎస్టీ ఆదాయం 5 శాతం క్షీణించింది. గతేడాది జూలైలో రూ.3,532 కోట్లుగా (సెస్‌ మినహాయించి) ఉన్న ఆదాయం ఈ ఏడాది 5 శాతం క్షీణించి రూ.3,366 కోట్లకు పరిమితమయ్యింది. రూ.1,993.83 కోట్లు కేంద్ర ఐజీఎస్టీ కింద సెటిల్‌మెంట్‌ చేయడంతో మొత్తంమీద నికర జీఎస్టీ ఆదాయంలో వృద్ధి నమోదయ్యిందని రాష్ట్ర ప్రధాన పన్నుల అధికారి ఎ.బాబు శనివారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. 

గతేడాదితో పోల్చితే ఐజీఎస్టీ కింద రూ.290.8 కోట్ల ఆదాయం అదనంగా వచ్చిందని దీంతో నికర జీఎస్టీ విలువ రూ.2,930 కోట్ల నుంచి రూ.3,268 కోట్లకు చేరిందన్నారు. ఇదే సమయంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొదటి నాలుగు నెలల కాలంలో ఆదాయం ఎటువంటి వృద్ధి లేకుండా రూ.14,954 కోట్లుగా నమోదయ్యింది. వ్యాట్, వృత్తిపన్ను వంటి అన్ని రకాల పన్నుల ఆదాయం కలుపుకుంటే ఈ ఏడాది ఏప్రిల్‌–జూన్‌ నెల కాలానికి రాష్ట్ర మొత్తం ఆదాయం రూ.20,466 కోట్లకు చేరుకుంది. 

#

Tags : 1

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)